సర్ ఆర్థర్ కోనన్ డోయల్

From tewiki
Jump to navigation Jump to search
Sir Arthur Conan Doyle
Conan doyle.jpg
Sir Arthur Conan Doyle
జననం: Lua error in మాడ్యూల్:Wikidata at line 776: attempt to index local 'entity' (a nil value).
వృత్తి: Novelist, short story writer, poet, doctor of medicine
జాతీయత:Scottish
శైలి:Detective fiction, science fiction, historical novels, non-fiction
ప్రభావాలు:Edgar Allan Poe, Jules Verne, Robert Louis Stevenson
ప్రభావితులు:Agatha Christie and other detective fiction authors, Edgar Rice Burroughs
సంతకం:Arthur Conan Doyle Signature.svg

సర్ ఆర్థర్ ఇగ్నేషియస్ కోనన్ డోయల్, డిఎల్ (1859 మే 22 – 1930 జూలై 7[1]) స్కాట్లాండ్[2] 67కు చెందిన వైద్యుడు మరియు రచయిత. అతను షెర్లాక్ హొమ్స్ అనే అన్వేషకుడు గురించి తాను రచించిన కథలకు ప్రసిద్ధి చెందాడు. అవి నేర రచనా రంగములో ఒక గొప్ప నవకల్పనగా పరిగణించబడతాయి. అంతే కాక ఇతను ప్రొఫెసర్ ఛాలంజర్ యొక్క సాహసాల గురించి చేసిన రచనలకు కూడా ప్రసిద్ధి. అతను విరివిగా రచనలు చేసిన వ్యక్తి. ఇతను రచించిన రచనలలో శాస్త్రీయ కల్పనా కథలు, చారిత్రాత్మక నవలలు, నాటికలు, ప్రేమ కథలు, కవితలు మరియు కల్పితాలు కానివి కూడా ఉన్నాయి.

జీవితం

ప్రారంభ జీవితం

ఆర్థర్ కోనన్ డోయల్ పదిమంది తోబుట్టువులలో మూడవవానిగా 1859 మే 22న స్కాట్లాండ్ లోని ఎడింబర్గ్ లో జన్మించాడు.[3] అతని తండ్రి అయిన, చార్లెస్ ఆల్టమాంట్ డోయల్, ఐరిష్ వంశానికి చెంది ఇంగ్లాండులో జన్మించగా, అతని తల్లి, మేరీ ఫోలీ ఐరిష్ వనితగా జన్మించింది. డోయల్ యొక్క తండ్రి 1893లో డంఫ్రైస్ వద్ద క్రిక్టన్ రాయల్లో చాలా సంవత్సరాలు మానసిక వ్యాధితో బాధపడి మరణించాడు. అతని తల్లితండ్రులు 1855లో వివాహం చేసుకున్నారు.[4]

అతను ఇప్పుడు "కోనన్ డోయల్"గా పిలువబడినప్పటికీ, ఆ ఇంటిపేరు యొక్క ద్వంద్వ మూలం (ఒక వేళ అతను అది అలాగే అర్ధం కావాలని అనుకుంటే) అనిశ్చయంగా ఉంది. ఎడిన్బర్గ్ లోని సెయింట్ మేరీస్ కాథడ్రల్లో ఉన్న రిజిస్టర్ లో బాప్టిజం సమయములో అతని క్రైస్తవ పేరు 'ఆర్థర్ ఇగ్నేషియస్ కోనన్' గాను ఇంటిపేరు 'డోయల్' గాను నమోదు చేయబడింది. మైకేల్ కోనన్ ని అతని గాడ్ఫాథర్ గా పేర్కోంది.[5]

తొమ్మిదేళ్ళ వయస్సులో హొడర్ ప్లేస్, స్టోనీహర్స్ట్లోని రోమన్ కాథలిక్ జేస్యూట్ ప్రిపరేటరి పాఠశాలకు కోనన్ డోయల్ ను పంపించారు. తరువాత అతను 1875 వరకు స్టోనీహర్స్ట్ కళాశాలకు వెళ్ళాడు.

1876 నుండి 1881 వరకు, అతను ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయములో వైద్యశాస్త్రం చదివాడు. దీనిలో ఆస్టన్ పట్టణములో (ప్రస్తుతం బర్మింగ్హాంలో ఒక జిల్లా) మరియు షెఫీల్డ్ లో అతను పనిచేసిన సమయము కూడా కలిసి ఉంది.[6] చదువుతున్న సమయములోనే అతను చిన్న కథలు వ్రాయడం కూడా మొదలుపెట్టాడు; ప్రచురించబడిన అతని తొలి కథానిక, అతనికి 20 సంవత్సరాలలోపే ఛాంబర్స్ ఎడిన్బర్గ్ జర్నల్లో ప్రచురణ అయింది.[7] విశ్వవిద్యాలయము తరువాత అతను పశ్చిమ ఆఫ్రికా తీరానికి పయనమవుతున్న ఎస్ ఎస్ మయుంబ అనే నౌకలో వైద్యుడుగా పనిచేశాడు. 1885లో అతను టబెస్ డోర్సాలిస్ అనే అంశంలో డాక్టరేట్ చేశాడు.[8]

షెర్లాక్ హొమ్స్ యొక్క మూలాలు

సిడ్నీ పేజెట్‌చే షెర్లాడ్ హోమ్స్ (కుడివైపు) మరియు డాక్టర్ వాట్సన్.
గ్రూమ్ బ్రిడ్జ్ ప్రదేశంలో డోయల్ యొక్క పటనాప్రదేశం

1882లో అతను తన పూర్వ సహవిద్యార్ధి అయిన జార్జ్ బడ్ తో కలిసి ఉమ్మడిగా ప్లైమౌత్,[9]లో వైద్య ప్రాక్టీస్ ప్రారంభించాడు. అయితే, వాళ్ళ మధ్య సంబంధాలు అంత బాగా ఉండకపోవడంతో, కొంత కాలములోనే కోనన్ డోయల్ విడిగా స్వంత ప్రాక్టీస్ ప్రారంభించాడు.[10] £10 కంటే తక్కువ డబ్బుతో ఆ సంవత్సరం జూన్‌లో పోర్ట్స్‌‌మౌత్ చేరిన అతను, ఎల్మ్ గ్రోవ్, సౌత్‌సీ లోని 1, బుష్ విల్లాస్ లో వైద్య ప్రాక్టీస్ ప్రారంభించాడు.[11] మొదట్లో ప్రాక్టీస్ అంత బాగా నడవలేదు; రోగుల కోసం ఎదురు చూసి వేచి ఉన్న సమయములో అతను మళ్ళీ కథలు వ్రాయడం ప్రారంభించాడు. అతని మొదటి ముఖ్య రచన, ఎ స్టడి ఇన్ స్కార్లెట్ 1887లో బీటన్స్ క్రిస్మస్ ఆన్యువల్లో ప్రచురించబడింది. ఆ కథలోనే షెర్లాక్ హొమ్స్ మొదటి సారిగా ప్రత్యక్షమవుతాడు. డోయల్ యొక్క పూర్వ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయుడైన జోసెఫ్ బెల్ను అనుసరించి కొంత వరకు ఆ పాత్ర రూపొందించబడింది. కోనన్ డోయల్ ఆయనకు ఈ విధముగా వ్రాశాడు, "షెర్లాక్ హొమ్స్ కొరకు నేను ఖచ్చితంగా మీకే ఋణపడి ఉన్నాను.... మీరు బోధించిన నిగమనం, అర్ధాపత్తి మరియు పరిశీలన వంటి అంశాల ప్రకారం నేను ఒక వ్యక్తిని సృష్టించాను."[12] షెర్లాక్ హొమ్స్ పాత్ర ఉన్న తరువాయి కథలు స్ట్రాన్డ్ ఆంగ్ల సంచికలో ప్రచురించబడ్డాయి. చాలా దూరములో ఉన్న సమోవాలో ఉండి కూడా రాబర్ట్ లూయి స్టీవన్సన్ జోసెఫ్ బెల్ కు షెర్లాక్ హొమ్స్ కు ఉన్న పోలికలను గుర్తించగలిగాడు: "షెర్లాక్ హొమ్స్ యొక్క చాలా చమత్కారమైన మరియు చాలా ఆసక్తివంతమైన సాహసాలకు నా అభినందనలు... ఇది నా పాత మిత్రుడు జో బెల్ అయ్యే అవకాశము ఉందా?"[13] కొందరు ఇతరుల ప్రభావాలు కూడా ఉండవచ్చని ఇతర రచయితలు సూచిస్తున్నారు- ఉదాహరణకు ప్రసిద్ధుడైన ఎడ్గార్ అలన్ పో పాత్ర అయిన సి. ఆగస్టే డుపిన్.[14]

