శ్లోకం

From tewiki
(Redirected from శ్లోకాలు)
Jump to navigation Jump to search

సంస్కృత భాషలో రెండు వాక్యాలను శ్లోకంగా వ్యవహరిస్తారు. ఇది కావ్య-కథనాలకు మూల పరిమాణం. శ్లోకాల ద్వారా ఒక విషయాన్ని, కథను తెలుపవచ్చు, శ్లోకాలు సాధారణంగా ఛందోబద్ధమై ఉంటాయి. అనగా వీటిలో యతి, లయ మరియు ప్రాసలు ఉంటాయి. ఛందోబద్ధమవటం వలన ఇవి త్వరగా కంఠస్థమవుతాయి. గురుకులాలలో గురు-శిష్య పరంపరగా జ్ఞానం మౌఖికంగా వారసత్వంగా రావటం వలన వీటికి ఈ రూపం వచ్చింది. అనుష్టుప్ ఛందస్సుకు పాత పేరే ఈ శ్లోకం. కానీ ఈ మధ్య సంస్కృతంలో రాసిన ఏ పద్యాన్ని లేక ఛందస్సు కలిగిన వాక్యాన్ని శ్లోకం అంటున్నారు.

శ్లోక స్వరూపము

అనుష్టుప్ ఛందస్సులో ఉన్న శ్లోకాన్ని ఈసుకుంటే, రెండు వాక్యాలలో ఉండే ఈ శ్లోకంలో ఒక్కో శ్లోకానికి 16 వర్ణాలు (అక్షరాలు) ఉంటాయి. ఒక్కో వాక్యానికి రెండు పాదాలు ఉంటాయి. ఒక్కో పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. ఒక్కో పాదం ఒక్కో శ్వాసలో పఠించాల్సి ఉంటుంది.

శ్లోకం అనే పదానికి గల నానార్ధాలు

సంస్కృతంలో శ్లోకం అనే పదానికి ఎన్నో అర్ధాలు ఉన్నాయి. వాటిలో కొన్ని:

  • ధ్వని, శబ్దము, అరుపు
  • పిలిచే పదం, పిలుపు, ఆహ్వానం
  • మెచ్చుకోలు, ప్రశంస, స్తుతి
  • యశము, కీర్తి
  • ఏదయినా గుణము లేదా విశేషము గురించి ప్రశంసాత్మక కథనం లేదా వర్ణన.

తెలుగువారిలో ప్రాచుర్యం పొందిన శ్లోకాలు

  • జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః

న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః
స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః

  • ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ ||

 గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః || ||

  • ఓంకార పంజరశుకీం

 ఉపనిషదుద్యానకేళి కలకంఠీం
 ఆగమ విపిన మయూరీం
 ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీం