"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సమ్మి (నృత్యం)

From tewiki
Jump to navigation Jump to search

సమ్మి అనేది పంజాబ్ రాష్ట్రంలోని గిరిజనుల తెగ యొక్క సాంప్రదాయక నృత్యం. ఈ నృత్యం పంజాబీ మహిళల యొక్క నృత్యం. ఈ నృత్యం పంజాబ్ లోని సాండల్‌బార్ ప్రాంతం (ప్రస్తుతం పాకిస్తాన్ లోనిది) లో ప్రసిద్ధమైనది. ఈ నృత్యాన్ని బాజీగర్, రాయి ప్రజలు, లోబానా మరియు సాంసీ గిరిజన తెగల మహిలలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు.

ఈ నృత్యం మర్వాడ్ రాజ్యంలోని "సమ్మి మహారాణి" ప్రదర్శించేదని చారిత్రక గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఈ నృత్యాన్ని రాజస్థాన్ రాజకుమారుడు అయిన సుచ్‌కుమార్ తో వేరుపడడం వల్ల కలిగిన భావోద్రేకంతో ప్రదర్శించేదని కథనం.[ఆధారం చూపాలి]

వస్త్రధారణ

ఈ నృత్యకారులు ప్రకాశవంతమైన రంగుకల కుర్తాను మరియు పూర్తిగా పూలతో కూడిన స్కట్ లను (లహెంగా) ధరిస్తారు. ఈ నృత్యంలో వెండి కేశాలు గల ఆభరణాలను ధరిస్తారు.

ప్రదర్శన

ఈ నృత్యం గిద్దా వలె వృత్తాకారంలో ప్రదర్శించబడుతుంది. నృత్యకారులు ఒక వలయంగా నిలబడి వారి చేతులను ప్రక్కలకు, కుడివైపుకు ఊపుతుంటారు. ఈ నృత్యంలో ముఖ్యమైన ప్రసిద్ధి పొంచిన సమ్మీ పాట "సమ్మీ మేరీ వాన్".

ఇవి కూడా చూడండి

మూలాలు

ఇతర పఠనాలు

Schreffler, Gibb. 2012. “Desperately Seeking Sammi: Re-inventing Women’s Dance in Punjab.Sikh Formations 8(2).