శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల

From tewiki
Jump to navigation Jump to search
శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల
దస్త్రం:STGCMD Hyd.jpg
శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల
Typeప్రభుత్వ విద్యా సంస్థ
Established1952
Principalరాఘవ్‌ రాజ్‌భట్‌
Students1300
Address
ఈడెన్ బాగ్, రాంకోఠీ, హైదరాబాదు, తెలంగాణ
, , ,
Websitehttp://stgcmd.com/
దస్త్రం:Stgcmd logo.gif

శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల హైదరాబాదులోని ప్రసిద్ధిచెందిన సంగీత, నృత్య కళాశాల[1]. ఇది రాంకోఠీ ప్రాంతంలో కలదు. మొదట్లో ఈ కళాశాల సాంకేతిక విద్యాశాఖ నియంత్రణలో పనిచేసేది. ప్రస్తుతం భాషా సాంస్కృతిక శాఖ నియంత్రణలో ఉంది. ఇది పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది[2].

ఇది 1952 సంవత్సరంలో స్థాపించబడినది.

కోర్సులు

ఈ కళాశాలలో నాలుగు సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సు, రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సు ఈ క్రింది విభాగాలలో ప్రవేశ పెట్టారు[1].

  • కర్ణాటక సంగీతం (గాత్రం)
  • హిందుస్థానీ సంగీతం (గాత్రం)
  • కూచిపూడి నృత్యం
  • భరతనాట్యం
  • పేరిణి నృత్యం
  • కథక్‌ నృత్యం
  • వీణ
  • వేణువు
  • వయోలిన్
  • తబలా
  • మృదంగం
  • సితార్‌
  • డోలు

సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి అభ్యర్థికి కనీసం 10 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. డిప్లొమా కోర్సులో చేరడానికి ఆ విభాగంలో సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణుడై ఉండాలి.

పూర్వ విద్యార్థులు

ఈ కళాశాలలో చదువుకొన్న కొందరు కళాకారులు[1].

పూర్వ అధ్యాపకులు

ఈ కళాశాలలో పనిచేసిన కొందరు కళాకారులు[1].

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 వెబ్ మాస్టర్. "Sri Thyagaraja Government College of Music & Dance". stgcmd. Govt of Telangana Department of Language and Culture. Archived from the original on 16 డిసెంబర్ 2019. Retrieved 21 June 2020. Check date values in: |archive-date= (help)
  2. "తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల జాబితా". Archived from the original on 2020-06-23. Retrieved 2020-06-21.