1893 నాటిదైన హెర్బర్ట్ రోస్ చే గీయబడిన డోయల్ యొక్క చిత్రం

సౌత్‌సిలో నివసిస్తున్నప్పుడు అతను, ఏ.సి. స్మిథ్ అనే కల్పనా పేరుతో పోర్ట్స్‌మౌత్ అసోసియేషన్ ఫుట్‌బాల్ క్లబ్ అనే ఒక అమేచూర్ జట్టులో గోల్‌కీపర్ గా ఫూట్‌బాల్ అడాడు.[15] (1894లో మూయబడిన ఈ క్లబ్బుకు 1898లో స్థాపించబడిన ఈనాటి పోర్ట్స్ మౌత్ ఎఫ్.సి.కు ఎటువంటి సంబంధం లేదు.) కోనన్ డోయల్ ఒక ఉత్సాహవంతమైన క్రికట్ ఆటగాడు కూడా. 1899-1907 మధ్య అతను 10 ఫస్ట్-క్లాస్ ఆటలు మర్లిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి) తరుఫున జట్టులో ఆడాడు. 1902లో లండన్ కౌంటీతో జరిగిన ఆటలో అతను యొక్క అత్యధిక స్కోరు 43 పరుగులు. అతను అప్పుడప్పుడు బౌలింగ్ కూడా చేసేవాడు. అతను కేవలం ఒక్క ఫస్ట్-క్లాస్ వికట్ మాత్రమే తీశాడు. (అయితే అది గొప్ప ఆటగాడైన డబల్యూ.జి.గ్రేస్ ది).[16] కోనన్ డోయల్ ఒక ఉత్సాహవంతమైన గోల్ఫ్ ఆటగాడు కూడా. 1910లో అతను క్రోబరో బీకాన్ గోల్ఫ్ క్లబ్, తూర్పు ససెక్స్కు సారథిగా ఎన్నికయ్యాడు. అతను తన రెండవ భార్య జీన్ లెకీ మరియు కుటుంబముతో పాటు క్రోబరోలో ఉన్న లిటిల్ విండిల్‌షాం ఇంటికి చేరి, 1907 నుంచి తను జూలై 1930 లో తన మరణం వరకు అక్కడే ఉన్నాడు.

వివాహాలు మరియు కుటుంబం

కోనన్ డోయల్ యొక్క కుటుంబం న్యూ యార్క్ లో 1922లో

1885లో కోనన్ డోయల్, "టూయీ" అని పిలవబడే లూయిసా (లేక లూయిస్) హాకిన్స్ ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు ట్యూబర్కులోసిస్ రోగం సోకి, 1906 జూలై 4 న మరణించింది.[17] మరుసటి సంవత్సరం,అతను జీన్ ఎలిజిబత్ లెకీని వివాహం చేసుకున్నాడు. అతను ఆమెను మొదటిసారిగా 1897లో చూసి ప్రేమలో పడ్డాడు. లూయిసా బ్రతికి ఉన్నప్పుడు, విశ్వాసం కొరకు, జీన్ తో కేవలం మానసిక ప్రేమ సంబంధం మాత్రమే పెట్టుకున్నాడు. 1940 జూన్ 27న జీన్ లండన్ లో మరణించింది.

కోనన్ డోయల్ ఐదుగురు పిల్లలకు తండ్రి. మొదటి భార్యతో ఇద్దరు పిల్లలు - మేరి లూయిసే (1889 జనవరి 28 – 1976 జూన్ 12) మరియు కింగ్స్లీ అని పిలవబడే ఆర్థర్ అలైన్ కింగ్స్లీ (1892 నవంబరు 15 – 1918 అక్టోబరు 28) మరియు రెండవ భార్యతో ముగ్గురు పిల్లలు - డెనిస్ పెర్సి స్టూవర్ట్ (1909 మార్చి 17 – 1955 మార్చి 9), 1936లో జార్జియా యువరాణి నినా ఎండివాని యొక్క రెండవ భర్త (సర్కా 1910 - 1987 ఫిబ్రవరి 19; బార్బర హట్టన్ యొక్క మాజీ ఆడపడుచు);అడ్రియన్ మాల్కం (1910 నవంబరు 19–1970 జూన్ 3) మరియు జీన్ లేన అన్నేట్టే (1912 డిసెంబరు 21–1997 నవంబరు 18).

షెర్లాక్ హొమ్స్ "మరణం"

1890లో కోనన్ డోయల్ వియన్నాలో ఆఫ్తాల్మాలజి చదివి 1891లో లండన్ కు వచ్చి ఆఫ్తాల్మాలజిస్ట్ గా ప్రాక్టీస్ ప్రారంభించాడు. కేవలం ఒక్క రోగి కూడా తన వద్దకు రాలేదని తన స్వీయచరిత్రలో ఆతను వ్రాసుకున్నాడు. దీని వలన అతనికి రచనకు ఎక్కువ సమయం లభించి, నవంబరు 1891లో అతను తన తల్లికి వ్రాసిన ఒక ఉత్తరములో ఈ విధంగా వ్రాశాడు: "హొమ్స్ ను చంపేసి.... అతని కథను శాశ్వతంగా ముగించేయాలని అనిపిస్తుంది". నా మనసు ఇతర గొప్ప విషయాలలోకి వెళ్ళకుండా అతనే నిండి ఉన్నాడు." నీకు ఏమి చేయాలని అనిపిస్తే అది చేయి. కాని దీనిని ప్రేక్షకులు సుళువుగా తీసుకోరు."

హొమ్స్ మరియు మోరియార్టి రీచేన్బాక్ జలపాతం వద్ద కొట్టుకోవడంసిడ్నీ పెజేట్ చే కళ.

