శృతి సేథ్

From tewiki
Jump to navigation Jump to search

మూస:RefimproveBLP

Shruti Seth
Shruti Seth graces Festivelle Boss Lady event (05) (cropped).jpg
జననం18th December 1977
వృత్తిActor, Model
వెబ్‌సైటుwww.shrutiseth.org

శృతి సేథ్ భారతీయ టెలివిజన్, వి.జే మరియు చలనచిత్ర నటి.

జీవితచరిత్ర

శృతి సేథ్ భారతదేశంలోని గుజరాత్ నందు 18 డిసెంబర్ 1977న జన్మించింది. ఆమె అశోక్ అకాడెమిలో పాఠశాల విద్య అభ్యసించి, సెయింట్ జేవియర్ కళాశాల నుండి అర్ధశాస్త్రం మరియు వాణిజ్యశాస్త్రములందు పట్టభద్రురాలైనది.

వృత్తి జీవితం

శృతి సేథ్ ఒక మోడల్ గా తన వృత్తిని ప్రారంభించింది. సౌందర్యప్రపంచంలోకి తన ప్రవేశం అనుకోకుండా సంభవిందని ఆమె అంటుంది. ఆమెకు మోడెలింగ్ ఇష్టమా అని ఆ సమయంలో అనేకమంది అడిగినప్పుడు, అది తన ప్రస్తుత అదనపు ఖర్చులకు మాత్రమే అన్నది. మోడలింగ్ వృత్తిలో ఉన్న కాలంలో ఆమె నటించిన అనేక వ్యాపార ప్రకటనలలో క్లీన్ అండ్ క్లియర్ మాయిస్చరైజర్, టాటా హోం ఫైనాన్స్, పాండ్స్ టాల్క్, ఫ్రూటి, లైఫ్ బాయ్ సోప్, ఐసిఐసిఐ ప్రూడెన్క్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్, యల్.జి, ఎయిర్ టెల్, మిసెస్ మారినో హెయిర్ సాఫ్ట్నర్, స్టే ఫ్రీ సెక్యూర్, డామినోస్ మొదలగునవి ఉన్నాయి. ఆమె తొలి వాణిజ్యప్రకటన క్లీన్ అండ్ క్లియర్ మాయిశ్చరైజర్.

ఆమె తుదకు టెలివిజన్ కు చేరింది. వృత్తిపరంగా మోడలింగ్ మరియు టెలివిజన్ లలో తన ప్రవేశము గురించి, శృతి సేథ్ "విధి నన్ను ఆ దిశగా పంపింది.. నేను కేవలం దానిని అనుసరించాను" అని చెప్పింది. ఛానల్ Vలో పనిచెయ్యడమే "నాకు ఈ బుల్లితెరపై స్థిరమైన చోటు కల్పించింది" అని కుడా ఆమె వెల్లడించింది.[1] ఆమె ఛానెల్ V ఇండియా కొరకు, ఫస్ట్ డే ఫస్ట్ షో మరియు జంగ్లీ జ్యుక్ బాక్స్ నిర్వహించింది. ఆమె నటి ఫరిదాజలాల్ తో కలసిక్యోం హోతా హై ప్యార్ , దేష్ మే నికలా హోగా చాంద్ మరియు షరారత్(సిట్ కాం) వంటి అనేక ధారావాహికలలోను నటించింది. ప్రస్తుతం ఆమె సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ లో ప్రసారమవుతున్న రిష్తా.కామ్ లో కనిపిస్తుంది. ఒక ముఖాముఖిలో రిష్తా.కామ్ గురించి మాట్లాడుతూ "అవి (యష్ రాజ్ ధారావాహికలు ) టి.ఆర్.పీలను ఎంతమాత్రం పొందలేదు. కానీ, TVని ప్రధమస్థానంలో చూస్తున్నవారికి కాదు. టి.ఆర్.పీ వ్యవహారం మొత్తం వాస్తవాన్ని ఎంతో వక్రీకరిస్తుంది. ఒక బిలియన్ పైగా జనాభాలో 15,000 కుటుంబాలవారు యావత్ దేశం ఏది చూడాలని కోరుతోందో నిర్ణయించడాన్ని నేను నమ్మను. ఈ యష్ రాజ్ ధారావాహికలు అన్నీ TV చూడనివారి గురించి ఆలోచించినవి" అని ఆమె అన్నది. అదే ముఖాముఖిలో ఆమె ఇంకా మాట్లాడుతూ "TV లోని నా ధారావాహికను అభిమానించే ప్రేక్షకులు అందరూ లండన్, అమెరికా, దక్షిణఆఫ్రికా, ఆస్త్రేలియాలలోనే ఉన్నారు. భారతీయులు దీన్ని ఇష్టపడరని కాదు, ప్రచారం ఆశాభంగంగా ఉండి ధారావాహిక గురించి వారికి తెలియకపోవడం శోచనీయం" అన్నారు.[1]

