సంతపురి రఘువీర రావు

From tewiki
Jump to navigation Jump to search

సంతపురి రఘువీరరావు 1969 ప్రత్యేక తెలంగాణ పోరాట యోధుడు, కవి, జర్నలిస్టు.

జీవిత విశేషాలు

ఆయన స్వస్థలం మెదక్ జిల్లా ములుగు మండలంలోని బండ నర్సింహపల్లి గ్రామం. 1969లో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. రాష్ట్రంలోఅనేక ప్రాంతాల్లో పర్యటించి ఉద్యమవ్యాప్తికి కృషి చేశారు. మర్రి చెన్నారెడ్డితో కలిసి జైలుకెళ్లారు. జన్‌సంఘ్‌లో పనిచేస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని పాతబస్తీ నుంచి శాసనసభకు పోటీ చేశారు. జర్నలిస్టుగా సంతపురి రఘువీర్‌రావు నవశక్తి, ఆంధ్రభూమి, ఈనాడు, ఆంధ్రప్రభ వంటి పత్రికల్లో సంపాదక సభ్యుడిగా పనిచేశారు. సనాతన సారథికి సంపాదకుడిగా వ్యవహరించారు. వేదమాత పత్రికను నడిపారు. కవిగా అన్వేషణ పేరుతో కవితా సంపుటిని విడుదల చేశారు. విద్యార్థి దశలోనే భారత స్వాతంత్య్ర సమరంలో చురుకుగా పాల్గొని జైలు జీవితం సైతం గడిపారు. మలిదశ ఉద్యమంలో టీఆర్‌ఎస్ పార్టీ అవిర్భావ సమయంలో అండదండలు అందించారు.[1]

1985-89 మధ్య కాలంలో శాసనసభ స్పీకర్‌గా ఉన్న జి. నారాయణరావు ఆయ నను సభ అనువాదకుడుగా నియమించారు.[2]

మరణం

సైదాబాదులో నివసిస్తున్న ఆయన ఫిబ్రవరి 5 2015 న కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓ అపోలో ఆసుపత్రిలో మరణించారు.

వ్యక్తిగత జీవితం

ఆయనకు భార్య రమాదేవి, కుమారుడు వంశీకృష్ణ ఉన్నారు.

మూలాలు

ఇతర లింకులు