"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

షేన్ వార్న్

From tewiki
Jump to navigation Jump to search
షేన్ వార్న్
Shane Warne.jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు షేన్ కీత్ వార్న్
మారుపేరు Warney, Warnie, Hollywood
జననం దోషం: Need valid birth date: year, month, day
Upper Ferntree Gully, Victoria, ఆస్ట్రేలియా
పాత్ర Leg spin bowler, Lower order batsman
బ్యాటింగ్ శైలి కుడి చేతి వాటం
బౌలింగ్ శైలి కుడి చేతి వాటం లెగ్ స్పిన్నర్
అంతర్జాతీయ క్రికెట్ సమాచారం
తొలి టెస్టు (cap 350) 2 జనవరి [[1992]]: v భారత్
చివరి టెస్టు 2 జనవరి [[2007]]: v ఇంగ్లండ్
తొలి వన్డే (cap 110) 24 మార్చి 1993: v న్యూజీలాండ్
చివరి వన్డే 10 జనవరి 2005World XI v Asia XI
ODI shirt no. 23
దేశవాళీ క్రికెట్ సమాచారం
Years Team
1990/91–2006/07 Victoria (squad no. 23)
2000–2007 Hampshire (squad no. 23)
2008-ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ (squad no. 23)
కెరీర్ గణాంకాలు
టెస్ట్ క్రికెట్ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్FCLA
మ్యాచ్‌లు 145 194 301 311
పరుగులు 3,154 1,018 6,919 1,879
బ్యాటింగ్ సగటు 17.32 13.05 19.43 11.81
100s/50s 0/12 0/1 2/26 0/1
అత్యుత్తమ స్కోరు 99 55 107* 55
వేసిన బంతులు 40,704 10,642 74,830 16,419
వికెట్లు 708 293 1,319 473
బౌలింగ్ సగటు 25.41 25.73 26.11 24.61
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 37 1 69 3
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 10 n/a 12 n/a
అత్యుత్తమ బౌలింగ్ 8/71 5/33 8/71 6/42
క్యాచ్ లు/స్టంపింగులు 125/– 80/– 264/– 126/–

As of 29 మార్చి, 2008
Source: cricketarchive.com

షేన్ కీత్ వార్న్ (జననం 1969 సెప్టెంబరు 13) ఒక మాజీ ఆస్ట్రేలియా అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు, ఇతను క్రీడా చరిత్రలో ఒక గొప్ప లెగ్ స్పిన్ బౌలర్‌గా ప్రసిద్ధి చెందాడు.[1] మొత్తం ప్రదర్శనలు, అసాధారణ జనాకర్షణ మరియు అపఖ్యాతిని పక్కనబెడితే, అతని క్రీడా జీవితపు గణాంకాలు మొదటి రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలానికి చెందిన ఆస్ట్రేలియా లెగ్‌స్పిన్నర్లు బిల్ ఓ'రిల్లీ మరియు క్లారీ గ్రిమెట్‌ల కంటే వార్న్ సమర్థుడు మరియు ప్రమాదకరమైన బౌలర్ కాదని సూచిస్తాయి; అయితే నిలకడైన ప్రదర్శన మరియు ఆధునిక క్రీడపై అతను వేసిన ముద్ర షేన్ వార్న్‌ను ఆరాధ్య క్రికెటర్లలో ఒకటిగా నిలబెట్టాయి. వాస్తవానికి, 2000 సంవత్సరంలో, క్రికెట్ నిపుణుల కమిటీ ఒకటి ఈ శతాబ్దపు విజ్డన్ క్రికెటర్ల జాబితాలో వార్న్‌కు చోటు కల్పించింది, ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఐదుగురు ఆటగాళ్లలో బౌలర్ ఇతనొక్కడే కావడం గమనార్హం.

వార్న్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌ను 1992లో ఆడాడు, 708 వికెట్లు పడగొట్టి అతను టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు, ఈ రికార్డును తరువాత శ్రీలంకకు చెందిన ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 2007 డిసెంబరు 3న అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతను 1000కి పైగా వికెట్లు (టెస్ట్‌లు మరియు అంతర్జాతీయ వన్డేలు) పడగొట్టాడు, ముత్తయ్య మురళీధరన్ తరువాత ఈ మైలురాయిని చేరుకున్న రెండో బౌలర్‌గా వార్న్ నిలిచాడు.[2] కింది వరుసలో ఉపయోగకర బ్యాట్స్‌మన్‌గా జట్టుకు సేవలు అందించిన వార్న్ టెస్ట్ క్రికెట్‌లో 3000 పరుగులు సాధించాడు, ఒక్క సెంచరీ కూడా లేకుండా అత్యధిక టెస్ట్ పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్ రికార్డు ప్రస్తుతం అతని పేరుమీద ఉంది. మైదానం బయట వివాదాలతో అతని క్రీడా జీవితం కళంకమైంది; నిషేధిత పదార్థాన్ని వాడినట్లు తేలడంతో క్రికెట్ ఆడకుండా నిషేధాన్ని ఎదుర్కోవడం మరియు బుక్‌మేకర్ల నుంచి డబ్బు స్వీకరించడం ద్వారా క్రీడకు కళంకం తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కోవడం మరియు దాంపత్య ద్రోహానికి సంబంధించిన వివాదాలు అతడికి అపఖ్యాతి తెచ్చిపెట్టాయి.

ఆస్ట్రేలియాతోపాటు, అతను సొంత రాష్ట్రమైన విక్టోరియా తరపున ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ మరియు హాంప్‌షైర్ తరపున ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్ ఆడాడు. 2005 నుంచి 2007 వరకు హాంప్‌షైర్ జట్టుకు మూడు సీజన్లలో వార్న్ సారథ్య బాధ్యతలు నిర్వహించాడు.

జనవరి 2007లో ఆస్ట్రేలియా 5-0 తేడాతో ఇంగ్లండ్‌పై యాషెస్ సిరీస్ విజయం సాధించిన సందర్భంగా, వార్న్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వార్న్‌తోపాటు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో సమగ్ర భాగంగా ఉన్న మరో ముగ్గురు ఆటగాళ్లు, గ్లెన్ మెక్‌గ్రాత్, డామియన్ మార్టిన్ మరియు జస్టిన్ లాంగర్ కూడా ఇదే సమయంలో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు, దీంతో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్, ఈ సందర్భాన్ని "ఒక మహాయుగానికి ముగింపు"గా వర్ణించాడు.[3]

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తరువాత, వార్న్ హాంప్‌షైర్ తరపున 2007 సీజన్ మొత్తం ఆడాడు. 2008 ఇంగ్లీష్ క్రికెట్ సీజన్‌లో ఆడాల్సివుండగా, మార్చి 2008లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌కు అతను రిటైర్మెంట్ ప్రకటించాడు, క్రికెట్ వెలుపల తనకు ఉన్న ఆసక్తులపై మరింత దృష్టి కేంద్రీకరించేందుకు వీలుగా వార్న్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.[4] మార్చి 2008లో, వార్న్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌లో జైపూర్ జట్టు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడేందుకు వార్న్ ఒప్పందం కుదుర్చుకున్నాడు, ఈ సందర్భంగా అతను జట్టు సారథిగా మరియు కోచ్‌గా రెండు బాధ్యతలను నిర్వహించాడు. 2008 జూన్ 1న చెన్నై సూపర్ కింగ్స్‌తో హోరాహోరీగా జరిగిన టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో జట్టును అతను విజయపథంలో నడిపించాడు.

యువ మరియు ప్రారంభ క్రీడా జీవితం

ఫస్ట్-క్లాస్ ఆరంగేట్రం

1991లో వార్న్ అక్రింగ్టన్ క్రికెట్ క్లబ్‌లో చేరాడు. వార్న్‌కు ఈ సీజన్ బంతితో సంతృప్తికరంగా సాగింది, ప్రతి 15.4 పరుగులకు ఒక వికెట్ చొప్పున మొత్తం 73 వికెట్లు పడగొట్టాడు, అయితే బ్యాటింగ్‌లో మాత్రం 15.0 సగటుతో 330 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తం మీద ప్రదర్శన ఆకట్టుకోలేకపోవడంతో అక్రింగ్టన్ క్రికెట్ క్లబ్‌కు చెందిన కమిటీ 1992 లంకాషైర్ లీగ్‌కు అతడిని ఎంపిక చేయలేదు.

1991 ఫిబ్రవరి 15న వార్న్ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు, మెల్బోర్న్‌లోని జంక్షన్ ఒవల్‌లో పశ్చిమ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విక్టోరియా తరపున ఆడిన వార్న్ తొలి మ్యాచ్‌లో 0/61 మరియు 1/41 గణాంకాలు నమోదు చేశాడు. సెప్టెంబరు 1991లో జింబాబ్వేలో పర్యటించిన ఆస్ట్రేలియా బి జట్టుకు అతను ఎంపికయ్యాడు. నాలుగు-రోజుల మ్యాచ్‌లో బౌలింగ్‌లో అతను 7/52తో అత్యుత్తమ ప్రదర్శన చూపాడు. ఆస్ట్రేలియా తిరిగి వచ్చిన తరువాత డిసెంబరు 1991లో భారత్‌తో తలపడిన ఆస్ట్రేలియా ఎ జట్టులో సభ్యుడిగా ఉన్న వార్న్ 3/14 మరియు 4/42 గణాంకాలు నమోదు చేశాడు. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులో అప్పటికే సభ్యుడిగా ఉన్న పీటర్ టేలర్ తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు, దీంతో వారం తరువాత సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్‌తో జరిగే మూడో టెస్ట్ జట్టులోకి వార్న్‌ను ఎంపిక చేశారు.

అంతర్జాతీయ క్రీడా జీవితం

తొలి టెస్ట్ మ్యాచ్‌లో వార్న్ పేలవమైన ప్రదర్శన కనబరిచాడు, 45 ఓవర్లు బౌలింగ్ చేసిన అతను 150 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు (ఈ మ్యాచ్‌లో 206 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న రవి శాస్త్రి, వార్న్ బౌలింగ్‌లో డీన్ జోన్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు), ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి అతను 1/228 గణాంకాలు నమోదు చేశాడు; తరువాత అడిలైడ్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌లో 0/78 గణాంకాలు నమోదు చేశాడు, పేస్ బౌలర్లు అనుకూలంగా ఉండే పెర్త్‌లో WACA మైదానంలో ఐదో టెస్ట్ జరుగుతుండటంతో అతడికి ఈసారి జట్టులో చోటు కల్పించలేదు. అతని పేలవమైన ప్రదర్శన కొలంబోలో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా కొనసాగింది, ఈ ఇన్నింగ్స్‌లో అతను 0/107 ప్రదర్శన కనబరిచాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో వేసిన ఒక స్పెల్‌లో వార్న్ 11 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడంతో, ఆతిథ్య జట్టు ఈ ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది, దీని ద్వారా ఆస్ట్రేలియా విజయంలో అతను ముఖ్య పోత్ర పోషించాడు.

ఇదిలా ఉంటే, శ్రీలంకలో ఆడిన చివరి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో వార్న్ ప్రదర్శన సెలెక్టర్లను సంతృప్తి పరచలేకపోయింది, దీంతో వారు 1992-93 ఆస్ట్రేలియా సీజన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ జట్టు నుంచి అతడికి ఉద్వాసన పలికారు. వార్న్ స్థానంలో గ్రెగ్ మాథ్యూస్ ఆడాడు, మ్యాచ్ చివరి రోజు ఆస్ట్రేలియా బలమైన స్థితిలో ఉన్నప్పటికీ, స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై పర్యాటక జట్టు సభ్యులను అవుట్ చేయడంలో అతను విఫలమయ్యాడు. దీంతో మెల్బోర్న్‌లో జరిగిన రెండో టెస్ట్ జట్టులో మళ్లీ వార్న్‌కు చోటు కల్పించారు, ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అతను 7/52 గణాంకాలు నమోదు చేసి మ్యాచ్-విన్నింగ్ ప్రదర్శన కనబరిచాడు.

టెస్ట్ కెరీర్ ప్రారంభంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ, వార్న్ తన లెగ్ స్పిన్ మాయాజాలానికి విప్లవాత్మక క్రికెట్ ఆలోచనలను జోడించాడు, ఆచరణ చాలా కష్టంతో కూడుకున్న కారణంగా, లెగ్ స్పిన్‌ను అంతరించిపోతున్న కళగా క్రికెట్ అభిమానులు భావిస్తున్న తరుణంలో అతను దానికి తిరిగి ప్రాణం పోశాడు. మైదానంలో, మైదానం బయట అతను సృష్టించిన వివాదాలను పక్కనబెడితే, అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఆరంగేట్రానికి ముందు రెండు దశాబ్దాలుగా సాగుతున్న ఫాస్ట్ బౌలింగ్ ఆధిపత్యాన్ని వార్న్ తిరగరాశాడనే వాస్తవం క్రికెట్ భావితరాల్లో అతడికి సుస్థిర స్థానం కల్పించింది. టెస్ట్ క్రికెట్‌లో 1970వ దశకంలో భారతీయ స్పిన్ చతుష్టయం లేదా అబ్దుల్ ఖాదీర్ వంటి నాణ్యమైన స్పిన్ బౌలర్లు ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు డెన్నిస్ లిల్లీ మరియు జెఫ్ థామ్సన్ 1970వ దశకం ప్రారంభంలో క్రికెట్‌పై ఆధిపత్యం చెలాయించారు. అంతేకాకుండా, 1976 నుంచి 1990వ దశకం ప్రారంభం వరకు, ఫాస్ట్ బౌలర్లతో కూడిన బౌలింగ్ దళంతో వెస్టిండీస్ ఒక్క టెస్ట్ (కోపదారి మరియు వివాదాస్పద) సిరీస్‌ను మాత్రమే కోల్పోయింది. 1990వ దశకం ప్రారంభంలో, వెస్టిండీస్ ప్రాబల్యంలో తగ్గిపోతున్న సమయంలో, పాకిస్థాన్‌కు చెందిన వకార్ యూనిస్ మరియు వసీం అక్రమ్ ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర బౌలర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాస్తవ గణాంకాలతో కాకుండా వార్న్ తన బంతులతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. గాటింగ్ బంతులతో చికాకు పెట్టడం మరియు ఆపై ఆధిపత్యం సాధించడం ద్వారా అతను బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందికి గురిచేసేవాడు, ముఖ్యంగా ఇంగ్లండ్ మరియు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ వార్న్ బంతులను ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బందిపడేవారు, 1980వ మరియు 1990వ దశకాల్లో ఏమాత్రం ఉదాసీనంగా వ్యవహరించని వెస్టిండీస్ బౌలర్ల బెదిరిపోయే ఫాస్ట్ బౌలింగ్‌ను చూసి విసిగిపోయిన క్రికెట్ అభిమానులను తన బౌలింగ్ శైలితో వార్న్ ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డారైల్ కుల్లినాన్‌పై వార్న్ పూర్తి ఆధిపత్యం సాధించాడు, వార్న్ తనపై మానసికంగా పైచేయి సాధించడాన్ని అడ్డుకునేందుకు తాను మానసిక వైద్యుడి సాయం కూడా కోరానని కుల్లినాన్ తెలిపాడు.[5]

నిస్సారమైన పిచ్‌ల పై కూడా బంతిని అసాధారణంగా తిప్పగల తన సామర్థ్యానికి, వార్న్ క్రీడా జీవితం తరువాతి దశల్లో దోషాలులేని కచ్చితత్వం మరియు బంతుల్లో వైవిధ్యాన్ని (వీటిలో అతడు విసిరే ఫ్లిప్పర్ ప్రసిద్ధి చెందింది) కూడా జోడించాడు, తాను పాల్గొనే ప్రతి సిరీస్ ప్రారంభానికి ముందు "కొత్త" రకం బంతిని విసరబోతున్నట్లు విలేకరుల సమావేశాల్లో ప్రకటనలు చేసినప్పటికీ, చూసేందుకు బంతుల్లో వైవిధ్యం చాలా తక్కువగా ఉండేది. వార్న్ రిటైర్మెంట్ సందర్భంగా ఆస్ట్రేలియాకు చెందిన ఒక విలేకరి గిడియోన్ హైగ్ ఈ విధంగా చెప్పాడు: "ఆగస్టస్ ఇటుకలతో ఉన్న రోమ్ నగరాన్ని, పాలరాతి నగరంగా మార్చినట్లు చెప్పబడింది: ఇది వార్న్ మరియు స్పిన్ బౌలింగ్ విషయంలో కూడా నిజమవుతుందని పేర్కొన్నాడు." [6]

Page మూస:Quote box/styles.css has no content.
Where my ability to spin a cricket ball came from, I honestly don't know. I can only think that I was born with it. I have a skill as cricketer and fortunately cricket found me..[7]

– Shane Warne

ఇంగ్లండ్‌తో జరిగిన యాసెస్ సిరీస్ సందర్భంగా అతను అనేకసార్లు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనలు ఇచ్చాడు, ముఖ్యంగా, బాగా ప్రాచుర్యం పొందిన "గాటింగ్ బంతి", ఇది "బాల్ ఆఫ్ ది సెంచరీ"గా కూడా ప్రసిద్ధి చెందింది, 1993 యాషెస్ సిరీస్‌లో వార్న్ విసిరిన బంతి బాగా స్పిన్ తిరిగి, గందరగోళానికి గురైన మైక్ గాటింగ్ వికెట్‌ను‌ బౌల్డ్ చేసింది. ఇదిలా ఉంటే, భారత్‌పై, ముఖ్యంగా సచిన్ టెండూల్కర్‌కు మాత్రం అతను బౌలింగ్ చేసేందుకు బాగా ఇబ్బంది పడేవాడు: భారత్‌పై అతని బౌలింగ్ సగటు పేలవంగా కనిపిస్తుంది, ప్రతి వికెట్‌కు 47.18 పరుగులు సమర్పించాడు, అయితే మొత్తం మీద అతని సగటు 26 కంటే తక్కువగా ఉంది.[8] వార్న్ మాదిరిగానే, ఇతర విదేశీ స్పిన్నర్లు కూడా భారత్‌పై ఇటీవల సంవత్సరాల్లో పేలవమైన ప్రదర్శన కనబరిచారు; ఉదాహరణకు వార్న్‌కు సమకాలీన ఆఫ్-స్పిన్ ప్రత్యర్థి ముత్తయ్య మురళీధరన్‌కు కూడా మొత్తం టెస్ట్ గణాంకాలతో పోలిస్తే, భారత్‌లో ఆడిన మ్యాచ్‌ల్లో అతని బౌలింగ్ సగటు బాగా ఎక్కువగా (2009నాటికి 39.58) ఉంది.[9]

టెస్ట్ క్రికెట్‌తోపాటు, వన్డే క్రికెట్‌లో కూడా అత్యంత సమర్థవంతమైన బౌలర్లుగా గుర్తింపు పొందిన అతికొద్ది మంది లెగ్ స్పిన్నర్లలో వార్న్ కూడా ఒకడు. అంతర్జాతీయ వన్డేల్లో అతను అనేక సందర్భాల్లో ఆస్ట్రేలియాకు సారథ్య బాధ్యతలు నిర్వహించాడు, అతని సారథ్యంలో ఆడిన పది మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంగ్లండ్‌లో జరిగిన 1999 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో షేన్ వార్న్ కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికాపై సెమీ ఫైనల్‌ మరియు పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్‍‌ల్లో ప్రదర్శనలు అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సాధించిపెట్టాయి. 2003 ప్రపంచకప్ ముగిసిన తరువాత వన్డే క్రికెట్ నుంచి వైదొలగాలని వార్న్ భావించాడు: జనవరి 2003లో అతను చివరి మ్యాచ్ ఆడి, వన్డేల నుంచి అతను వైదొలిగాడు. అయితే 2005లో సునామీ బెనిఫిట్ మ్యాచ్ కోసం అతను ICC వరల్డ్ XI జట్టు తరపున ఆడాడు.

నిషేధిత పదార్థం వాడినట్లు నిరూపణ

ఫిబ్రవరి 2003లో, 2003 క్రికెట్ ప్రపంచకప్ ప్రారంభమవడానికి కొన్ని రోజుల ముందు, వార్న్ ఆస్ట్రేలియాలో ఇటీవల జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా జరిగిన డ్రగ్ పరీక్షలో విఫలమై స్వదేశానికి పిలిపించబడ్డాడు, వార్న్ నిషేధిత డైయూరేటిక్ వాడినట్లు మాదక ద్రవ్యాల పరీక్షలో తేలింది.

తన ఆహార్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నంలో భాగంగా - ప్రిస్క్రిప్షన్ డ్రగ్ మోడరెటిక్ - అనే పేరు గల ఒక "ద్రవరూప టాబ్లెట్" మాత్రమే వాడానని మొదట వార్న్ ప్రకటించాడు.[10]

అయితే చివరకు వచ్చే సరికి, ACB యొక్క మాదకద్రవ్యాల నిరోధక నియమావళిని వార్న్ ఉల్లంఘించినట్లు విచారణ సంఘం గుర్తించింది, అతనిపై ఏడాది నిషేధం విధించింది.[11] దీని తరువాత బయటకు తెలిసిన మరియు ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో వార్న్ ధ్రువీకరించిన విషయం ఏమిటంటే, అతను వాస్తవానికి రెండు మాత్రలు తీసుకున్నాడు.[ఆధారం చూపాలి] అతను తీసుకున్న పదార్థాన్ని, శరీరంలో మిగిలిన ఉత్ప్రేరకాలు ఉన్న విషయాన్ని దాచిపెట్టేందుకు ఉపయోగిస్తారు, అందువలన ఈ పదార్థంపై కూడా నిషేధం విధించారు. షేన్ వార్న్ మరియు అతని తల్లి వాంగ్మూలం విశ్వసించలేమని ఈ కేసులో న్యాయమూర్తి తీర్పు చెప్పారు.[ఆధారం చూపాలి]

ఆ సమయంలో, నిషేధం విధించడం తనకు టెస్ట్ క్రికెట్ కెరీర్‌ను పొడిగించుకునేందుకు ఉపయోగపడుతుందని వార్న్ భావించాడు.[12] ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొంటున్న సమయంలో, ఛారిటీ మ్యాచ్‌ల్లో ఆడేందుకు మాత్రం వార్న్‌ను అనుమతించారు, అయితే వార్న్‌ను ఆడేందుకు అనుమతించడంపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (WADA) విమర్శలు గుప్పించింది [13] ఇదిలా ఉంటే అనవసరంగా WADA ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందని వార్న్ కూడా విమర్శించాడు.[14]

తనపై నిషేధం విధించిన సమయంలో, సెయింట్ కిల్డా ఆస్ట్రేలియన్ రూల్స్ ఫుట్‌బాల్ క్లబ్‌లో సహాయక కోచ్‌గా పనిచేసే ప్రతిపాదనను పరిశీలించాడు, అయితే తరువాత ఉత్ప్రేరకాలు వాడి నిషేధం ఎదుర్కొంటున్న వ్యక్తి చేత ఆటగాళ్లకు సలహాలు ఇప్పించడం సమంజసం కాదని ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ లీగ్ సంబంధిత క్లబ్‌కు సూచించింది.[ఆధారం చూపాలి] వివిధ సెలెబ్రిటీ పార్క్ క్రికెట్ జట్లు తరపున కూడా ఆడేందుకు అతను ఆహ్వానాలు అందుకున్నాడు, కొత్తగా పేరు మార్చుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా ఒక కాంట్రాక్ట్ ఆటగాడిగా ఉన్న వార్న్‌ను ఇటువంటి మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతించడంపై తన నిర్ణయాన్ని మార్చుకుంది. వార్న్ నిషేధం సందర్భంగా ఆస్ట్రేలియాలో ఛానల్ 9కి TV వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

మార్చి 2004లో, వార్న్ వెస్టిండీస్‌కు చెందిన కోట్నీ వాల్ష్ తరువాత 500 టెస్ట్ వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా నిలిచాడు. 2004 అక్టోబరు 15న, చెన్నై‌లో భారత్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వార్న్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు, తన గొప్ప స్పిన్ బౌలింగ్ ప్రత్యర్థి, శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ రికార్డును వార్న్ ఈ సందర్భంగా అధిగమించాడు. ఆగస్టు 2005లో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన మూడో యాషెస్ టెస్ట్‌లో క్రీడా చరిత్రలో 600 టెస్ట్ వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 2005 సీజన్‌లో మొత్తం 96 వికెట్లు పడగొట్టి వార్న్ ఒక ఏడాదిలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. వార్న్‌లో ఉన్న భయంకరమైన క్రీడా ప్రదర్శన 2005 యాషెస్ సిరీస్ సందర్భంగా కట్టలు తెంచుకొని బయటకొచ్చింది, ఈ సిరీస్‌లో అతను 19.92 సగటుతో 40 వికెట్లు పడగొట్టాడు, బ్యాటుతో 249 పరుగులు సాధించాడు.

సంపన్నమైన (మరియు కొన్నిసార్లు ప్రభావవంతమైన) దిగువ ఆర్డర్ బ్యాటింగ్‌తో అతను ప్రత్యేక గుర్తింపు పొందాడు, ఒకసారి వార్న్ 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా, నిర్లక్ష్యపు షాట్ కొట్టి అవుటవడం బాగా ప్రాధాన్యత సంతరించుకుంది, ఎందుకంటే అతను అవుట్ అయిన బంతి తరువాత నో బాల్‌గా తేలింది. వాస్తవానికి, అందరు టెస్ట్ క్రికెటర్లలో ఒక్క సెంచరీ కూడా చేయకుండా వార్న్ అత్యధిక పరుగులు చేశాడు, రెండుసార్లు (99 మరియు 91) తొంబైల్లో అడుగుపెట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శనలుగా ఉన్నాయి. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో మొత్తం మీద ఎక్కువసార్లు డకౌట్‌లు అయిన ఆటగాళ్లలో వార్న్ మూడో స్థానంలో ఉన్నాడు. 2006లో వార్న్ మరియు గ్లెన్ మెక్‌గ్రాత్ మొదటి టెస్ట్ సెంచరీ సాధించడం కోసం పందెం కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది, మరో ఆస్ట్రేలియా బౌలర్ జాసన్ గిలెస్పీ టెస్ట్ సెంచరీ సాధించిన నేపథ్యంలో వీరు ఈ ఆసక్తికరమైన పోటీ పెట్టుకున్నారు, బంగ్లాదేశ్‌పై నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన గిలెస్పీ రికార్డు స్థాయిలో డబుల్ సెంచరీ నమోదు చేశాడు.

వార్న్ అద్భుతమైన ఒక స్లిప్ ఫీల్డర్ కూడా. ఈ పాత్రలో అతను మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు, టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్ల జాబితాలో వార్న్ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉన్నాడు.

యాషెస్, 2006-07

2006లో బ్రిస్బేన్ క్రికెట్ మైదానంలో ఇయాన్ బెల్‌కు బౌలింగ్ చేస్తున్న వార్న్ (కుడివైపు).

వార్న్ 2006/07 యాషెస్ సిరీస్‌లో బ్రిస్బేన్ టెస్ట్‌ను వైవిధ్యంగా ప్రారంభించాడు, అడిలైడ్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో వార్న్ తన సత్తా చాటాడు, కెవిన్ పీటర్సన్‌‍కు లెగ్‌సైడ్ నుంచి బౌలింగ్ చేస్తూ, ఐదో రోజున ఇంగ్లండ్ పతనానికి నాంది పలికాడు, ఈ విధంగా ఆస్ట్రేలియా చారిత్రాత్మక విజయంలో కీలకపాత్ర పోషించాడు. మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా వార్న్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు, ఆస్ట్రేలియా యాషెస్‌ను తిరిగి దక్కించుకునేందుకు మార్గం సుగమం చేసే మాంటీ పనేసర్ చివరి వికెట్‌ను వార్న్ పడగొట్టాడు.

ఈ పరిణామాల నేపథ్యంలో, కొన్ని రోజుల తరువాత, 2006 డిసెంబరు 21న వార్న్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు, ఇది SCGలో జరిగిన ఐదో యాషెస్ టెస్ట్ తరువాత అతడి ప్రకటన అమల్లోకి వచ్చింది. బాక్సింగ్ డే 2006న జరిగిన తన చివరి రెండో టెస్ట్ మ్యాచ్‌లో 700 వికెట్ల మైలురాయి చేరుకున్న తొలి క్రికెటర్‌గా అతను రికార్డు సృష్టించాడు. ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలనేది నా కోరిక, ఆస్ట్రేలియా గెలిచి ఉంటే 2005 యాషెస్ సిరీస్ తరువాతే నేను రిటైర్మెంట్ ప్రకటించి ఉండేవాడినని వార్న్ పేర్కొన్నాడు. రిటైర్మెంట్ ప్రకటన చేసిన వెంటనే వ్యాఖ్యాతలు టోనీ గ్రైగ్ మరియు మైక్ గాటింగ్ అతడిని ఇంటర్వ్యూ చేశారు, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి నుంచి మారుమోగనున్న ఈ వార్తను విన్నవారు ఆశ్చర్యం మరియు విచారం వ్యక్తం చేశారు. 2006 డిసెంబరు 26న 3.18 గంటలకు వార్న్ 700వ టెస్ట్ వికెట్‌ను సాధించాడు[15] (AEST) మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో దాదాపుగా చివరిసారి ఆడుతున్న వార్న్ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌ను ఆండ్ర్యూ స్ట్రాస్ అవుట్ చేయడం ద్వారా ఈ ఘనత దక్కించుకున్నాడు. ఒక ఆటగాడు తన కెరీర్‌లో 700 టెస్ట్ వికెట్లు దక్కించుకోవడం క్రీడా చరిత్రలో అదే తొలిసారి. ఈ వికెట్ "క్లాసిక్ వార్న్ డిస్మిసల్"గా వర్ణించబడింది, స్టేడియంలోని 89,155 మంది ప్రేక్షకులు నిలబడి అతడికి నీరాజనాలు అర్పించారు.[16]

SCGలో జరిగిన 2006 యాషెస్ సిరీస్ చివరి మ్యాచ్ వార్న్‌కు తన కెరీర్‌లో చివరి టెస్ట్‌గా నిలిచిపోయింది, సిడ్నీ ప్రేక్షకులు అతడికి ఘనమైన వీడ్కోలు పలికారు, ఇదే మైదానంలో జనవరి 2, 1992న వార్న్ టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. దీంతో, 15 ఏళ్లపాటు సాగిన అతని అంతర్జాతీయ క్రికెట్ జీవితానికి మొదలైన చోటే తెరపడింది.

చివరి టెస్ట్ మ్యాచ్‌లో, వార్న్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను మాంటీ పనేసర్‌ను lbwగా డకౌట్ చేశాడు, ఇది అతని 1000వ అంతర్జాతీయ వికెట్ (టెస్ట్‌లు మరియు వన్డేలు రెండూ కలిపి) కావడం గమనార్హం. ఈ టెస్ట్ మూడో రోజు చివరిలో వార్న్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆండ్ర్యూ ఫ్లింటాఫ్‌ను ఆడమ్ గిల్‌క్రిస్ట్ స్టంపౌట్ చేశాడు, అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో వార్న్‌కు ఇది చివరి వికెట్‌గా నిలిచిపోయింది.[17]

2007లో, క్రికెట్ ఆస్ట్రేలియా మరియు శ్రీలంక క్రికెట్ బోర్డులు వార్న్ మరియు ముత్తయ్య మురళీధరన్‌లకు గౌరవసూచకంగా ఆస్ట్రేలియా-శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు వార్న్-మురళీధరన్ ట్రోఫీ అనే పేరు పెట్టాలని నిర్ణయించారు[18]

వివాదాలు

వార్న్ ప్రతిభకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్నప్పటికీ, వృత్తిపరమైన జీవితం మరియు అతని వ్యక్తిగత జీవితం రెండింటిలోనూ మితిమీరిన చర్యలు కారణంగా, అభిమానులు మరియు క్రికెట్ అధికారిక యంత్రాంగాల్లో అతడి గుర్తింపుపై మిశ్రమ స్పందనలు ఉన్నాయి.

