"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సాత్త్వికాభినయం

From tewiki
Jump to navigation Jump to search

సాత్త్వికాభినయం చతుర్విధ అభినయాలులో నాలుగవ అభినయం. నాలుగు అభినయాలలో ఈ సాత్త్వికాభినయానికి ప్రత్యేకస్థానం ఉంది.[1]

రకాలు

సత్త్వమనగా హృదయంలో ఆవిర్భవించిన భావం. ఇది మానవుల హృదయాలలో అవ్యక్తంగా ఉంటుంది. దీనిని ఉపయోగించి నటించడమే సాత్త్వికాభినయం. భావ ప్రకటన అనేది ఈ సాత్త్వికాభినమే.

ఇది రెండు విధాలుగా ఉంటుంది.

  1. అంతరం: మనసును ఆశ్రయించుకొని ఉంటుంది.
  2. బాహ్యం: దేహాన్ని ఆశ్రయించుకొని ఉంటుంది.

విభావానుభావ వ్యభిచారి సంయోగాద్రస నిష్పత్తి: అని భరతుడు చెప్పడం వల్ల ప్రేక్షకులలో అణిగివున్న రసాలను విభావానుభావ వ్యభిచారీ భావాల సంయోగం వల్ల నటుడు రసానుభూతి పొందగలుగుతాడు. ఇలా ప్రేక్షకులలో రసానుభూతిని కలిగించడమే సాత్త్వికాభినయం.[2]

ఇతర వివరాలు

  1. పి.ఎస్.ఆర్. అప్పారావు రాసిన సాత్త్వికాభినయం పుస్తకాన్ని 1993లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది.

మూలాలు

  1. వెబ్ ఆర్కైవ్, పుస్తకాలు (1993). "సాత్త్వికాభినయం (ప్రస్తావన)". www.archive.org. తెలుగు విశ్వవిద్యాలయం. p. 2. Retrieved 20 April 2020.
  2. సాత్త్వికాభినయం, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట.635.

బయటి లింకులు