"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
సత్యం (సినిమా)
సత్యం | |
---|---|
దర్శకత్వం | సూర్యకిరణ్ |
నిర్మాత | అక్కినేని నాగార్జున |
రచన | సూర్యకిరణ్ బి. వి. ఎస్. రవి |
నటులు | సుమంత్ జెనీలియా డిసౌజా కోట శ్రీనివాసరావు |
సంగీతం | చక్రి |
ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
కూర్పు | నందమూరి హరి |
పంపిణీదారు | అన్నపూర్ణ స్టూడియోస్ |
విడుదల | 19 డిసెంబరు 2003 |
నిడివి | 144 నిమిషాలు |
భాష | తెలుగు |
ఖర్చు | ₹ 3.5 కోట్లు |
సత్యం 2003 లో సూర్యకిరణ్ దర్శకత్వం లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై విడుదలైన ఒక విజయవంతమైన సినిమా.[1] ఇందులో సుమంత్, జెనీలియా డిసౌజా ప్రధాన పాత్రల్లో నటించారు.
Contents
కథ
సత్యం (సుమంత్) సినిమాల్లో గేయరచయితగా ఎదగాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా తన జీవితంలో ఎంతో ముఖ్యంగా భావించే తండ్రి (మల్లాది రాఘవ), తన స్నేహితురాలు అంకిత (జెనీలియా డిసౌజా) దగ్గర చెడ్డవాడిగా ముద్రపడతాడు. తండ్రికి తనకు పడకపోవడంతో ఇంట్లోంచి బయటకు వచ్చేసి స్నేహితులతో కలిసి నివసిస్తుంటాడు. సున్నితమైన మనస్కుడైనా సత్యం ఓ పాపులర్ రచయిత దగ్గర ఘోస్టు రచయితగా పనిచేస్తుంటాడు. తాను రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాతనే తన ప్రియురాలు అంకితకు తన ప్రేమను తెలియబరచాలనుకుంటాడు. ఈ లోపునే అంకిత క్లాస్ మేట్ ఒకరు ఆమెను ప్రేమిస్తున్నానని చెబుతాడు. తర్వాత అంకిత తండ్రి (కోట శ్రీనివాసరావు) సత్యం కి పరిచయమై అతన్ని అభిమానిస్తుంటాడు. చివరికి సత్యం, అంకిత కలుసుకున్నారా లేదా అన్నది మిగతా కథ.
తారాగణం
పాటలు
సంఖ్య. | పాట | సాహిత్యం | గాయకులు | నిడివి | |
---|---|---|---|---|---|
1. | "ఓ మగువా నీతో స్నేహం కోసం" | భాస్కరభట్ల | చక్రి | 5:57 | |
2. | "కుచ్ కుచ్" | విశ్వ | విశ్వ, కౌసల్య | 5:24 | |
3. | "రెండు మొక్కజొన్న పొత్తులున్నయ్" | రాజేష్, వెంకట రమణ | వెంకట రమణ, సూర్య కిరణ్ | 2:46 | |
4. | "మధురమే మధురమే" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | వేణు | 4:38 | |
5. | "ఐ ఆం ఇన్ లవ్" | కందికొండ | వేణు | 5:39 | |
6. | "పిలిచిన పలకదు ప్రేమా" | కందికొండ | రవి వర్మ, చక్రి | 5:18 | |
7. | "ఓరి దేవుడా" | కందికొండ | వాసు, సూర్యకిరణ్ | 5:18 | |
మొత్తం నిడివి: |
26:35 |
మూలాలు
- ↑ జీవి. "ఐడిల్ బ్రెయిన్ లో సత్యం సినిమా సమీక్ష". idlebrain.com. ఐడిల్ బ్రెయిన్. Retrieved 20 November 2016.