శ్రుతకీర్తి

From tewiki
Jump to navigation Jump to search

శ్రుతకీర్తి కుశధ్వజుని కుమార్తె. శత్రుఘ్నుని భార్య. కుశధ్వజుడు జనకుని తమ్ముడు.

రామాయణం బాలకాండలో రాముడు శివధనుస్సును భంగం చేసిన తరువాత వీర్యశుల్కయైన సీతను రామునకిచ్చి పెండ్లి చేయాలని జనకుడు నిశ్చయించి విశ్వామిత్రుని అనుమతితో దశరధునికి కబురు పెట్టాడు. దశరధునికి తన వంశక్రమం చెప్పి, తన కుమార్తెలయిన సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం చేయసంకల్పించినట్లు తెలిపాడు. అనంతరం వశిష్ఠుడు, విశ్వామిత్రుడు సంప్రదించుకొని, కుశధ్వజుని కుమార్తెలలో మాండవిని భరతునికి, శ్రుతకీర్తిని శత్రుఘ్నునికి ఇచ్చి కళ్యాణం చేయమని సూచించారు. జనకుడు సంతోషంగా అంగీకరించాడు. ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో వారి వివాహాలు జరిగాయి.

మహాభారతము

1.శ్రుతకీర్తి అర్జునునకు ద్రౌపదియందు జన్మించిన పుత్రుఁడు. 2.శ్రుతకీర్తి వసుదేవుని చెలియలు. కేకయరాజైన ధృష్టకేతుని భార్య. ఈమె కొడుకులు ప్రతర్దనాదులు అయిదుగురు. 3.శ్రుతకీర్తి విక్రమార్కుని మాతామహుఁడు. ఇతనికి పుత్రులు లేనందున దౌహిత్రుఁడు అయిన విక్రమార్కుఁడు ఇతని రాజ్యము అగు ఉజ్జయినికి రాజు ఆయెను.