సంత్ రవిదాస్ నగర్

From tewiki
Jump to navigation Jump to search
Sant Ravidas Nagar జిల్లా

संत रविदास नगर ज़िला
Uttar Pradesh పటంలో Sant Ravidas Nagar జిల్లా స్థానం
Uttar Pradesh పటంలో Sant Ravidas Nagar జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
డివిజనుMirzapur
ముఖ్య పట్టణంGyanpur
మండలాలు3
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుBhadohi
విస్తీర్ణం
 • మొత్తం1.99 km2 (407.72 sq mi)
జనాభా
(2011)
 • మొత్తం15,54,203
 • సాంద్రత1/km2 (3/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత89.14 per cent
ప్రధాన రహదార్లుNH 2
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో సంత్ రవిదాస్ నగర్ జిల్లా (హిందీ:संत रविदास नगर ज़िला) ఒకటి. గ్యాన్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

చరిత్ర

Hariharnath Mandir, Gyanpur

1994 జూన్ 30 న సంత్ రవిదాస్ నగర్ జిల్లా రాష్ట్రంలో 65 జిల్లాగా రూపుదిద్దుకుంది. వైశాల్యపరంగా ఇది రాష్ట్రంలో అతిచిన్నదిగా ఉంది. సంత్ రవిదాస్ నగర్ పురాతన నామం భదోహి. మాయావతి ప్రభుత్వం ఈ జిల్లా పేరును సంత్ రవిదాస్ నగర్ జిల్లాగా మార్చింది. ఈ జిల్లా గతంలో వారణాశి జిల్లాలో భాగంగా ఉంది.

భౌగోళికం

జిల్లా గంగానదీ మైదానంలో ఉంది. జిల్లా నైరుతీ సరిహద్దులో గంగానది ప్రవహిస్తుంది. జిల్లాలో ప్రధానంగా గంగానది, వరుణానది మరియు మొర్వ నదులు ప్రవహిస్తున్నాయి. జిల్లా వైశాల్యం 1055.99 చ.కి.మీ.

సరిహద్దులు

జిల్లా ఉత్తర సరిహద్దులో జౌంపూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో వారణాసి జిల్లా, దక్షిణ సరిహద్దులో మిర్జాపూర్ జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులో అలహాబాద్ జిల్లా ఉన్నాయి.

ఆలయాలు

భోగి వద్ద సీతా సమహిత్ స్థల్ (సీతామర్హి), సెంరథ్నాథ్ భోలే షంకర్ మందిర్, బాబా హరిహర్‌నాథ్ (గ్యాంపూర్), చక్వా మహావీర్, శివమందిర్ (సుందర్పూర్), తిలింగేశ్వర్ నాథ్, తిలంగ సివ్జత్పూర్ మరియు భద్రకాళీ ఆలయం ఉన్నాయి. ఇతహరా ఉపర్వర్ గ్రామంలో బాబా గంగేశ్వర్నాథ్ అనకట్ట నిర్మించబడింది.

విభాగాలు

 • జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి : ఔరై, భదోహి మరియు గ్యాన్‌పూర్.
 • జిల్లాలో 6 బ్లాకులు ఉన్నాయి :- బదోహి, సురియావన్, గ్యాన్‌పూర్, దీఘ్, అభోలి మరియు ఔరై.
 • జిల్లాలోని నివాసిత గ్రామాలు :- 1075
 • జిల్లాలో నిర్జనగ్రామాలు :- 149 నిర్జన గ్రామాలు ఉన్నాయి
 • జిల్లాలో న్యాయ- పంచాయితీలు :- 79.
 • జిల్లాలో గ్రామపంచాయితీలి :- 489
 • జిల్లాలో పోలీస్ స్టేషన్లు :- 9

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,554,203,[1]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం..[3]
640 భారతదేశ జిల్లాలలో. 320 వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 1531 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 14.81%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 950:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 89.14%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

మాధ్యమం

 • " సత్యం న్యూస్ " జిల్లాలో మొదటి హిందీ వీక్లీగా గుర్తించబడుతుంది.
 • " గయాన్ గిర్వా " జిల్లాలో మొదటి హిందీ దినపత్రికగా గుర్తించబడుతుంది
 • వారణాసిలో ప్రచురితమై జిల్లాలో వినియీగిస్తున్నా దినపత్రికలలో దౌనిక్ జాగరణ్, అమర్ ఉజాలా, ఆజ్ (వార్తాపత్రిక), హిందూస్థాన్, జన్‌సందేష్ టైంస్ మరియు అవాజ్ ఎ ముల్క్.

మూలాలు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Gabon 1,576,665 line feed character in |quote= at position 6 (help)
 3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Hawaii 1,360,301 line feed character in |quote= at position 7 (help)

satyam news

బయటి లింకులు

వెలుపలి లింకులు