"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

షేక్‌ మహబూబ్‌ బాషా

From tewiki
Jump to navigation Jump to search

షేక్‌ మహబూబ్‌ బాషా తెలుగు రచయిత. ఆయన ముస్లింల స్థితిగతులను గణాంకాలతో సహా సాధికారికంగా వివరిస్తూ, రాజ్యాంగం మైనార్టీలకు కల్పించిన హక్కులను విశ్లేషిస్తూ, ముస్లింలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగంలో రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించిన వీరి సుదీర్ఘ… వ్యాసం పలు వర్గాలలో చర్చకు కారణమై మంచి పేరుతెచ్చింది.

బాల్యము

షేక్‌ మహబూబ్‌ బాషా కడప జిల్లా పోరుమామిళ్ళలో 1976 నవంబరు 25న ఫాతిమా బీబీ, మహబూబ్‌ సాహెబ్‌ దంపతులకు జన్మించారు.ఆయన ఎం.ఎ., ఎం.ఫిల్‌. చదివారు. ఆయన చరిత్ర అధ్యాపకులు.

రచనా వ్యాసంగము

1996లో ప్రచురితమైన 'హిందూ-ముస్లిం' కవిత ద్వారా రచనా వ్యాసంగం ఆరంభం అయ్యింది . అప్పటి నుండి వివిధ తెలుగు-ఆంగ్ల పత్రికలలో కవితలు, వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ సమావేశాల (2004) లో సమర్పించి, ఆ తరువాత సంక్షిప్త రూపంలో వివిధ పత్రికలలో ప్రచురితమైన 'పాఠ్యపుస్తకాలలో మత తత్వ భావనలు' వ్యాసం ప్రచురితమైనది.

ఇష్టమైన రచన

రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన సాంఫిుక శాస్త్రాల్లోని చరిత్ర పాఠాల్లో మతతత్వం వాసనలు ఉన్నవన్న విషయాన్ని విశదం చేసిన వీరి సుదీర్ఘ… వ్యాసం రాష్ట్రంలోని పలు వర్గాలలో చర్చకు కారణమైంది. 'ఛిద్రమవుతున్న నెలవంక' శీర్షికన ముస్లింల స్థితిగతులను గణాంకాలతో సహా సాధికారికంగా వివరిస్తూ, రాజ్యాంగం మైనార్టీలకు కల్పించిన హక్కులను విశ్లేషిస్తూ, ముస్లింలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగంలో రిజర్వేషన్ల ఆవశ్యకతను వివరించిన ఈ సుదీర్ఘ… వ్యాసం పలు వర్గాలలో చర్చకు కారణమై మంచి పేరుతెచ్చింది. ఈ వ్యాసం కూడ సంక్షిప్త రూపంలో పలు పత్రికల్లో ప్రచురితమైంది. ఈ మేరకు సుమారు అరవై పరిశోధానాత్మక వ్యాసాలు తెలుగు, ఆంగ్ల పత్రికలలో ప్రచురితం అయ్యాయి. వీరి లక్ష్యం: ప్రవక్త మార్గంలో నడిచి దోపిడీ, పీడనలు లేని సమాజ నిర్మాణం, మతతత్వ భావజాలానికి, కులోన్మాదానికీ వ్యతిరేకంగా రాజీలేని పోరాటం సాగించడం.

ఆధారాలు

ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 52

మూలాల జాబితా