"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సరూర్‌నగర్‌ చెరువు

From tewiki
Jump to navigation Jump to search
సరూర్‌నగర్‌ చెరువు
Dusk at Saroornagar lake.jpg
స్థానంహైదరాబాద్, తెలంగాణ
భౌగోళికాంశాలు17°21′21″N 78°31′38″E / 17.35584°N 78.52714°E / 17.35584; 78.52714
సరస్సు రకంసహజ చెరువు
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల వైశాల్యం99 ఎకరాలు (40 హెక్టార్లు)
గరిష్ఠ లోతు6.1 మీటర్లు (20 అడుగులు)
స్థావరాలుహైదరాబాద్

సరూర్‌నగర్‌ చెరువు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సరూర్‌నగర్‌ సమీపంలోవున్న చెరువు.[1] 16వ శతాబ్దం 1626లో కులీ కుతుబ్‌షా పాలనాకాలంలో తాగునీటి అవసరాలకు మరియు పంటపొలాలకు నీరందించేందుకు సరూర్‌నగర్‌ చెరువు కట్టించబడింది.

చరిత్ర

హైదరాబాదులోని ఐదు ప్రధాన జలాశయాలలో ఒకటైన ఈ సరూర్‌నగర్‌ చెరువు 16వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది 99 ఎకరాల విస్తీర్ణం (40 హెక్టార్లు) లో 6.1 మీటర్లు (20 అడుగులు) గరిష్ఠ లోతు కలిగివుంది.

గణేష్ నిమజ్జనం

2001 నుండి ఈ చెరువులో నిమజ్జనానికి శ్రీకారం చుట్టారు. 2004 నుండి కేన్లు అందుబాటులోకి తెవడంతో అప్పటినుండి భారీ విగ్రహాల్ని ఇక్కడే నిమజ్జనం చేయడం మొదలుపెట్టారు.[2]

చిత్రమాలిక

మూలాలు

  1. నమస్తే తెలంగాణ, అల్వాల్ చెరువు (15 October 2017). "నగరంలో చెరువులు.. పర్యాటక నెలవులు". Retrieved 17 December 2017.
  2. ఈనాడు. "నిమజ్జన మహా గణం". Retrieved 17 December 2017.