"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సత్యవతి రాథోడ్

From tewiki
Jump to navigation Jump to search
సత్యవతి రాథోడ్
సత్యవతి రాథోడ్


గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 సెప్టెంబర్ 8
నియోజకవర్గము డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం అక్టోబరు 31, 1969
గుండ్రాతిమడుగు, కురవి మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ, 2014 నుండి తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి గోవింద రాథోడ్
సంతానము సునీల్‌కుమార్‌ రాథోడ్, డా.సతీష్‌ రాథోడ్‌
నివాసము హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం

సత్యవతి రాథోడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తరపున డోర్నకల్ శాసనసభ నియోజకవర్గం నుండి 2009లో ప్రాతినిథ్యం వహించింది. 2014, మార్చి 2న తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరింది.[1] [2][3]

జననం - విద్యాభ్యాసం

సత్యవతి రాథోడ్ 1969, అక్టోబరు 31న లింగ్యానాయక్, దశమి దంపతులకు వరంగల్ జిల్లా కురవి మండలంలోని గుండ్రాతిమడుగు లో జన్మించింది. ఏడవ తరగతి వరకు చదువుకుంది.

వివాహం - పిల్లలు

1982, మే 5న గోవింద రాథోడ్ తో సత్యవతి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు (సునీల్, సతీష్). 2009, జూలై 20న గోవింద్ రాథోడ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.[4]

రాజకీయరంగ ప్రస్థానం

సత్యవతి 1984లో రాజకీయాల్లోకి ప్రవేశించింది. 1985లో జిల్లా తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఎన్నికెంది. 1988 నుండి 1991 వరకు పంచాయితీ రాజ్ పరిషత్ సభ్యరాలుగా పనిచేసింది. 1996లో గుండ్రాతిమడుగు సర్పంచ్ గా ఉన్నారు.2006లో కురవి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచి, స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా పని చేసింది.

1989లో తెలుగుదేశం పార్టీ తరఫున డోర్నకల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డీఎస్‌ రెడ్యానాయక్‌ చేతుల్లో స్వల్ప ఓట్లతేడాతో ఓటమిని చవి చూసింది. 2009 సంవత్సరంలో టీడీపీ నుంచి డోర్నకల్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి కాంగ్రెస్‌ తరుపున పోటీచేసిన రెడ్యానాయక్‌పై గెలుపొందింది. 2014లో తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరింది. 2014లో డోర్నకల్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి రెడ్యానాయక్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లో టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైంది. 16 ఏప్రిల్ 2019 న ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసింది.[5] 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది. ఆమెకు గిరిజనాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలను కేటాయించారు. 2019 లో జరిగిన హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆమెను నియోజకవర్గ ఇంచార్జి గా నియమించారు.[6][7][8][9]

మూలాలుhjklhkj

  1. తెలుగు వి6. "టీడీపీ గిరిజన ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లోకి!". Retrieved 15 May 2017.
  2. తెలుగు వన్ ఇండియా. "టిడిపికి, పదవికి సత్యవతి రాథోడ్ రాజీనామా: తెరాసలోకి". telugu.oneindia.com. Retrieved 15 May 2017.
  3. సాక్షి, తెలంగాణ (16 June 2019). "అప్పట్లో ఎన్టీఆర్‌.. ఇప్పుడు మహేశ్‌ బాబు". Sakshi. Archived from the original on 8 September 2019. Retrieved 8 September 2019.
  4. తెలుగు వెబ్ దునియా. "డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి భర్త మృతి". telugu.webdunia.com. Retrieved 15 May 2017.
  5. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
  6. నమస్తే తెలంగాణ, తాజా వార్తలు (8 September 2019). "ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం". ntnews.com. Archived from the original on 8 September 2019. Retrieved 31 October 2019.
  7. సాక్షి, తెలంగాణ (8 September 2019). "శాఖల కేటాయింపు: హరీష్‌కు ఆర్థిక శాఖ". Sakshi. Archived from the original on 8 September 2019. Retrieved 31 October 2019.
  8. నమస్తే తెలంగాణ, MAHABUBABAD NEWS (9 September 2019). "సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు..." ntnews.com. Archived from the original on 9 September 2019. Retrieved 31 October 2019.
  9. నమస్తే తెలంగాణ, తాజావార్తలు (16 September 2019). "మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యవతి రాథోడ్..." ntnews.com. Retrieved 31 October 2019. |archive-url= is malformed: save command (help)

ఇతర లంకెలు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).