ఆమె కొన్ని చలనచిత్రాలలో నటించింది. TV నుండి చలనచిత్రాల లోనికి వెళ్ళిన సందర్భంలో ఆమె మాట్లాడుతూ "వాస్తవంగా నేను దేని గురించి ఎటూ వెళ్ళలేదు. నేను TVలో చెయ్యను కేవలం చలనచిత్రాలలోనే చేస్తానని కాదు. నాకు ఎన్నో అవకాశాలకు మార్గాలు తెరుచుకుంటున్నాయి. నేను నాటక, చలనచిత్ర లేక TV వంటి ఏ మాధ్యమంలోనైనా ఉత్తేజాన్ని కలిగించే పనిని చేయాలనుకున్నాను" అని పేర్కొన్నారు.[1] బహుశా అమీర్ ఖాన్ మరియు కాజోల్ తో కలసి నటించిన ఫనా చిత్రంలో ఆమె పోషించిన ఫాతిమా "ఫేటీ" పాత్ర ద్వారా ఆమె ప్రసిద్ధిచెందింది. ఆమె యాష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన తర రమ్ పమ్ ( విడుదలయ్యింది)లో నటించింది మరియు 2010లో విడుదలయ్యే ప్రకాష్ ఝా యొక్క రాజనీతి చిత్రంలో కుడా ఆమెను చూస్తాము. రాజనీతి చిత్రంలో తన పాత్ర గురించి ఒక ముఖాముఖిలో మాట్లాడుతూ రాజనీతి చిత్రంలోని నా బలమైన పాత్ర నన్ను మూసపాత్రల పోషణ నుండి తప్పిస్తుందని భావిస్తున్నాను, ఎందుకనగా అటువంటి అయిష్టమైన పాత్ర నేను ధరిస్తానని ఎవ్వరు ఆశించరు" అని ఆమె అన్నది.[2]

చలనచిత్రాలు

టెలివిజన్

సంవత్సరం ధారావాహిక పాత్ర ఛానల్ గమనికలు
మాన్ బుల్లితెరపై శృతి ప్రవేశం
2004–2005 షరారత్ (సిట్కామ్) జియా స్టార్ ప్లస్ ఇండియా అమెరికాలో ఆదరణ పొందిన సబ్రిన, ద టీన్ ఏజ్ విచ్ ఆధారంగా, ప్రస్తుతం డిస్నీ ఛానల్ ఇండియా ద్వారా ప్రసారమవుతున్నది.
2001–2005 దేష్ మే నికలా హోగా చాంద్ స్టార్ ప్లస్ ఇండియా
మమ్ తుమ్ ఔర్ హమ్ ఆమె

(వ్యాఖ్యాత)

స్టార్ ప్లస్ ఇండియా
క్యోం హోతా హై ప్యార్ రమ్య స్టార్ ప్లస్
ధక్ ధక్క్ ఇన్ దుబాయ్ శీతల్ పటేల్ 9x పంజాబీ అబ్బాయిని పెళ్ళాడాలనే కోరికగల గుజరాతి అమ్మాయిగా నటిస్తున్నది.
మై దేశి టాప్ 20

ఆమె (వ్యాఖ్యాత)

జూమ్ TV
2007 కామెడీ సర్కస్ ఆమె

(వ్యాఖ్యాత)

సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్
2008 కామెడీ సర్కస్ 2 ఆమె

(వ్యాఖ్యాత)

సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్
కాంటే కి టక్కర్ ఆమె

(వ్యాఖ్యాత)

సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్
కామెడీ సర్కస్ 20-20 ఆమె

(వ్యాఖ్యాత)

సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్
2010–ప్రస్తుతం రిష్తా.కామ్ ' ఇషా మీర్ చందాని సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ యష్ రాజ్ వెంచర్

సూచనలు

బాహ్య లింకులు