"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

శ్రీభాష్యం అప్పలాచార్యులు

From tewiki
Jump to navigation Jump to search

మహామహోపాధ్యాయ శ్రీభాష్యం అప్పలాచార్యులు (ఆంగ్లం: Sribhashyam Appalacharyulu) వక్త, సాహితీ వ్యాఖ్యాత. ఈయన 1922 ఏప్రిల్ 6, శ్రీరామనవమి పుణ్యదినాన విశాఖపట్నం జిల్లా పద్మనాభం గ్రామంలో జన్మించారు.

శీర్షిక పాఠ్యం

. ఈయన విజయనగరం సంస్కృత కళాశాలలో విద్యాప్రవీణ, భాషాప్రవీణ చేశారు. తరువాత కాశీ విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో ఎమ్.ఎ. పట్టా పొందారు.

ఈయన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో తెలుగు పండితుడుగా, చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో సంస్కృత ఉపన్యాసకుడుగా పనిచేశారు. అభిజ్ఞాన శాకుంతలం, మేఘసందేశం వంటి కాళిదాసు మహాకావ్యాలపై యాభై వరకు ఉపన్యాసాలందించారు. ఉపనిషత్తులు, రామాయణం, తిరుప్పావై, భగవద్గీత, ద్రవిడ ప్రబంధాలపై ఉపన్యాసాలు చేసారు.

ప్రవచన శిరోమణిగా పేరెన్నికగన్న ఆచార్యులు ధనుర్మాసం లో ఆకాశవాణిలో అనుదినం ప్రవచనం చేసేవారు.

అప్పలాచార్యులు అందుకున్న పురస్కారాలు

  • డాక్టర్‌ పిన్నమనేని అండ్‌ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్‌ (1990)
  • రాజ్యలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు (1992)
  • అంబికా లిటరరీ అవార్డు (1994)
  • జగద్గురు పీఠ పురస్కారం (1998)
  • గోపాలోపాయనం అవార్డు (1999)
  • తెలుగుతల్లి అవార్డు (2000)
  • ఆచార్యులు ప్రవచనములు ఈ క్రింది అంతర్జాల చిరునామా నుండి వినగలరు.

https://web.archive.org/web/20110529081542/http://www.pravachanam.com/bhagavathgeetha/

బయటి లింకులు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).