"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సప్తగుండాల జలపాతం

From tewiki
Jump to navigation Jump to search

సప్తగుండాల జలపాతం తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లా లింగాపూర్ మండలంలోని పిట్టగూడకు రెండు కిలో మీటర్ల దూరంలో అడవుల్లోవున్న జలపాతం.[1][2]

ఏడు జలపాతాలు

ఈ ప్రాంతంలో రామగుండం, భీమగుండం, లక్ష్మణ గుండం, సీతా గుండం, సామగుండం, స్వాతి గుండం, సవతి గుండం అని ఏడు గుండాలు ఉన్నాయి. పెద్దమిట్టె జలపాతంగా పేరుగాంచిన రామగుండం జలపాతంలో దాదాపు 200 అడుగుల ఎత్తుపైనుంచి, భీమ గుండం జలపాతంలో దాదాపు వంద అడుగుల ఎత్తునుంచి నీరు పారుతుంది. వీటిని చూసేందుకు కాలి నడకన వెళ్ళవచ్చు. అటుతరువాత ఉన్న లక్ష్మణ, సీతా, సామ స్వాతి, సవతి జలపాతాలకు వెళ్ళడం కాస్త కష్టమైన పని. పైనుండి నీరు కిందికి జారి పడుతుంటే ఆ ధారలు ఎంతో ఆకర్షణగా ఉంటాయి. పచ్చని చెట్లు, బండరాళ్లు చూడముచ్చటగా కనబడతాయి. నీళ్లు కింద పడిన దృశ్యం చూస్తుంటే, పాలు పొంగుతున్న దృశ్యం కళ్లముందు కదలాడుతుంది. చెట్లపై పక్షుల కిలకిల రాగాలు, అడవి జంతువుల పరుగులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.[3]

ఎలా చేరుకోవాలి

ఆసిఫాబాద్‌ బస్ డిపో నుంచి మెట్ట జలపాతంకి వెళ్ళాలంటే లింగాపూర్ లోని మానిక్ గూడెం రోడ్డుమార్గం ద్వారా వెళ్ళి, అక్కడి నుండి కాలి నడక ద్వారా వెళ్ళాలి. మొదటి మూడుకిలోమీటర్ల దూరంలో రామగుండం జలపాతం ఉంటుంది, మరో కిలోమీటర్ దూరంలో భీమగుండం జలపాతం, ఇలా ప్రతి కిలోమీటర్ దూరంలో ఒక్కో జలపాతం ఉంటుంది.

మూలాలు

  1. నమస్తే తెలంగాణ (20 July 2018). "మన తెలంగాణ జలపాతాల వీణ!". Archived from the original on 7 September 2018. Retrieved 7 September 2018.
  2. నమస్తే తెలంగాణ (18 November 2015). "ఆదిలాబాద్‌ అడవుల్లో సప్తగుండాల జలపాతం!". Archived from the original on 7 September 2018. Retrieved 7 September 2018.
  3. నవ తెలంగాణ (18 November 2015). "అందాల జ‌ల‌పాతాలు". Archived from the original on 7 September 2018. Retrieved 7 September 2018.