డిసంబర్ 1893లో, "ముఖ్యమైన" పనులు చేపట్టడం కొరకు -చారిత్రాత్మక నవలలు- సమయం అవసరమయి- కోనన్ డోయల్ తన "ది ఫైనల్ ప్రాబ్లం" అనే కథలో హొమ్స్, ప్రొఫెసర్ మోరియార్టి ఇద్దరూ కలిసి రీచేన్‌బాక్ జలపాతంలో దూకి మరణించినట్లుగా వ్రాశాడు. ప్రజలు పెద్ద గోల చేయడంతో, 1901లో ది హౌండ్ అఫ్ ది భాస్కర్విల్లె అనే కథలో మరల ఆ పాత్రను తెచ్చాడు. మోరియార్టి మాత్రమే పడిపోయాడని; హొమ్స్ కు ఇతర ప్రమాదకరమైన శత్రువులు ఉండడంతో - ముఖ్యంగా కర్నల్ సెబాస్టియన్ మొరన్- తాత్కాలికంగా తాను "చనిపోయినట్లు" కనిపించేలా చేసుకున్నాడని- "ది అడ్వెంచర్ అఫ్ ది ఎమ్ప్టీ హౌస్"లో వివరణ ఇవ్వబడింది. మొత్తం మీద 56 చిన్న కథలనూ నాలుగు కోనన్ డోయల్ నవలలలోనూ హొమ్స్ పాత్ర ఉంది. ఆ తరువాత ఇతర రచయితలు రచించిన అనేక నవలలు మరియు కథలలో అతను ఉన్నాడు.

రాజకీయ ప్రచారం

సౌత్ నార్వుడ్, లండన్ లో ఆర్థర్ కోనన్ డోయల్ యొక్క గృహము

20వ శతాబ్ద ప్రారంభములో దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధం అనంతరం ప్రపంచమంతట యునైటెడ్ కింగ్డం ప్రవర్తన గురించి నిరసన వ్యక్తమయినప్పుడు, దక్షిణాఫ్రికాలో యుద్ధం: కారణము మరియు ప్రవర్తన అనే పేరుతో కోనన్ డోయల్ ఒక చిన్న కరపత్రం వ్రాశాడు. దీనిలో బోయర్ యుద్ధంలో యుకే పాత్రను అతను సమర్ధించాడు. ఈ కరపత్రం విస్తృతంగా అనువాదం చేయబడింది. మార్చి-జూన్ 1900 మధ్య కాలములో డోయల్ బ్లోంఫోన్టీన్లో ఉన్న లాంగ్మాన్ ఫీల్డ్ ఆసుపత్రిలో వైద్యుడుగా స్వచ్ఛంద సేవ అందించాడు.[18]

1902లో తాను నైట్ చేయబడడానికి మరియు సర్రేకు ఉప-లేఫ్టినంట్ గా నియమించబడడానికి ఈ కరపత్రమే కారణమని కోనన్ డోయల్ నమ్మాడు. అంతే కాక, 1900లో, అతను ది గ్రేట్ బోయర్ వార్ అనే పెద్ద పుస్తకము వ్రాశాడు. 20వ శతాబ్ద తొలి సంవత్సరాలలో, సర్ ఆర్థర్ రెండు సార్లు ఒక లిబరల్ యూనియనిస్ట్గా శాసనసభకు పోటీ చేశాడు- ఒక సారి ఎడింబర్గ్ లో, ఒకసారి హవిక్ బర్గ్స్ లో- గౌరావించదగిన ఓటులు లభించినప్పటికీ, అతను ఎన్నిక కాలేదు.

కాంగో ఫ్రీ స్టేట్ యొక్క సంస్కరణ కొరకు జరిగిన ప్రచారములో కోనన్ డోయల్ పాల్గొన్నాడు. ఈ ప్రచారం పాత్రికేయుడు ఈ.డి.మొరెల్ మరియు దౌత్యవేత్త రోజర్ కేస్మేంట్ అధ్యక్షత వహించారు. 1909లో, కాంగో దేశములో జరుగుతున్న భీకరమైన సంఘటనలను ఖండిస్తూ ది క్రైం అఫ్ ది కాంగో అని దీర్ఘమైన కరపత్రం వ్రాశాడు. అతనికి మొరెల్, కేస్మేంట్ లతో పరిచయం ఏర్పడింది. డోయల్ 1912లో రచించిన ది లాస్ట్ వరల్డ్ అనే నవలలో పలు పాత్రలకు వారు మరియు బెర్ట్రాం ఫ్లేట్చర్ రాబిన్సన్[19] ప్రేరణ అయ్యారు.

మొదటి ప్రపంచ యుద్ధం సమయములో మొరెల్ శాంతి ఉధ్యమానికి నేతగా మారినప్పుడు మరియు ఈస్టర్ రైసింగ్ సమయములో యుకేకు వ్యతిరేకంగా దేశద్రోహ నేరం క్రింద కేస్మేంట్ కు శిక్ష పడినప్పుడు వారిద్దరితోనూ అతను మిత్రత్వం విరమించుకున్నాడు. కేస్మేంట్ కు పిచ్చి పట్టిందని అందువలన అతని చర్యలకు అతను బాధ్యుడు కాదని వాదించి కేస్మేంట్ ను మరణ శిక్ష నుండి రక్షించడానికి కోనన్ డోయల్ ప్రయత్నించాడు కాని విఫలమయ్యాడు.

అన్యాయాన్ని సరిచేయడం

కోనన్ డోయల్ న్యాయానికోసం గట్టిగా పోరాడే వ్యక్తీ. మూసివేసిన రెండు కేసులను స్వయంగా దర్యాప్తు చేసి, నేర ఆరోపణ ఎదుర్కుంటున్న ఇద్దరినీ ఆ కేసుల నుండి బయటకు తెచ్చాడు. 1906లో జరిగిన మొదటి కేసులో, జార్జ్ ఎడల్జి అనే బిడియస్తుడైన సగం-బ్రిటిష్ సగం-భారతదేశపు న్యాయవాది బెదిరింపు లేఖలు వ్రాశాడని జంతువులను హింసించాడని ఆరోపణ ఎదుర్కున్నాడు. అతన్ని జెయిల్ లో పెట్టిన తరువాత కూడా జంతు హింస కొనసాగినప్పటికి, ఎడల్జిను ఎలాగైనా శిక్షించాలని పోలీసులు దృఢనిశ్చయంతో ఉన్నారు.

కొంత వరకు ఈ కేసు వలనే, 1907లో కోర్ట్ అఫ్ క్రిమినల్ అపీల్ స్థాపించబడింది. కోనన్ డోయల్ జార్జ్ ఎడల్జిని కాపాడడమే కాకుండా, ఇతర అన్యాయాలనుసరి చేయడానికి ఒక మార్గాన్ని నెలకొల్పడములో సహాయపడ్డాడు. కోనన్ డోయల్, ఎడల్జి యొక్క కథ, జూలియన్ బర్న్స్ 2005లో రచించిన ఆర్థర్ & జార్జ్ అనే ఒక నవలగా వచ్చింది. నికోలస్ మేయర్ యొక్క ది వెస్ట్ ఎండ్ హారర్ (1976) అనే ఒక పాస్టిచేలో, ఆంగ్లేయుల న్యాయ వ్యవస్థకు బలి అయిన బిడియంగా ఉండే ఒక భారతదేశపు పార్సీ పాత్రకు హొమ్స్ సహాయం చేస్తాడు. ఎడల్జియే ఒక పార్సీ.

రెండవ కేసులో, జూదమందిరం నడిపే ఆస్కార్ స్లేటర్ అనే జర్మనీకి చెందిన ఒక యూదుడు ఒక 82-ఏళ్ల వృద్ధురాలిని గ్లాస్గోలో 1908లో బాదినట్లు ఆరోపణ చేయబడింది. ప్రభుత్వ వాదనలో పరస్పర వైరుధ్యాలు ఉండడం వలన మరియు స్లేటర్ నేరం చేయలేదని నమ్మకం వలన ఈ కేసు కోనన్ డోయల్ కు ఆసక్తి కలిగించింది. 1928లో స్లెటర్ యొక్క విజయవంతమైన అభ్యర్ధనకు అయిన ఖర్చులో చాలా వరకు అతనే చెల్లించాడు.[20]

ఆధ్యాత్మికం

1906లో తన మొదటి భార్య లూయిసా మరణించడం, తరువాత తన కొడుకు కింగ్స్లీ కూడా మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే ముందు మరణించడం, యుద్ధం తరువాత తన సోదరుడు ఇన్నెస్, ఇద్దరు బావమరుదులు (వీరిలో ఒకరు రాఫెల్స్ అనే సాహిత్య పాత్రను సృష్టించిన ఈ. డబల్యూ. హొర్నుంగ్) మరియు ఇద్దరు మేనల్లుళ్ళు మరణించడంతో కోనన్ డోయల్ మానసికంగా కృంగిపోయాడు. ఆధ్యాత్మికం మరియు దాని ద్వారా మరణాంతరం కూడా జీవం ఉంది అని నిరూపించే ప్రయత్నాలలో ఆతను ఓదార్పు పొందాడు. ముఖ్యంగా, కొందరు చెప్పుతున్న దాని ప్రకారం[21], అతను క్రైస్తవ ఆధ్యాత్మికతను అనుసరించాడని, జీసస్ అఫ్ నజారేత్ యొక్క బోధనలు, ఉదాహరణలను అనుసరించాలనే దానిని ఎనిమిదవ విధిగా ఆధ్యాత్మికవాదుల దేశీయ యూనియన్ పాటించాలని అతను ప్రోత్సాహించాడు. అతను ది గోస్ట్ క్లబ్ అనే ఒక ప్రసిద్ధ పారానార్మల్ సంస్థలో సభ్యుడుగా కూడా ఉన్నాడు. ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం, అప్పటికి ఇప్పటికి, పారానార్మల్ అనే చెప్పబడే కార్యకలాపాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి అవి నిజమని (లేదా నిజం కాదని) నిరూపించడం.

1918 అక్టోబరు 28 నాడు కింగ్స్లీ దోయాల్ నిమోనియా జబ్బు సోకి మరణించాడు. 1916 సొమ్మే యుద్ధంలో గాయపడి కోలుకుంటున్నప్పుడు అతనికి ఆ జబ్బు సోకింది. ఫిబ్రవరి 1919లో బ్రిగేడియర్-జెనెరల్ ఇన్నెస్ డోయల్ కూడా నిమోనియా సోకి మరణించాడు. సర్ ఆర్థర్ ఆధ్యాత్మికతలో ఎంత వరకు మునిగిపోయాడంటే, ది ల్యాండ్ అఫ్ మిస్ట్ అనే ఒక ప్రొఫెసర్ ఛాలెంజర్ నవలను అతను వ్రాశాడు.

దస్త్రం:Cottingley Fairies 1.jpg
జులై 1917 లో ఎల్సీ వ్రైట్ తీసిన అనుమానిత దేవకన్యలతో ఫ్రాన్సెస్ గ్రిఫిత్స్ యొక్క ఐదు ఫోటోగ్రాఫ్లలో ఒకటి

ఐదుగురు కాటింగ్లే దేవకన్యలు ఫోటోస్ (ఇవి మోసమని కొన్ని దశాబ్దాలు తరువాత తెలిసింది) నిజమని అతను నమ్మాడని అతను వ్రాసిన ది కమింగ్ అఫ్ థ ఫైరీస్ (1921) అనే పుస్తకం చూపిస్తుంది. అతను వాటిని తన పుస్తకములో పునర్నిర్మించి, దేవకన్యలు, ఆత్మలు ఉన్నాయని వాటి స్వభావం గురించి కూడా వ్రాశాడు. ది హిస్టరీ అఫ్ స్పిరిచువలిజం (1926) అనే పుస్తకములో అతను అతీంద్రియ సంఘటనలను, యూసపియా పల్లడినో మరియు మీన "మార్గరి" క్రాన్డన్ చూపించిన ఆత్మలను కొనియాడాడు.[22] ఈ విషయం పై అతను చేసిన కార్యక్రమాల వలన ది అడ్వెంచర్స్ అఫ్ షెర్లాక్ హొమ్స్ అనే అతని చిన్న కథల కూర్పు ఒకటి 1929లో సోవియట్ యూనియన్లో, తాంత్రికత్వం ఉందని నిషేధించబడింది.[citation needed] ఆ నిషేధం తరువాత రద్దు చేయబడింది.[ఎప్పుడు?] షెర్లాక్ హొమ్స్ పాత్రను చక్కగా పోషించినందకుగాను వాసిలి లివనోవ్ అనే రష్యాకు చెందిన నటుడు ఆర్డర్ అఫ్ ది బ్రిటిష్ ఎంపయర్ అనే బిరుదును అందుకున్నాడు.

కొంతకాలం హారి హౌడిని అనే అమెరికాకు చెందిన ఇంద్రజాలికుడుతో స్నేహంగా ఉన్నాడు. అయితే, హౌడిని తన తల్లి మరణాంతరం, 1920లలో ఆధ్యాత్మిక ఉద్యమాన్ని వ్యతిరేకించాడు. ఆధ్యాత్మిక మాధ్యమాలు యుక్తులకు పాల్పడుతాయని అతను ఎంత చెప్పినా, (పలు మార్లు అవి మోసమని నిరూపించాడు కూడా) కోనన్ డోయల్ మాత్రం నమ్మలేదు. అంతే కాక, హౌడినికే అతీంద్రియ శక్తులు ఉన్నాయని అతను నమ్మాడు- ఈ అభిప్రాయాన్ని ది ఎడ్జ్ అఫ్ ది అన్‌నొన్ అనే పుస్తకములో వ్యక్తపరిచాడు. తన సాహసాలు కేవలం మాయే అని కోనన్ డోయల్ ను హౌడిని నమ్మించలేకపోయాడు. దీని వలన వీరిద్దరూ బాహాటంగా విడిపోయారు.[22]

