"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
సంపూర్ణ ప్రేమాయణం
సంపూర్ణ ప్రేమాయణం (1984 తెలుగు సినిమా) | |
200px | |
---|---|
దర్శకత్వం | ఎన్.బి.చక్రవర్తి |
నిర్మాణం | మిద్దే రామారావు |
కథ | యండమూరి వీరేంద్రనాధ్ |
చిత్రానువాదం | ఎన్.బి.చక్రవర్తి |
తారాగణం | శోభన్ బాబు జయప్రద రావు గోపాలరావు కైకాల సత్యనారాయణ నూతన్ ప్రసాద్ గద్దె రాజేంద్ర ప్రసాద్ |
సంభాషణలు | సత్యానంద్ |
ఛాయాగ్రహణం | కన్నప్ప |
కూర్పు | డి. వెంకటరత్నం |
నిర్మాణ సంస్థ | శ్రీ రాజలక్ష్మీ సినీ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
సంపూర్ణ ప్రేమాయణం 1983 లో వచ్చిన కామెడీ చిత్రం, శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్లో మిడ్డే రామారావు నిర్మించగా, ఎన్ బి చక్రవర్తి దర్శకత్వం వహించాడు.[1] ఇందులో శోభన్ బాబు, జయ ప్రద ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[2][3] ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది.
కథ
జగపతిరావు (సత్యనారాయణ) కు తన కుమార్తె ప్రేమ (జయ ప్రద) అంటే ఎంతో ప్రేమ. అతడి ప్రేమా బస్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో వేణు (శోబన్ బాబు) బస్ కండక్టర్ గా పనిచేస్తూంటాడు. దయానందం (నూతన్ ప్రసాద్) జగపతిరావు వద్ద మేనేజరు. అతడు జగపతిరావును బ్లాక్ మెయిల్ చేస్తూంటాడు. ప్రేమతో తన కుమారుడు ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) కు పెళ్ళి చెయ్యాలని ప్రయత్నిస్తూంటాడు. ఓసారి ప్రసాద్ ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించినందుకు వేణు అతన్ని చెంపదెబ్బ కొడతాడు. దయానందం వేణుపై తప్పుడు ఆరోపణలు చేసి అతనిని పని నుండి తొలగిస్తాడు. వేణు చెల్లెలు ఒక వ్యాధితో బాధపడుతూంటుంది. ఆమె చికిత్స కోసం అతడికి డబ్బు బాగా అవసరం. ఇంతలో, గోపాలరావు (రావు గోపాలరావు) అతని వద్దకు వచ్చి, అతడి సోదరి చికిత్సకు అవసరమైన మొత్తాన్ని ఇస్తానని; అందుకు ప్రతిఫలంగా అతను ప్రేమను ప్రేమిస్తున్నట్లుగా నాటకమాడి ఆమెను మోసం చేయ్యాలనీ వేణుకు చెప్తాడు. తద్వారా గతంలో తన చెల్లెలిని మోసం చేసిన జగపతిరావుపై అతని పగ తీరుతుంది. మొదట్లో, వేణు అంగీకరించనప్పటికీ, తన తల్లి పార్వతమ్మను (అన్నపూర్ణ) చంపినది జగపతిరావే అని భావించి తన పగ కూడా తీరుతుందని అతడు ఆ ప్రతిపాదనకు అంగీకరిస్తాడు. ఆ తరువాత, గోపాలరావు వేణుకు ప్రేమ పాఠాలు చెప్పి, ప్రేమను తన ప్రేమలో పడవేసుకుంటాడు.
ఒక రోజు గోపాలరావు జగపతిరావు ఇంటికి వెళ్ళి, అతడికి తన మొత్తం ప్రణాళికను వెల్లడిస్తాడు. అప్పుడు, ప్రేమ మరెవరో కాదు గోపాలరావు సోదరి కూతురేననే ఆశ్చర్యకరమైన సంగతి అతడికి తెలుస్తుంది. గోపాలరావు తన ప్రణాళికను ఆపడానికి వేగంగా అడుగులు వేస్తాడు. అతను వేణు ప్రేమల దగ్గరకు వెళ్ళేసరికి, వారు లైంగికంగా ఒకటైనట్లు వేణు నాటకం ఆడతాడు. ప్రేమను పెళ్ళి చేసుకోవాలని గోపాలరావు వేణును అభ్యర్థిస్తాడు. కాని జగపతిరావుపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక కారణంగా అతను నిరాకరిస్తాడు. ప్రేమ తన తండ్రిని నిజం చెప్పమని బలవంతం చేసినప్పుడు, అసలు దోషి దయానందం అని, అతడు తనను అందులో ఇరికించాడనీ చెబుతాడు. చివరికి, వేణు, గోపాలరావు, జగపతిరావులు ఏకమై దయానందాన్ని జైలుకు పంపుతారు. వేణు ప్రేమల పెళ్ళితో సినిమా ముగుస్తుంది.
తారాగణం
- వేణుగా శోభన్ బాబు
- ప్రేమాగా జయప్రద
- గోపాల రావుగా రావు గోపాలరావు
- జగపతిరావుగా సత్యనారాయణ
- దయానందంగా నూతన్ ప్రసాద్
- రాజేంద్ర ప్రసాద్ ప్రసాద్ గా
- భద్రామ్ పాత్రలో సుత్తి వీరభద్రరావు
- అబ్బా రావుగా సుత్తి వేలు
- జోషిగా నారా వెంకటేశ్వరరావు
- రామయ్యగా హేమ సుందర్
- కెకె శర్మ
- చెకింగ్ ఇన్స్పెక్టర్గా టెలిఫోన్ సత్యనారాయణ
- అప్పా రావుగా చిదతాల అప్పారావు
- పార్వతమ్మగా అన్నపూర్ణ
- ఐటమ్ నంబర్‌గా సిల్క్ స్మిత
పాటలు
వేటూరి సుందరరామమూర్తి రాసిన పాటలకు చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.
సం. | పాట | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|
1 | "శ్రీరస్తు మధనా" | ఎస్పీ బాలు, పి.సుశీల | 3:02 |
2 | "గాలీ వానా" | ఎస్పీ బాలు, పి.సుశీల | 3:57 |
3 | "ఎక్కడ పడితే" | ఎస్పీ బాలు, పి.సుశీల | 4:08 |
4 | "జాబిల్లి మీదా" | ఎస్పీ బాలు, పి.సుశీల | 4:25 |
5 | "మెత్తగా పిల్లాడా" | పి. సుశీల | 3:38 |
మూలాలు
- ↑ Sampoorna Premayanam (Banner & Direction). Filmiclub.
- ↑ Sampoorna Premayanam (Cast & Crew). gomolo.com.
- ↑ Sampoorna Premayanam (Review). The Cine Bay.