"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
సయ్యద్ కిర్మాణీ
సయ్యద్ కిర్మాణీ | ||||
![]() | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
పూర్తి పేరు | సయ్యద్ ముర్తుజా హుస్సేన్ కిర్మాణీ | |||
పాత్ర | Batsman, Wicket-keeper | |||
బ్యాటింగ్ శైలి | Right-handed batsman | |||
అంతర్జాతీయ క్రికెట్ సమాచారం | ||||
తొలి టెస్టు | 24 January 1976: v New Zealand | |||
చివరి టెస్టు | 2 January 1986: v Australia | |||
తొలి వన్డే | 21 February 1976: v New Zealand | |||
చివరి వన్డే | 12 January 1986: v Australia | |||
కెరీర్ గణాంకాలు | ||||
Tests | ODIs | |||
మ్యాచ్‌లు | 88 | 49 | ||
పరుగులు | 2759 | 373 | ||
బ్యాటింగ్ సగటు | 27.04 | 20.72 | ||
100లు/50లు | 2/12 | 0/0 | ||
అత్యుత్తమ స్కోరు | 102 | 48* | ||
ఓవర్లు | 3.1 | - | ||
వికెట్లు | 1 | - | ||
బౌలింగ్ సగటు | 13.00 | - | ||
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 0 | - | ||
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు | 0 | n/a | ||
అత్యుత్తమ బౌలింగ్ | 1/9 | - | ||
క్యాచ్ లు/స్టంపింగులు | 160/38 | 27/9 | ||
As of 24 June 2005, [[{{{year}}}]] |
Padma Shri | ||
![]() | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
బహూకరించేవారు | Government of India | |
రిబ్బను | ![]() |
సయ్యద్ ముర్తుజా హుస్సేన్ కిర్మాణీ (English: Syed Kirmani) మాజీ భారతదేశ క్రికెట్ ఆటగాడు. విజయవంతమైన వికెట్ కీపర్ గా జట్టులో ప్రముఖ పాత్ర పోషించాడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గానూ కిర్మాణీ వ్యవహరించారు.
జీవిత విశేషాలు
ఆయన 1976లో న్యూజీలాండ్‌పై టెస్టు, వన్డేల్లో ఆరంగ్రేటం చేశాడు. 1983లో వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో కిర్మాణీ సభ్యుడు. ఆ ప్రపంచకప్‌లో అత్యుత్తమ వికెట్ కీపర్‌గా సైతం అవార్డు దక్కించుకున్నాడు. కపిల్‌దేవ్‌తో కలిసి జింబాబ్వేపై అజేయంగా 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కిర్మాణీ. భారత్‌కు తొలి వరల్డ్‌కప్ కీలక పాత్ర నిర్వహించాడు. సునీల్ గవాస్కర్ భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు నెలకొల్పినప్పుడూ, గవాస్కర్‌తో కిర్మాణీ కీలక 143 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నిర్మించాడు. భారత్ అత్యుత్తమ స్పిన్నర్లను వికెట్ల వెనకాల కాచుకున్న వికెట్ కీపర్‌గా కిర్మాణీ కితాబందుకున్నాడు. 1981-82లో ఇంగ్లాండ్‌తో వరుసగా మూడు టెస్టు మ్యాచుల్లో కిర్మాణీ వికెట్ కీపర్‌గా ఒక్క అదనపు (బై) పరుగు కూడా ఇవ్వలేదు.
పురస్కారాలు
భారత ప్రభుత్వం 1982లో కిర్మాణీని పద్మశ్రీ పురస్కారంతో ఘనంగా సత్కరించింది. ఆయనకు 2015కు బీసీసీఐ అందించే ప్రతిష్ఠాత్మక కల్నల్ సీకే.నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. కల్నల్ సీకే నాయుడు అవార్డ్ ఎంపిక కమిటీ గురువారం బీసీసీఐ కార్యాలయంలో భేటీఅయి మాజీ క్రికెటర్ కిర్మాణీని ఎంపిక చేసింది.[1] బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకలో కిర్మాణీకి లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు అందజేయనున్నారు. అవార్డు కింద మెమోంటో, రూ. 25 లక్షల నగదు బహుమానం కిర్మాణీ అందుకోనున్నారు.[2]
మూలాలు
బయటి లంకెలు
Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).