రిచర్డ్ మిల్నర్ అనే అమెరికాకు చెందిన విజ్ఞాన చరిత్రకారుడు 1912 నాటి పిల్ట్‌డౌన్ మాన్ మోసాన్ని కోనన్ డోయల్ సృష్టించి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. దీని వలన ఒక నకిలీ హొమినిడ్ శిలాజం సృష్టించబడింది. ఇది 40 ఏళ్ళకు పైగా విజ్ఞాన ప్రపంచాన్ని మోసం చేసింది. కోనన్ డోయల్ కు ఒక ఉద్దేశం ఉందని మిల్నేర్ చెబుతున్నాడు - అది ఏమంటే, తనకు నచ్చిన ఒక అతీంద్రియాళువును నమ్మకుండా ఉన్న విజ్ఞాన ప్రపంచం మీద పగ తీర్చుకోవడానికి. అంతే కాక అతనికి ఈ మోసములో పాత్ర ఉందని చెప్పడానికి ది లాస్ట్ వరల్డ్లో పలు ఆధారాలు ఉన్నాయని మిల్నేర్ చెప్పాడు.[23]

నేకడ్ ఈస్ ది బెస్ట్ డిస్‌గైస్ అనే 1974 పుస్తకములో సామువేల్ రోసంబెర్గ్ కోనన్ డోయల్ తన రచనలలో దాచి పెట్టబడిన తన స్వభావం, నమ్మకం గురించి అనేక ఆధారాలు వదిలి పెట్టాడని వ్రాశాడు.

మరణం

మిన్స్టెడ్, ఇంగ్లాండ్ వద్ద సర్ ఆర్థర్ కోనన్ డోయల్ యొక్క సమాధి
క్రోబరోలో ఆర్థర్ కోనన్ డోయల్ యొక్క ప్రతిమ

1930 జూలై 7న, క్రోబోరో, ఈస్ట్ ససెక్స్ లోని తన ఇంట్లో విండెల్షాం హాల్ లో ఛాతీని పట్టుకొని కనిపించాడు. తన 71వ వయస్సులో అతను గుండెపోటుతో మరణించాడు. అతని ఆఖరి మాటలు తన భార్యను ఉద్దేశించి అతను చెప్పినవి: "నువ్వు అద్భుతంగా ఉన్నావు"[24] న్యూ ఫారెస్ట్, హంప్షయర్ లోని మిన్‌స్టెడ్ లో ఉన్న చర్చి ఆవరణములో ఉన్న అతని సమాధిలో ఈ విధంగా వ్రాసి ఉంది:

'

'స్టీల్ ట్రూ
బ్లేడ్ స్ట్రెయిట్
ఆర్థర్ కోనన్ డోయల్
నైట్
దేశభక్తుడు, వైద్యుడు & రచయిత

'

లండన్ కు దక్షిణం వైపు ఉన్న హిండ్‌హెడ్ సమీపములో ఉన్న అండర్‌షా అనే అతను నిర్మించి, ఒక దశాబ్దము పాటు నివసించిన ఆ ఇల్లు 1924 నుంచి 2004 వరకు ఒక భోజనశాల మరియు హొటల్ గా ఉంది. తరువాత అభివృద్ధి చేసే ఒక వ్యక్తి ఆ ఇంటిని కొన్నాడు. అప్పటి నుండి అది ఖాళీగానే ఉంది. పరిరక్షకులు, కోనన్ డోయల్ అభిమానులు దానిని పరిరక్షించడం కొరకు పోరాడుతూ ఉన్నారు.[17]

కోనన్ డోయల్ 23 సంవత్సరాలు నివాసం ఉన్న క్రోబోరోలో ఉన్న క్రోబోరో క్రాస్ వద్ద కోనన్ డోయల్ యొక్క శిలాప్రతిమ ఉంది. పికార్డి ప్లేస్, ఎడిన్బర్గ్ లో కోనన్ డోయల్ జన్మించిన ఇంటికి సమీపములో షెర్లాక్ హొమ్స్ శిలాప్రతిమ కూడా ఉంది.

గ్రంథ పట్టిక


వీటిని కూడా చూడండి

 • వైద్యుడైన రచయిత
 • షెర్లాక్ హోమ్స్ యొక్క ప్రసిద్ధ రంగస్థల రూపకల్పనను ప్రదర్శించిన వ్యక్తిగత స్నేహితుడైన విలియం గిల్లెట్ట్

సూచనలు

మూస:Expand further

 1. "కోనన్ డోయల్ డేడ్ ఫ్రం హార్ట్ ఎటాక్", న్యూ యార్క్ టైమ్స్ , 8 జులై 1930. నవంబరు 4, 2006న సేకరించబడింది.
 2. "Scottish writer best known for his creation of the detective Sherlock Holmes". Encyclopaedia Britannica. Retrieved 30 December 2009.
 3. "Sir Arthur Conan Doyle Biography". sherlockholmesonline.org. Retrieved 2011-01-13.
 4. Lellenberg, Jon (2007). Arthur Conan Doyle: A Life in Letters. HarperPress. pp. 8–9. ISBN 978-0-00-724759-2. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help) Stashower, Daniel (2000). Teller of Tales: The Life of Arthur Conan Doyle. Penguin Books. pp. 20–21. ISBN 0-8050-5074-4.
 5. అతని ఇంటిపేరు యొక్క సంయుక్త రూపం, ఒక ప్రసిద్ధ పాత్రికేయుడైన అతని పూర్వీక-మామ మైకేల్ కోనన్ నుంచి వచ్చిందని స్టేషోవర్ చెబుతున్నాడు. ఈయన పేరునుండే, ఆర్థర్ మరియు అతని అక్క అన్నేట్ ఇద్దరూ "కోనన్ డోయల్" అనే ఇంటిపేరును పొందారు. (స్టేషోవర్ 20–21). 1885లో అతను తన ఇంటి బయట ఇత్తడి బోర్డులోను తన డాక్టోరల్ థీసిస్ లోనూ తనను "ఎ. కోనన్ డోయల్" అని వ్రాసుకున్నాడని కూడా పేర్కొనబడింది. కాని ఇతర ఆధారాలను బట్టి (1901 లోని జనాభా లెక్కలలో) కోనన్ డోయల్ యొక్క ఇంటి పేరు "డోయల్" మాత్రమే. "కోనన్ డోయల్" అనే పేరు తరువాయి సంవత్సరాలలోనే వాడబడింది.[citation needed]
 6. ఎస్‌జిఎంటి - సర్ ఆర్థర్ కోనన్ డోయల్: షెర్లాక్ హొమ్స్ పరిశోధక నవలల రచయిత.
 7. స్టాషోవర్ 30–31.
 8. ఎడిన్బర్గ్ రిసెర్చ్ ఆర్కివ్ లో లభిస్తుంది.
 9. ఆర్థర్ కోనన్ డోయల్ & ప్లైమౌత్.
 10. స్టాషోవర్ 52–59.
 11. స్టాషోవర్ 55, 58–59.
 12. ఇండిపెన్డెంట్, 7 ఆగష్టు 2006.
 13. ఆర్ ఎల్ స్టీవన్సన్ నుండి కోనన్ డోయల్ కు ఉత్తరాలు 5 ఏప్రియల్ 1893 ది లెటర్స్ ఆఫ్ రాబర్ట్ లూయి స్టీవన్సన్ వాల్యూం 2/చాప్టర్ XII.
 14. సోవా, డాన్ బి. ఎడ్గర్ అలన్ పో: ఎ టు జడ్ . న్యూ యార్క్: చెక్మార్క్ బుక్స్, 2001. పేజీ. 162-163. ISBN 0-691-06962-X.
 15. Juson, Dave (2001). Full-Time at The Dell. Hagiology. p. 21. ISBN 0-9534474-2-1. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 16. "London County v Marylebone Cricket Club at Crystal Palace Park, 23-25 Aug 1900". Static.cricinfo.com. Retrieved 2 March 2010.
 17. 17.0 17.1 లీమన్, సూ, "కోనన్ డోయల్ ఇంటిని అభివృద్ధి చేసేవారి నుండి రక్షించడానికి షెర్లాక్ హొమ్స్ అభిమానుల ఆశలు", అసోసియేటడ్ ప్రెస్, 28 జూలై 2006.
 18. మిల్లర్, రసెల్. ది అడ్వెంచర్స్ అఫ్ ఆర్థర్ కోనన్ డోయల్ . న్యూ యార్క్: థామస్ డున్నె బుక్స్, 2008. పేజీ. 211-217. ISBN 0-312-01365-5
 19. Paul Spiring. "by A. Conan Doyle, 'The Lost World' & Devon". Bfronline.biz. Retrieved 2011-02-03.
 20. Roughead, William (1941). "Oscar Slater". In Hodge, Harry (ed.). Famous Trials. 1. Penguin Books. p. 108.
 21. Price, Leslie (2010). "Did Conan Doyle Go Too Far?". Psychic News (4037).
 22. 22.0 22.1 కాలుష్, విల్లియం, మరియు లారి స్లోమన్, ది సేక్రేట్ లైఫ్ అఫ్ హౌడిని: ది మేకింగ్ అఫ్ అమెరికాస్ ఫస్ట్ సూపర్‌హీరో , అట్రియా బుక్స్, 2006. ISBN 0-07-223174-2
 23. హైఫీల్డ్, రోజర్, "కోనన్ డోయల్ మరియు పిల్ట్‌డౌన్ మాన్ ల గూఢమైన వ్యవహారం.", ది డైలీ టెలిగ్రాఫ్, గురువారం 20 మార్చి 1997.
 24. స్టాషోవర్, పేజీ. 439.

బాహ్య లింకులు