"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
సదాశివపేట
సదాశివపేట, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండలానికి చెందిన పట్టణం.[1]
ఇది పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.1954లో స్థాపితమైన ఈ పురపాలక సంఘం మూడవ శ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. హైదరాబాదుకు పశ్చిమాన 68 కిమీ దూరంలో జాతీయ రహదారిపై ఉన్న సదాశివపేట పట్టణం 77° 57’ తూర్పు రేఖాంశం, 17° 37’ ఉత్తర అక్షాంశంపై ఉపస్థితియై ఉంది.
గణాంకాలు
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 94,337 - పురుషులు 47,665 - స్త్రీలు 46,672
2001 నాటికి పట్టణ జనాభా 36,334 కాగా, 2011 నాటికి 42,809కు పెరిగింది.2014 మార్చి నాటికి వార్డుల సంఖ్య 23, ఓటర్ల సంఖ్య 29255.[2] పట్టణ విస్తీర్ణం 24.4 చకిమీ. 2010లో పారిశుద్ధ్యం విషయంలో ఈ పురపాలక సంఘం రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు పొందింది.[3]
మండలంలోని పట్టణాలు
- సదాశివపేట (M+OG)
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ ఈనాడు దినపత్రిక, మెదక్ జిల్లా టాబ్లాయిడ్, తేది 10-03-2014
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-04. Retrieved 2019-04-10.