సయాటికా

From tewiki
Jump to navigation Jump to search
సయాటికా / కటిమాల
Classification and external resources
Gray1244.png
Left gluteal region, showing surface markings for arteries and sciatic nerve
ICD-10M54.3-M54.4
ICD-9724.3
MedlinePlus000686
eMedicineemerg/303
MeSHD012585

సయాటికా లేదా కటిమాల అనునది మానవుల నడుము లలో కలిగే నొప్పి.

నేపధ్యము

ఈ రోజుల్లో మనిషి జీవనం హడావుడిగా మారింది. అంతేకాదు ప్రకృతి సహజ విధానాలకు విరుద్ధంగా సాగిపోతోంది. పని ఒత్తిడి, పోషకాహార లోపం, తగినంత నిద్రలేకపోవటం, మానసిక ఆందోళనల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అలాంటి వాటిలో అతిముఖ్యమైనది కటిమాల...అంటే నడుం నొప్పి.

నేటి జీవన విధానంలో ఆహార లోపాలు, అస్తవ్యస్థమైన దినచర్యలు, స్వప్నవిపర్యం...అంటే రాత్రివేళ నిద్రపోకపోవడం, పగటిపూట నిద్రించడం వంటి అలవాట్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బతీస్తున్నాయి. ఆందోళన, మానసిక ఒత్తిడి కూడా అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. వీటిలో అతిముఖ్యమైనది నడుం నొప్పి. ఆయుర్వేద శాస్త్రం నడుం నొప్పికి 'గృథ్రసీ వాతం' గా నామకరణం చేసింది. నూటికి తొంభై శాతం మంది తమ జీవితకాలంలో ఎప్పుడో ఒక్కసారి నడుం నొప్పి బారిన పడతారని కొన్ని అధ్యయనాల్లో స్పష్టమయింది.

కారణాలు

ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవడం, స్థూలకాయం, ఎక్కువ గంటలు విపరీతంగా శ్రమించడం, అతిగా బరువులు మోయడం, ద్విచక్రవాహనం మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, రోడ్డుప్రమాదాలు, దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్య వ్యాధులు... ఇవన్నీ నడుం నొప్పికి కారణాలు. ఈ కారణాల వల్ల వాతప్రకోపం జరుగుతుంది. ఫలితంగా ముందుగా పిరుదలకు పైభాగాన స్థబ్దతను, నొప్పిని కలిగించి ఆ తరువాత నడుం భాగం, తొడలు, మోకాళ్లు, పిక్కలు, పాదాల్లోకి నొప్పి వ్యాపిస్తుంది. ఈ సమస్య శీతాకాలంలో ఎక్కువ అవుతుంది. నడుం భాగంలో ప్రత్యేకించి ఎల్-4, ఎల్-5 వెన్నుపూసల మధ్య ఉండే సయాటికా నరం మీద ఒత్తిడి పడటం వల్ల నడుం నొప్పి వస్తుంది.

డిస్కులో వచ్చే మార్పులు

వెన్నుపూసల మధ్య ఉండే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు డిస్కుల మీద ఒత్తిడి పెరుగుతుంది. వాపు రావడం, డిస్కుకి రక్తప్రసరణ సరిగా లేకపోవడం, డిస్కు అరిగిపోవడం వంటి సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్కులలో వాపు వస్తే అందులోనుంచి చిక్కని ద్రవం బటయకు వచ్చి మేరుదండం నుంచి వచ్చే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల వెన్ను నొప్పి వస్తుంది. లక్షణాలు: నడుం నొప్పి, వాపు, కాస్త శ్రమించినా సూదులతో గుచ్చినట్టుగా నొప్పి తీవ్రం కావడం, కాళ్లలో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శజ్ఞానం కోల్పోతారు. సమస్య తీవ్రమైతే మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. వెన్నునొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్‌తో మలబద్దకం, జీర్ణాశయ సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే సమూలంగా తగ్గించవచ్చు.

ఆయుర్వేద చికిత్స

ఇలాంటి సమస్యలకు ఆయుర్వేదంలో సమగ్రమైన చికిత్సా పద్ధతులున్నాయి. వాటిలో శమన చికిత్స, శోధన చికిత్స ముఖ్యమైనవి. శమన చికిత్స: ఇది దోషాలను బట్టి అభ్యంతరంగా వాడే ఔషధ చికిత్స. ఇందులో వేదన, కామకంగా ఔషధాలుంటాయి. అలాగే వాతహార చికిత్సా పద్ధతులు ఉంటాయి. శోధన చికిత్స: శమన చికిత్స వలన ఒక్కోసారి వ్యాధి తిరగపెట్టవచ్చు. అందుకే ఆయుర్వేదంలో పంచకర్మ అనే ఒక ప్రత్యేక చికిత్సా పద్ధతి ఉంది. దీని ద్వారా ప్రకోపించిన వాతాది దోషాలను సమూలంగా తగ్గించవచ్చు. 1. స్నేహకర్మ: ఈ ప్రక్రియద్వారా వెన్నెముకలోని వెన్నుపూసల మధ్య స్నిగ్ధత్వము పెంచి తద్వారా జాయింట్స్‌లో కదలికలను తేలిక చేయవచ్చు. 2. స్వేదకర్మ: ఈ పద్ధతిలో గట్టిగా అతుక్కొని ఉండే జాయింట్స్‌ని మృదువుగా అయ్యేట్టు చేయవచ్చు. కటివస్తి: ఆయుర్వేదంలోని ఇది ఒక విశిష్ట ప్రక్రియ. దీని ద్వారా అరిగిపోయిన మృదులాస్థి (కార్టిలేజ్) కి రక్తప్రసరణ పెంచి నొప్పి తీవ్రతను తగ్గించవచ్చు. అలాగే సర్వాంగధార, వస్తికర్మ అనే చికిత్సా పద్ధతుల ద్వారా నాడీ కణాలలో కలిగిన లోపాలను సరిచేయవచ్చు. అదే విధంగా ప్రకోపించిన వాతాన్ని సమస్థితికి తీసుకురావచ్చు. జాగ్రత్తలు: సరైన పోషక ఆహారాలు తీసుకోవటం, నిదాన పరివర్జనం అంటే...పైన చెప్పిన ప్రత్యేక వ్యాధి కారణాలను మళ్లీ మళ్లీ చేయకుండా జాగ్రత్తలు పాటించాలి. ఔషధ చికిత్సల తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తే నడుం నొప్పి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది.