"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సమాచార లభ్యత లేని కొందరు రచయితలు

From tewiki
Jump to navigation Jump to search

ఇది ప్రముఖులు అయి, ఎక్కువ సమాచారం లభ్యం కాని కొందరు రచయితల వివరాలు పొందుపరచిన వ్యాసం

కోయి కోటేశ్వర రావు

ప్రముఖ యువ దళిత కవి, విమర్శకులు కోయి కోటేశ్వరరావు గారు ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు, ఎనికపాడు గ్రామం నందు జన్మించారు.

కోలవెన్ను రామకృష్ణారావు

కోలవెన్ను రామకృష్ణారావు ప్రముఖ జతీయవాది. సుప్రసిద్ద ఆంగ్ల త్రైమాసిక పత్రిక త్రివేణి వ్యవస్థాపకుడు. ఇతని జననకాలం-1894. మరణకాలం-1951.

కోగంటి సీతారామాచార్యులు

కోగంటి సీతారామాచార్యులు సంస్కృతాంధ్ర పండితుడు. ఇతడు గుంటూరు జిల్లా, నిజాంపట్నం మండలం, ముక్తేపల్లి అగ్రహారంలో 1927, డిసెంబరు 11వ తేదీన జన్మించాడు[1]. రేపల్లె సాహితీ సమితి సభ్యుడు.

రచనలు

ఉషారేఖలు విచిత్రగాథలు శ్రీవిష్ణు సహస్ర నామ స్తోత్రం

కొల్లా వెంకటేశ్వర్లు

రచనలు

  • పెళ్ళితంతు 1976
  • మతంగుప్పిట్లో మహిళ 1981

కొల్లా సుబ్బారావు

రచనలు

  • మహామనీషి ఎం.ఎన్.రాయ్ 1976
  • శుక్రనీతి - మానవనీతి 1984

గుళ్ళపల్లి సుందరమ్మ

కథలు

  1. తడకచాటు - 1964
  2. నవోదయం - 1964
  3. చుక్కల్లో చెంద్రం - ఆంధ్రసచిత్రవారపత్రిక దీపావళి కథల పోటీలలో ప్రథమ బహుమతి పొందినకథ - 1966
  4. లోకం పోకడ - 1968

నవలలు

  1. సుడిగాలి (ఒక నవలిక రెండు కథలు) - 1968
  2. బృందావనం - 1976

జగదానంద రాయ్

జగదానంద రాయ్ (Bengali: জগদানন্দ রায) 19వ శతాబ్దపు ప్రముఖ బెంగాళీ సైన్స్ ఫిక్షన్ రచయిత. ఆయన 1857లో వ్రాసిన శుక్ర భ్రమణ్ (బృహస్పతి గ్రహానికి ప్రయాణం) 22 ఏళ్ల తర్వాత 1879లో ప్రచురించాడు. ఈ కథ సాహితీ చరిత్రకారుల ఆసక్తిని చూరగొన్నది. కథలో ఇతర గ్రహాలకు గ్రహాంతర ప్రయాణాన్ని వర్ణిస్తుంది. ఇందులో యురేనస్ గ్రహంలో నివసించే గ్రహాంతరవాసుల వర్ణనకు ఆధునిక పరిణామ సిద్ధాంతానికి పోలిన సిద్ధాంతాన్ని జగదానంద రాయ్ ఉపయోగించాడు. "అవి చాలామటుకు మన వానరాలను పోలి ఉన్నాయి. వాటి శరీరం దట్టమైన నల్లని వెంట్రుకలతో నిండి ఉన్నది. వాటి తలలు శరీర పరిమాణానికి పెద్దవిగా ఉన్నవి. కాళ్ళు చేతులకు పొడువాటి గోళ్లతో పూర్తి నగ్నంగా ఉన్నాయి" అని గ్రహాంతవాసులను వర్ణించాడు. ఈ కథ హె.జి.వెల్స్ బుధ గ్రహవాసులను వర్ణించిన నవల "ది వార్ ఆఫ్ ద వరల్డ్స్" కంటే ఒక దశాబ్దం ముందే ప్రచురించబడి ఉండటం విశేషం.