సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం

From tewiki
Jump to navigation Jump to search

మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు

  • సదాశివపేట్
  • కొండాపూర్
  • సంగారెడ్డి

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 జయప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చింతాప్రభాకర్ స్వతంత్ర అభ్యర్థి
2014 చింత ప్రభాకర్ తె.రా.స టి.జయప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అభ్యర్థి తూర్పు జయప్రకాష్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కె.సత్యనారాయణపై 17676 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. జయప్రకాష్ రెడ్డికి 71158 ఓట్లు రాగా, సత్యనారాయణకు 53482 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

2009 శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున తూర్పు జయప్రకాశ్ రెడ్డి పోటీచేయగా, తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున జి.నవాజ్‌రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి ఎన్.చంద్రశేఖర్, ప్రజారాజ్యం తరఫున ఫయూం, లోక్‌సత్తా నుండి పి.మాధవరెడ్డి పోటీచేశారు.[1]

ఇవి కూడా చూడండి

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

మూలాలు

  1. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009