"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సండ్ర వెంకటవీరయ్య

From tewiki
Jump to navigation Jump to search
సండ్ర వెంకటవీరయ్య

వ్యక్తిగత వివరాలు

జననం (1968-08-15) 15 ఆగష్టు 1968 (వయస్సు 52)
రాజుపేట
కుసుమంచి మండలం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు *తెలుగుదేశం పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

సండ్ర వెంకటవీరయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. మొదటి సారి సి.పి.ఎం తరపున శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. తరువాత అతను టీడీపీ నుంచే వ‌రుస‌గా మూడు సార్లు శాసనసభ్యునిగా విజ‌యం సాధించాడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[1]

రాజకీయ జీవితం

 • అతను 1994లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పాలేరు నియోజకవర్గం నుండి సి.పి.ఎం అభ్యర్థిగా గెలుపొందాడు[2].
 • 1999లో అతను పాలేరు నియోజకవర్గంలో సి.పి.ఎం పార్టీ ఇన్‌ఛార్జ్ గా భాద్యతలు చేపట్టాడు.
 • 2004లో పాలేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్‌చార్జ్ గా వ్యవహరించాడు.
 • వీరు ఖమ్మం జిల్లాకి చెందిన సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించి 2009 అసెంబ్లీ ఎన్నికలలో శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు[3].
 • 2014 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సత్తుపల్లి నియోజకవర్గం నుండి పోటీచేసి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.[4]
 • అతను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా మూడు సార్లు ఎన్నికయ్యాడు (2016, 2017, 2018).
 • అతను 2018లో జాతీయ తెలుగుదేశం పార్టీకి ఉపాధ్యక్షునిగా ఉన్నాడు.
 • అతను 2018లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా సత్తుపల్లి నియోజకవర్గం నుండి ఎన్నికయినా[4] తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి చేరాడు.

మూలాలు

 1. Batchali, Ravi (2020-06-05). "మంత్రి ప‌ద‌విపై ఆశ‌తో పార్టీ మారినా ఆ క‌ల నెర‌వేర‌లేదే?". తెలుగు పోస్ట్. Retrieved 2020-06-06.
 2. "Andhra Pradesh Assembly Election Results in 1994". Elections in India. Retrieved 2020-06-06.
 3. "Andhra Pradesh Assembly Election Results in 2009". Elections in India. Retrieved 2020-06-06.
 4. 4.0 4.1 "Sathupalli Election Result 2018 Updates: Candidate List, Winner, Runner-up MLA List". Elections in India. Retrieved 2020-06-06.

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).