"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సమితులు

From tewiki
Jump to navigation Jump to search


సమితి అనగా ఒక గణితశాస్త్ర భావన. ఏదైనా కొన్ని వస్తువుల సముదాయాన్ని సమితి అని నిర్వచించవచ్చు. ఇది వినడానికి చాలా చిన్నదిగా అనిపించినా గణిత శాస్త్రంలో ఇది ఒక అతి ముఖ్యమైన భావన. 19వ శతాబ్దం చివరిలో దీనిని కనుగొనడం వలన గణిత విద్యలో దీని ప్రాధాన్యం చాలా ఉంది. చాలా దేశాల్లో లోని ప్రాథమిక విద్యలో ఇది ఒక భాగము.

నిర్వచనం

సునిర్వచిత మూలకముల సముదాయాము.

సమితులను కనిపెట్టిన శాస్త్రవేత్త జార్జి కాంటర్ సమితిని ఈ విధంగా నిర్వచించాడు.

వివిధ రకాలైన వేర్వేరు వస్తువుల సముదాయాన్ని సమితి అనవచ్చు.

సంకేతము

సాధారణంగా సమితులను A, B, X మొదలగు పెద్ద అక్షరములతో సూచింతురు. సమితిలోని మూలకములను సూచించుటకు x, y మొదలగు చిన్న అక్షరములను వాడుదము.

A = {x, y, z}లో A సమితి సూచించు సంకెతము, x, y, zలు ఆ సమితి లోని మూలకములు.

సమితి పరిమాణం

రకాలు

సార్వత్రికసమితులు

సహజ సంఖ్యలు N = {1, 2, 3, 4, .....}

పూర్ణాంకలు W = {0, 1, 2, 3, ...}

పూర్ణ సంఖ్యల సమితి Z = {...-3, -2, -1, 0, 1, 2, 3, .....}

అకరణీయ సంఖ్యల సమితి Q = {p/q: p, q ∈ Z, q ≠ 0 }

కరణీయ సంఖ్యల సమితి I

వాస్తవ సంఖ్యలు R

సంకీర్ణ సంఖ్యలు C

ఉప సమితులు

ఒక సమితి A లోని ప్రతి మూలకమూ B అనే సమితికీ చెందినట్లయితే సమితి A ని B కి ఉపసమితి అంటారు.దీన్ని (A సమితి B సమితిలో ఉంది అని కూడా అనవచ్చు) అని రాస్తారు.

ప్రత్యేక సమితులు

సార్వత్రిక సమితి
అన్ని మూలకాలు కలిగిన సమితి
ఏక మూలక సమితి
ఒకే ఒక మూలకం కలిగిన సమితి
శూన్య సమితి
అసలు మూలాకాలే లేని సమితి
శూన్య సమితిని Φతో సూచించెదము.

ప్రాథమిక