బుక్‌మేకర్‌లు

1994-95లో పిచ్ మరియు వాతావరణం గురించి సమాచారం అందించినందుకు "జాన్" లేదా "జాన్ ది బుక్‌మేకర్" అని పిలవబడిన ఒక భారత బుక్‌మేకర్ ఆస్ట్రేలియా క్రికెటర్లు మార్క్ వా మరియు షేన్ వార్న్‌లకు డబ్బు ఇచ్చాడు. అయితే, ఆటగాళ్లు ఈ సందర్భంగా జట్టు ఎత్తుగడలు మరియు ఆటగాడి ఎంపిక విధానాలు వంటి మరింత వ్యూహాత్మక సమాచారాన్ని బయటపెట్టేందుకు నిరాకరించినట్లు సమాచారం. 1990వ దశకంలో పెద్దఎత్తున దుమారం రేపిన వరుస క్రికెట్ బెట్టింగ్ వివాదాల్లో ఇది కూడా ఒకటి, ఆటగాళ్లపై వ్యక్తిగత జరిమానాలు విధిస్తే సరిపోతుందని నిర్ణయంచి, ఈ విషయాన్ని మొదట ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ACB) కప్పిపుచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ సలీం మాలిక్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మ్యాచ్‌లు ఓడిపోయేందుకు తమకు ముడుపులు ఇవ్వాలని ప్రయత్నించాడని వా మరియు వార్న్ గతంలో ఆరోపణలు చేసిన కారణంగా, జాన్‌తో వారికి సంబంధాలు ఉన్న వ్యవహారం వివాదాస్పదమైతే సాక్ష్యులుగా వారి విశ్వసనీయత దెబ్బతింటుందని ACB నిర్ణయించింది. ACB ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌తో నివేదించింది, దీంతో ఈ వివాదానికి తెరపడింది.

1998లో ప్రసార మాధ్యమాలు ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చినప్పుడు, మీడియా మరియు ప్రజలు ఈ ఇద్దరు ఆటగాళ్లను తీవ్రంగా విమర్శించారు, వీరి వ్యవహారాన్ని కప్పిపెట్టినందుకు ACBని కూడా నిందించారు. ఈ వార్త బయటకు వచ్చిన తక్షణమే, ఒక టెస్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి అడుగుపెట్టిన మార్క్ వాకు ఆస్ట్రేలియా ప్రజల నుంచి తీవ్ర స్పందన ఎదుర్కొన్నాడు. మరోవైపు, క్రీడా సమాజం మాత్రం సాధారణంగా ఆటగాళ్లకు మద్దతుగా నిలిచింది. ACB ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరిపేందుకు రాబ్ ఓ'రీగాన్ QCని నియమించింది. దీనిపై విచారణ జరిపిన ఓ'రికాన్ ఆటగాళ్లకు జరిమానాలు విధించడం సరైన చర్య కాబోధని నిర్ణయించారు, "గణనీయమైన సమయం"పాటు ఆటగాళ్లపై నిషేధం విధించడం సరైన చర్య అవుతుందని సూచించారు. ఆయన ఆటగాళ్ల ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు మరియు యువ అభిమానులకు స్ఫూర్తిదాయకంగా ఉండటంలో వారు విఫలమయ్యారని పేర్కొన్నారు. జూదం మరియు అనధికారిక బుక్‌మేకర్ల వలన ప్రమాదాల గురించి ఆటగాళ్లకు మరింత బాగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఓ'రీగాన్ సూచించారు.

ఈ వివాదం వలన పాకిస్థాన్ ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లను తమ సొంత అవినీతి న్యాయ విచారణకు హాజరుకావాలని కోరింది; ఆస్ట్రేలియా దీనికి స్పందనగా, పూర్తి స్వేచ్ఛతో పాకిస్థాన్ అధికారులు తమ దేశంలోనే ఆ విచారణలు జరపేందుకు అనుమతించాల్సి వచ్చింది. మాలిక్‌పై చేసిన ఆరోపణల గురించి ఆటగాళ్లను ప్రశ్నించారు మరియు జాన్‌తో సంబంధాల వలన వారి విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. వా మరియు వార్న్ ఇద్దరూ మ్యాచ్‌లను తాము తక్కువ క్రీడా స్ఫూర్తితో ఆడామనే వాదనలను ఖండించారు, అంతేకాకుండా తాము ముడుపులు పుచ్చుకున్నామని ఆరోపణలు మోపబడిన మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్లలో మేము ఉన్నామనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని వాదించారు.[19]

క్రీడను అపకీర్తికి పాలుచేశాడనే ఆరోపణలు

1999లో శ్రీలంక కెప్టెన్ అర్జున రణతుంగ గురించి ఒక బ్రిటన్ వార్తాపత్రికకు రాసిన కాలమ్‌లో వార్న్ చేసిన ఆరోపణలు ఆటను వివాదంలోకి లాగాయి, "రణతుంగ మరియు తనకు మధ్య చాలా వైరభావం ఉందని" అతను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అతనంటే నాకు ఇష్టం లేదు మరియు మేమిద్దరం కలిసే ఉండేదానిలో నేను ఉండను."[20] ఈ సంఘటన తరువాత, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వార్తాపత్రికల్లో ఆటగాళ్లు రాసే కాలమ్‌లు ముద్రించబడే ముందు, వాటికి జట్టు యాజమాన్యం ఆమోదం తీసుకోవాలని నిబంధన విధించింది.

వ్యక్తిగత జీవితం

వార్న్ విక్టోరియాలో ఉన్న అప్పర్ ఫెర్న్‌ట్రీ గల్లీలో కెయిత్ మరియు బ్రిడ్‌గెట్ దంపతులకు జన్మించాడు, విక్టోరియాలోనే ఉన్న బ్లాక్ రాక్ పెరిగాడు. వార్న్ 1 ఏడాది ఓక్లెయిగ్ సౌత్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లాడు, మెంటోన్ గ్రామర్‌లో స్పోర్టింగ్ స్కాలర్‌షిప్‌పై ఉన్నత పాఠశాల విద్య చదువుకున్నాడు, ఇక్కడ వార్న్ క్రికెట్ కెప్టెన్‌గా ఉండేవాడు. వార్న్, అతని మాజీ భార్య సైమన్ కల్లాహన్‍‌కు బిడ్డలు బిడ్డలు జన్మించారు, వారి పేర్లు- బ్రూక్, సమ్మర్ మరియు జాక్సన్.

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి, వార్న్ తనపేరుపై నెలకొల్పబడిన షేన్ వార్న్ ఫౌండేషన్ కోసం పనిచేస్తున్నాడు...[ఇది] తీవ్రంగా జబ్బునపడిన మరియు పేద బాలలకు సాయం చేస్తుంది.[21] 2004లో ప్రారంభించినప్పటి నుంచి, ఈ స్వచ్ఛంద సంస్థ £400,000 ఆర్థిక సాయం పంచింది; వార్న్ ఒక పోకర్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాడు, వేసవి ముగింపు సమయానికి మేము £1.5 మిలియన్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపాడు.[22]

దాంపత్య ద్రోహాలు

వార్న్ వ్యక్తిగత జీవితం అన్నివైపుల నుంచి కుంభకోణాలతో నిండిపోయింది, బ్రిటన్ టాబ్లాయిడ్ వార్తాపత్రికలకు పలుమార్లు వార్న్ వ్యక్తిగత జీవితం లక్ష్యంగా మారింది. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నప్పుడు ఒక మహిళకు సందేశాలు పంపడం వివాదాస్పదమైంది, అతను అనైతిక మరియు వేధించే సందేశాలు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ ఆరోపణలు చేసిన మహిళ (హెలెన్ కోహెన్ అలోన్) ఆ తరువాత స్వదేశంలో బలవంతపు డబ్బు వసూళ్ల ఆరోపణల కేసు నమోదయింది.[23]

2000 సంవత్సరంలో, ఒక బ్రిటీష్ నర్సుకు ప్రణయ సందేశాలు పంపినందుకు వార్న్ ఆస్ట్రేలియా జట్టు ఉప-సారథి (వైస్-కెప్టెన్సీ) పగ్గాలు కోల్పోయాడు. తాను ధూమపానం చేస్తుండగా ఫోటో తీసిన కొందరు యువకులతో వార్న్ వాగ్వాదానికి దిగాడు; ధూమపానాన్ని విడిచిపెట్టినందుకు బదులుగా ఒక నికోటిన్ పాచ్ కంపెనీ యొక్క స్పాన్సర్‌షిప్‌ను వార్న్ అంగీకరించాడు.[24]

వార్న్ వివాహేతర సంబంధాలు గురించి మరికొన్ని ఆరోపణలు 2005లో బయటకొచ్చాయి, ఆ సమయంలో ఇంగ్లండ్‌లో త్వరలో జరగబోయే యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు సన్నద్ధమవుతుంది. 2005 జూన్ 25న, వార్న్ మరియు అతని భార్య సైమన్ కల్లాహన్ మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.

2006 మే 7న, న్యూస్ ఆఫ్ ది వరల్డ్ టాబ్లాయిడ్ వార్తాపత్రిక ఇద్దరు 25 ఏళ్ల మోడళ్లతో వార్న్ లోచడ్డీపై నిలబడి ఉన్న ఛాయాచిత్రాలను మరియు వార్న్ పంపాడని భావిస్తున్న ప్రణయ సందేశాలను ప్రచురించింది.[25]

2007 ఏప్రిల్ 1న, వార్న్ మరియు అతని భార్య మళ్లీ మేము కలిసి జీవించాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.[26] అయితే, సెప్టెంబరు 2007లో, ఆమె భర్త మరో మహిళకు పంపాలనుకున్న సందేశాన్ని తన ఫోన్‌కు పంపడంతో సైమన్ ఇంగ్లండ్ నుంచి ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చింది.[27][28]

ప్రసార మాధ్యమాల్లో బాగా నలిగిన వార్న్ యొక్క దాంపత్య ద్రోహాలు ఆస్ట్రేలియా గాయకుడు-పాటలరచయిత కెవిన్ బ్లోడీ విల్సన్ యొక్క 2003 మ్యూజిక్ వీడియోకు స్ఫూర్తిదాయకమయ్యాయి, అతను తన మ్యూజిక్ వీడియోకు "ది షేన్ వార్న్ సాంగ్" అనే పేరుతోపాటు, టిమ్ మిన్‌చిన్ యొక్క "సమ్ పీపుల్ హావ్ ఇట్ వర్స్ దేన్ మి" మరియు "ది JLA సాంగ్" అనే శీర్షిక పెట్టాడు.

ఒప్పందాలు మరియు మైదానేతర ఆదాయాలు

వార్న్ మైదానేతర అనైతిక ప్రవర్తనలు బాగా మారుమోగడం, అనేక కార్పొరేట్ ఒప్పందాలు మరియు అవకాశాలు అతడిని వెతుక్కుంటూ వచ్చేందుకు దోహదపడ్డాయి, అతడికి ప్రాచుర్యం పెరిగిపోతుండటంతో, అనేక సామర్థ్యంగల వ్యాపార సంస్థలు వార్న్‌ను సరైన ప్రచారకర్తగా ఎంచుకున్నాయి.

జులై 13, 2005న ఆస్ట్రేలియాకు చెందిన నైన్ నెట్‌వర్క్ వార్న్‌తో వ్యాఖ్యాత ఒప్పందాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది, దీని విలువ ఏడాదికి AU$300,000 కావడం గమనార్హం.[29] గతంలో వార్న్‌ను నైన్ క్రికెట్ వ్యాఖ్యాతల జట్టులో భవిష్యత్ సభ్యుడిగా చూసేవారు, 2003లో ఏడాది నిషేధం సందర్భంగా అతను వ్యాఖ్యాత బాధ్యతలు నిర్వహించాడు. అయితే మూడున్నర నెలల తరువాత, షేన్ వార్న్ ఆసియా-ఫసిఫిక్ ప్రాంతానికి చెందిన అతిపెద్ద టెలిఫోన్ ఆడియో ప్రొడక్షన్ కంపెనీ మెసేజెస్ ఆన్ హోల్డ్‌తో పలు-సంవత్సరాలు అమల్లో ఉండే [30][31] లాభదాయక స్పాన్సర్‌షిప్ ఒప్పందంపై సంతకం చేశాడు. హోల్డ్ ఫోన్ సందేశాలకు ప్రచారకర్తగా వార్న్ ఉండటంతో, అనేక SMS/విషయ సందేశాల వివాదాలతో అపకీర్తి మూటగట్టుకున్న తరువాత కూడా అతడిని ఈ నిందాస్తుతి వీడలేదు.[32] అనేక మీడియా వర్గాలు మరియు మెసేజెస్ ఆన్ హోల్డ్ యొక్క సొంత ప్రకటనలు కూడా "ఈ సిఫార్సుతో నన్ను విశ్వసించండి - స్పిన్ గురించి ఒక విషయం లేదా రెండు విషయాలు మాత్రమే నాకు తెలుసు" అని వార్న్ చెప్పినట్లు వెల్లడించాయి.[33]

హెయిర్-లాస్-రికవరీ కంపెనీ (ఊడిపోయిన జట్టును తిరిగి రప్పించే సంస్థ) అడ్వాన్సెడ్ హెయిర్‌కు కూడా వార్న్ ప్రచారకర్తగా ఉన్నాడు. వైద్య సేవలకు ఒక అక్రమ ప్రముఖుడు ప్రకటనలు ఇవ్వడానికి సంబంధించి బ్రిటీష్ అడ్వెర్టైజింగ్ స్టాండర్డ్స్ అథారిటీ దర్యాప్తు జరుపుతోంది.[34] ఈ దర్యాప్తుకు సంబంధించి వార్న్ మాట్లాడుతూ.. "తాను బాధపడేలా చేసిన ఒకేఒక్క విషయం ఏదైనా ఉందంటే అది, జట్టు ఊడిపోవడమేనని" పేర్కొన్నాడు.

కోడ్‌మాస్టర్ వీడియో గేమ్స్ షేన్ వార్న్ క్రికెట్ మరియు షేన్ వార్న్ క్రికెట్ '99లకు కూడా వార్న్ ప్రచారకర్తగా వ్యవహరించాడు. ఆస్ట్రేలియా వెలుపల ఇవి బ్రయాన్ లారా క్రికెట్ మరియు బ్రయాన్ లారా క్రికెట్ '99గా తెలుసు.

సెప్టెంబరు 2007లో BBC టెలివిజన్ స్పోర్ట్స్ క్విజ్ ఎ క్వచన్ ఆఫ్ స్పోర్ట్‌లో ఒక జట్టు కెప్టెన్‌గా అల్లీ మెక్‌కాయిస్ట్ స్థానాన్ని వార్న్ చేపట్టాడు.

2007/08 ఆస్ట్రేలియన్ క్రికెట్ సిరీస్ కోసం, వార్న్ VB ప్రతినిధిగా డేవిడ్ బూన్ వద్ద నుంచి బాధ్యతలు స్వీకరించాడు.[35] ప్రచారంలో భాగంగా వార్న్ ఒక మాట్లాడే వ్యక్తిగా వ్యవహించాడు, "టాకింగ్ బూన్" బొమ్మ నుంచి ఇది ప్రారంభమైంది.బూనాంజా ప్రమోషన్[36]

జనవరి 2008లో, వార్న్ 888 పోకర్‌తో (యజమాని 888 హోల్డింగ్స్ PLC, లండన్‌లో ఇదొక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ) ఒప్పందం కుదుర్చుకున్నాడు, ఈ ఒప్పందం ప్రకారం ఆస్సీ మిలియన్స్, వరల్డ్ సిరీస్ ఆఫ్ పోకర్ మరియు 888 UK పోకర్ ఓపెన్‌లతో సహా ప్రపంచవ్యాప్తంగా జరిగే పోకర్ సిరీస్‌ల్లో వారికి వార్న్ ప్రాతినిధ్యం వహిస్తాడు.

