"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సత్యమేవ జయతే

From tewiki
Jump to navigation Jump to search

సత్యమేవ జయతే (ఆంగ్లం : "Truth alone triumphs.") (సంస్కృతం : सत्यमेव जयते) : "సత్యం మాత్రమే జయిస్తుంది") ఇది భారత జాతీయ నినాదం. ఇది దేవనాగరి భాషలో యున్నది. ఈ నినాదాన్ని ఉత్తరప్రదేశ్, సారనాధ్ లోని అశోకుడి ఏక సింహ రాజధాని నుండి సేకరించారు. ఈ నినాద మూలాలు ముండక ఉపనిషత్తు లోని మంత్రం 3.1.6 నుండి గ్రహించారు. ఈ మంత్రం ఇలా సాగుతుంది.


సత్యమేవ జయతే నానృతమ్
సత్యేన పంథా వితతో దేవయానః
యేనాక్రమాంత్యా ఋషయోహ్యాప్తాకామా
యాత్ర తత్సత్యస్య పరమం నిధానమ్


అర్థం : సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు. సత్యం ద్వారా దివ్య (దేవ)మార్గం అవగతమౌతుంది. ఆ మార్గంలోనే ఋషులు తమ అభీష్టాలను వెరనేర్చుకొని పరమ నిధానాన్ని చేరుకోగలిగారు.

సత్యమేవ జయతే'ను తప్పక ముద్రించాలి

భారత అధికారిక చిహ్నంలోని ధర్మసూత్రం 'సత్యమేవ జయతే' వ్యాక్యాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు తమ అధికారిక కార్యకలాపాల్లో తప్పకుండా ముద్రించాలని కేంద్రం సూచించింది. ప్రభుత్వ సంస్థలు తమ ముద్రలు (స్టాంపులు), స్టేషనరీ, డాక్యుమెంట్లపై కేవలం చిహ్నంలోని మూడు సింహాల గుర్తునే వాడుతున్నాయని, వాటి కింద దేవనాగరి లిపిలో ఉండే ధర్మసూత్రాన్ని మరచిపోతున్నాయని పేర్కొంది. 'భారత అధికారిక చిహ్నం - 2007' నిబంధనల ప్రకారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ సంస్థలు తమ అధికారిక కార్యకలాపాల్లో చిహ్నంలోని మూడు సింహాల గుర్తుతో పాటు విధిగా సత్యమేవ జయతేను ముద్రించాలని కేంద్రం సూచించింది.

  • ఖురాన్ సూక్తి "నస్‌రుమ్ మినల్లాహి వ ఫతహ్ ఉన్ ఖరీబ్", సత్యం (అల్లాహ్) యొక్క జయం, అతి దగ్గరలో వుంటుంది. (ఇలాంటి అర్థాన్నే ఇస్తుంది)
  • చెక్ రిపబ్లిక్ దేశ నినాదం "ప్రావ్‌దా విటేజీ" (సత్యమే ఉంటుంది). (ఇలాంటి అర్థాన్నే ఇస్తుంది.)