"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సంగీత వాద్యాలు

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Musical Instruments Andhra 1.JPG
ఆంధ్ర ప్రదేశ్‌లో వాడే కొన్ని సంగీత వాయిద్యాలు

సంగీత వాద్యాలు (Musical Instruments) భారతీయ సంగీతంలో గాయకునికి సహాయకారిగా గాని లేదా కొన్ని వాద్యాల సమూహంగా గాని ఉపయోగించే పరికరాలు.

సంగీత వాద్యాలయందు వివిధ రకాలు

వాద్యాలు ముఖ్యముగా నాలుగు రకాలు

  1. తత వాద్యాలు : తంత్రులు లేదా తీగ (String) లతో వాయించేవి (ఉదా: వీణ, తంబూరా, సంతూర్, వయోలీన్, సరోద్, సితార, సారంగి, కడ్డీవాయిద్యం మొదలైనవి)
  2. సుషిర వాద్యాలు : గాలి (Wind) వాద్యాలు లేదా ఊది వాయించేవి (ఉదా: వేణువు, సన్నాయి, కొమ్ము, నాదస్వరం, షహనాయ్, శంఖువు, నరశింగ్ మొదలైనవి)
  3. అవనద్ధ వాద్యాలు : చర్మాన్ని ఉపయోగించి వాటిని కొట్టి వాయించేవి (ఉదా: మృదంగం, డోలు, ఢమరుకం, మద్దెలు, తబలా, తప్పెట, దుందుభి, నగారా, డోలక్, పంచముఖ వాద్యం మొదలైనవి)
  4. ఘన వాద్యాలు : ఘనం అనగా గట్టిగా ఉండేవి. ఇవి తాళము ననుసరించు వాద్యములు (ఉదా: తాళాలు, గంటలు, గజ్జెలు, ఘటం, చిరుతలు, మోర్సింగ్ మంజిర మొదలైనవి)

ఇవి కూడా చూడండి