కార్లు

వార్న్ కార్లంటే చాలా ఇష్టపడతాడు. అతను రెండు ఫెరారీ కార్లకు యజమాని: 1996లో అతను 355 స్పైడర్‌ను మరియు 2001లో టైటానియంలో ఉన్న మరియు లోపల ఎరుపు వర్ణంతో మెరుగులు దిద్దబడి ఉండే ఒక 360 స్పైడర్‌ను కొనుగోలు చేశాడు. ఆ సమయంలో అతని వద్ద ఆరు కార్లు ఉన్నాయి - అవి ఫెరారీ, రెండు మెర్సెడెజ్ కార్లు, రెండు BMWలు మరియు ఒక హోల్డెన్ VK కమాండర్. అయితే, భార్యతో విడిపోయిన తరువాత అతను తాను సేకరించిన కార్లను అమ్మివేశాడు, ఇప్పుడు ఆస్ట్రేలియాలో అతను ఒక BMW X5 కారు కలిగివున్నాడు, ఇంగ్లండ్‌లో మెర్సెడెజ్ E55 AMG కారును అద్దెకు తీసుకున్నాడు. మే 2008లో వార్న్ ఒక బుగాటీ వైరాన్ కారును కొనుగోలు చేశాడు.[37]

2009లో మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున బౌలింగ్ చేస్తున్న షేన్ వార్న్.

గుర్తింపు

 • 1994లో విజ్డన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్‌కు ఎంపికయిన ఐదుగురు ఆటగాళ్లలో అతను కూడా ఒకడు.
 • 2000లో, 100 మంది సభ్యుల నిపుణుల సంఘం, విజ్డన్ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఆఫ్ ది సెంచరీ జాబితాలో చోటుదక్కించుకున్న ఐదుగురు క్రికెటర్లలో వార్న్ నాలుగోవాడు, వార్న్‌కు 27 ఓట్లు లభించాయి, సర్ డొనాల్డ్ బ్రాడ్‌మాన్ (100), సర్ గార్‌ఫీల్డ్ సోబెర్స్ (90 ఓట్లు), సర్ జాక్ హోబ్స్ (30 ఓట్లు) తరువాతి స్థానంలో వార్న్‌కు ఈ జాబితాలో చోటు దక్కింది. సర్ వీవ్ రిచర్డ్స్ 25 ఓట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. టాప్ 10లో నిలిచిన క్రికెటర్లలో అప్పుడు క్రికెట్ ఆడుతున్న ఆటగాడు వార్న్ ఒక్కడే కావడం గమనార్హం.
 • 2004లో "రీచీ బెనాడ్స్ గ్రేటెస్ట్ ఎలెవన్"లో చోటు దక్కించుకున్న నలుగురు ఆస్ట్రేలియా క్రికెటర్లలో వార్న్ కూడా ఒకడు. (డాన్ బ్రాడ్‌మాన్, డెన్నిస్ లిల్లీ మరియు ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఈ జాబితాలో ఇతర ఆస్ట్రేలియా ఆటగాళ్లు)
 • 2005లో వార్న్ BBC స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ ఓవర్‌సీస్ పర్సనాలిటీ విజేతగా నిలిచాడు, 2005 యాషెస్ సిరీస్‌లో ప్రదర్శనకు గుర్తింపుగా అతడిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
 • తన స్వచ్ఛంద సంస్థ తరపున ప్రముఖ ఆస్ట్రేలియా సబ్బు నీగ్‌బౌర్స్ యొక్క జులై 6 మరియు 7 తేదీల ఎపిసోడ్‌లలో వార్న్ కనిపించాడు.
 • 2006లో క్రికెట్‌కు అందించిన సేవలకు గుర్తింపుగా వార్న్‌కు సౌతాంప్టన్ సోలెంట్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
 • సెయింట్ కీల్డా ఫుట్‌బాల్ క్లబ్‌కు వార్న్ వీరాభిమాని, వారి ద్వితీయశ్రేణి జట్టు తరపున వార్న్ ఆడాడు.
 • అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయాన్ని వార్న్ ప్రకటించిన సందర్భంగా..మాజీ ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ కిమ్ హుగెస్ మాట్లాడుతూ... అతడిని "బౌలింగ్‌లో డొనాల్డ్ బ్రాడ్‌మాన్"గా వర్ణించాడు.[38]
 • లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఉన్న లాంగ్ రూమ్‌లో బొమ్మల రూపంలో ఉన్న నలుగురు ఆస్ట్రేలియా క్రికెటర్లలో వార్న్ కూడా ఒకడు; ఈ మైదానం "క్రికెట్ పుట్టినిల్లు"గా సుపరిచయం. ఇక్కడి లాంగ్ రూమ్‌లో ఉన్న మిగిలిన ఆస్ట్రేలియా క్రికెటర్లలో విక్టర్ ట్రుంపెర్, డొనాల్డ్ బ్రాడ్‌మాన్ మరియు కెయిత్ మిల్లెర్ ఉన్నారు. క్రికెట్ ఆడుతున్నప్పుడే ఈ లాంగ్ రూమ్‌లో చోటు దక్కించుకున్న క్రికెటర్ వార్న్ ఒక్కడే కావడం గమనార్హం.
 • వార్న్ జీవితం ఆధారంగా రూపొందిన ఒక మ్యూజికల్ కామెడీ: Shane Warne: The Musical .

టెస్ట్ వికెట్ మైలురాళ్లు

బ్యాట్స్ మెన్ దేశం అవుట్ చేసిన రూపం వేదిక సంవత్సరం
1 రవి శాస్త్రి భారత్ క్యాచ్ DM జోన్స్ సిడ్నీ 1991/92
50 నాసెర్ హుస్సేన్ ఇంగ్లండ్ క్యాచ్ DC బూన్ నాటింగ్‌హామ్ 1993
100 బ్రయాన్ మెక్‌మిలన్ దక్షిణాఫ్రికా LBW అడిలైడ్ 1993/94
150 అలెక్ స్టీవార్ట్ ఇంగ్లండ్ కాటన్ బౌల్డ్ మెల్బోర్న్ 1994/95
200 చమింద వాస్ శ్రీలంక క్యాచ్ IA హీలి పెర్త్ 1995/96
250 అలెక్ స్టీవార్ట్ ఇంగ్లండ్ బౌల్డ్ మాంచెస్టర్ 1997
300 జాక్వస్ కలీస్ దక్షిణాఫ్రికా బౌల్డ్ సిడ్నీ 1997/98
350 హృషికేష్ కనిత్కర్ భారత్ LBW మెల్బోర్న్ 1999/2000
400 అలెక్ స్టీవార్ట్ ఇంగ్లండ్ క్యాచ్ AC గిల్‌క్రిస్ట్ ది ఒవల్ 2001
450 యాష్‌వెల్ ప్రిన్స్ దక్షిణాఫ్రికా క్యాచ్ ME వా డర్బన్ 2002
500 హషాన్ తిలకరత్నే శ్రీలంక క్యాచ్ A సైమండ్స్ గాలే 2004
550 జేమ్స్ ఫ్రాంక్లిన్ న్యూజిలాండ్ LBW అడిలైడ్ 2004/05
600 మార్కస్ ట్రెస్కోథిక్ ఇంగ్లండ్ క్యాచ్ AC గిల్‌క్రిస్ట్ మాంచెస్టర్ 2005
650 యాష్‌వెల్ ప్రిన్స్ దక్షిణాఫ్రికా LBW పెర్త్ 2005/06
700 ఆండ్ర్యూ స్ట్రాస్ ఇంగ్లండ్ బౌల్డ్ మెల్బోర్న్ 2006/07
708 ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ ఇంగ్లండ్ స్టంపౌట్ AC గిల్‌క్రిస్ట్ సిడ్నీ 2006/07
దస్త్రం:Shane Warne graph.png
టెస్ట్ క్రికెట్‌లో షేన్ వార్న్ యొక్క బ్యాటింగ్ ప్రదర్శన.

బాహ్య లింకులు

ఇవి కూడా చూడండి

పుస్తకాలు

 • షేన్ వార్న్'s సెంచరీ - మై టాప్ 100 క్రికెటర్స్ రచన షేన్ వార్న్ (మెయిన్‌స్ట్రీమ్ పబ్లిషింగ్, 2008) ISBN
 • Warne, Shane (2006). My Illustrated Career. Cassell Illustrated. ISBN 1-84403-543-3.

గమనికలు

 1. 'ది ఫైనెస్ట్ లెగ్‌స్పిన్నర్ ది వరల్డ్ హాజ్ ఎవర్ సీన్' - క్రిక్‌ఇన్ఫో ఆస్ట్రేలియా , 2006-12-20
 2. "1000 wickets for Warne". The Sydney Morning Herald. 2007-01-03. Retrieved 2007-01-03.
 3. ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా: పాంటింగ్ Sportal.com.au
 4. షేన్ వార్న్ రిటైర్స్ ఫ్రమ్ ఫస్ట్-క్లాస్ క్రికెట్ యాజ్ హాంప్‌షైర్ పే ట్రిబ్యూట్ టు లెగ్ స్పిన్నర్. ది టైమ్స్, మార్చి 29, 2008న సేకరించబడింది
 5. వార్న్ ప్రిడిక్ట్స్ రిటర్న్ ఆఫ్ ది రియల్ ఆస్ట్రేలియా , అలెక్స్ బ్రౌన్, ది గార్డియన్ , ఆగస్టు 24, 2005
 6. పాజిటివ్ స్పిన్, క్రిక్‌ఇన్ఫో, అక్టోబరు 12, 2007న సేకరించబడింది
 7. Warne (2006), p. 11.
 8. స్టాట్స్‌గురు - టెస్ట్‌లు- ఇన్నింగ్స్‌వారీ జాబితా, క్రిక్‌ఇన్ఫో, అక్టోబరు 12, 2007న సేకరించబడింది
 9. క్రిక్‌ఇన్ఫో గణాంకాలు
 10. వార్న్స్ మమ్ కీ ఎలిమెంట్ ఇన్ పోబ్, క్రిక్‌ఇన్ఫో, అక్టోబరు 12, 2007న సేకరించబడింది
 11. ACB యాంటీ-డోపింగ్ కమిటీ సస్పెండ్స్ షేన్ వార్న్, క్రిక్‌ఇన్ఫో, అక్టోబరు 12, 2007న సేకరించబడింది
 12. బాన్ విల్ లెందన్ కెరీర్, సేస్ వార్న్, క్రిక్‌ఇన్ఫో, అక్టోబరు 12, 2007న సేకరించబడింది
 13. వరల్డ్ యాంటీ-డోపింగ్ బాడీ కండెమ్స్ వార్న్ రూలింగ్, క్రిక్‌ఇన్ఫో, అక్టోబరు 12, 2007న సేకరించబడింది
 14. వార్న్ హిట్స్ బాక్ ఎట్ యాంటీ-డోపింగ్ బాడీ, క్రిక్‌ఇన్ఫో, అక్టోబరు 12, 2007న సేకరించబడింది
 15. English, Peter (2006-12-26). "Another first at the last". Australia v England, 4th Test, Melbourne (in English). Cricinfo. Retrieved 2006-12-26. The fourth over was the one for history and, at 3.18pm, Andrew Strauss became the crucial figure. External link in |work= (help)
 16. Miller, Andrew (2006-12-26). "Warne's 700th rattles England". Australia v England, 4th Test, Melbourne (in English). Cricinfo. Retrieved 2006-12-26. The delivery that did for Strauss was a classic Warne dismissal, a flighted ball that dipped into the rough, bit and crashed into middle stump as Strauss played loosely for an imagined half-volley. External link in |work= (help)
 17. Miller, Andrew (2007-01-04). "Warne sets up the whitewash". Cricinfo. Retrieved 2007-01-04.
 18. "Warne-Muralidaran Trophy unveiled". ABC News. 15 November 2007. Retrieved 25 January 2010.
 19. పాకిస్థాన్ కోర్ట్ ఓవర్‌టర్న్స్ లైఫ్ బాన్ ఎగైనెస్ట్ సలీం మాలిక్ టైమ్స్, నవంబరు 15, 2008న సేకరించబడింది
 20. "Warne rapped for Ranatunga row". British Broadcasting Corporation. 1999-05-15. Retrieved 2007-12-27.
 21. ది టైమ్స్, నవంబరు 27, 2004, పేజి 75 "హౌ ఇంగ్లండ్ కెన్ ఎవైడ్ ఫాలింగ్ అండర్ ది స్పెల్ ఆఫ్ మురళీధరన్ ది మెజిషియన్", రచయిత షేన్ వార్న్
 22. [13] ^ ఐబిడ్
 23. వార్న్స్ స్పిన్ డాక్టర్ డ్రాప్స్ ది బాల్, సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, అక్టోబరు 12, 2007న సేకరించబడింది
 24. John Polack (2000-08-04). "Gilchrist named Australia's new vice-captain". Retrieved 2007-03-06.
 25. వార్న్ కాట్ అవుట్ వన్స్ ఎగైన్, ABC న్యూస్, అక్టోబరు 12, 2007న సేకరించబడింది
 26. "Warnes back together: report". The Sydney Morning Herald. 2007-04-01. Retrieved 2007-04-01.
 27. "Warne's marriage stumped by poorly aimed text". NineMSN. 2007-09-24. Archived from the original on 2007-06-15. Retrieved 2007-09-24.
 28. "Shane Warne dumped after wife gets text by mistake". thelondonpaper. 2007-09-25. Retrieved 2007-09-25.
 29. వార్న్ హర్ట్ బై కాంట్రాక్ట్ కాన్సిలేషన్, జులై 20, 2009, sport.iafrica.com
 30. వార్నీ మార్కెటింగ్ ఛార్మ్, MSN, అక్టోబరు 12, 2007న సేకరించబడింది
 31. స్పిన్ కింగ్ వార్న్ జాయిన్స్ మెసేజెస్ ఆన్ హోల్డ్, B అండ్ T, అక్టోబరు 12, 2007న సేకరించబడింది
 32. నో సేవింగ్ దిస్ మ్యాచ్: వార్న్ టు డైవోర్స్, సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, అక్టోబరు 12, 2007న సేకరించబడింది
 33. వార్న్ లాండ్స్ ఫోన్ స్పాన్సర్‌షిప్ డీల్, సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, అక్టోబరు 12, 2007న సేకరించబడింది
 34. వార్న్స్ హెయిర్ స్పిన్ వేర్స్ థిన్, ది ఏజ్, అక్టోబరు 12, 2007న సేకరించబడింది
 35. VB అండ్ షేన్ వార్న్ జాయిన్ ఫోర్సెస్ - ఫోస్టర్స్ గ్రూప్, ఆగస్టు 30, 2007న సేకరించబడింది
 36. ఎ రియల్ డాల్ ఫర్ షేన్ వార్న్ - ది హెరాల్డ్ సన్, అక్టోబరు 4, 2007
 37. మి అండ్ మై మోటార్స్: షేన్ వార్న్, టైమ్స్ ఆన్‌లైన్, అక్టోబరు 12, 2007న సేకరించబడింది
 38. ప్రైజ్ ఫర్ బ్రాడ్‌మాన్ ఆఫ్ బౌలింగ్, ది ఏజ్, అక్టోబరు 12, 2007న సేకరించబడింది.

సూచనలు

 • Warne, Shane (2006). My Illustrated Career. Cassell Illustrated. ISBN 1-84403-543-3.
Sporting positions
అంతకు ముందువారు
John Crawley
Hampshire cricket captains
2004–2007
తరువాత వారు
Dimitri Mascarenhas
అంతకు ముందువారు
Steve Waugh
Australian One-Day International cricket captains
1997/8-1998/9
తరువాత వారు
Adam Gilchrist
అంతకు ముందువారు
Ricky Ponting
Wisden Leading Cricketer in the World
2005
తరువాత వారు
Andrew Flintoff

మూస:ACB Team of the Century

మూస:Rajasthan Royals squad