"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
సంగారెడ్డి జిల్లా
సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.[1]
ఈ జిల్లా అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడింది. సంగారెడ్డి జిల్లాలో 3 రెవిన్యూ డివిజన్లు (సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్), 26 మండలాలు, నిర్జన గ్రామాలు (16)తో కలుపుకొని 600 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]
ఇదివరకు మెదక్ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉన్న సంగారెడ్డి పట్టణం ఈ కొత్త జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని 19 మండలాలు మునుపటి మెదక్ జిల్లాలోనివే.2016లో జరిగిన పునర్య్వస్థీకరణలో భాగంగా 7 కొత్తమండలాలు ఏర్పడ్డాయి.
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 647 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[3]
Contents
జిల్లాలోని పురపాలక సంఘాలు
నగర పంచాయతీలు
జిల్లాలోని ప్రధాన పరిశ్రమలు
బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్, మహీంద్రా అండ్ మహీంద్ర, ఎంఆర్ఎఫ్, చార్మినార్ బ్రూవరీస్
సాగునీటి ప్రాజెక్టులు
- సింగూరు
- నల్లవాగు
పర్యాటక ప్రాంతాలు
- కొండాపూర్ మ్యూజియం
- మంజీరా అభయారణ్యం (సంగారెడ్డి)
- గొట్టం కొండలు (జహీరాబాద్)
- అందోలు కోట
దేవాలయాలు
- కేతకీ సంగమేశ్వర దేవాలయం (ఝరాసంగం)
- సిద్ది వినాయక గుడి (రేజింతల్)
- త్రికూటేశ్వరాలయం (కల్పగూర్)
- రామలింగేశ్వర ఆలయం (నందికంది)
- వీరభద్రస్వామి ఆలయం (బొంతపల్లి)
జాతీయ రహదారులు
- హైదరాబాద్– ముంబై (ఎన్హెచ్ 65)
- నాందేడ్–అకోల (ఎన్హెచ్ 161)
జిల్లాలోని ఖనిజాలు
క్వార్ట్, ఫెల్డ్స్పార్, లేటరైట్, కలర్ గ్రానైట్, గ్రావెల్
జిల్లాలోని మండలాలు
- సంగారెడ్డి మండలం
- కంది మండలం *
- కొండాపూర్ మండలం
- సదాశివపేట మండలం
- పటాన్చెరు మండలం
- అమీన్పూర్ మండలం *
- రామచంద్రాపురం మండలం
- మునిపల్లి మండలం
- జిన్నారం మండలం
- గుమ్మడిదల మండలం *
- పుల్కల్ మండలం
- ఆందోల్ మండలం
- వట్పల్లి మండలం *
- హత్నూర మండలం
- జహీరాబాద్ మండలం
- మొగుడంపల్లి మండలం *
- న్యాల్కల్ మండలం
- ఝరాసంగం మండలం
- కోహీర్ మండలం
- రాయికోడ్ మండలం
- నారాయణఖేడ్ మండలం
- కంగ్టి మండలం
- కల్హేర్ మండలం
- సిర్గాపూర్ మండలం *
- మానూర్ మండలం
- నాగిల్గిద్ద మండలం *
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (7)
మూలాలు
- ↑ http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/239.Sangareddy.-Final.pdf
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "లిస్టు విడుదల : తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే".