"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సాధనసంపత్తి

From tewiki
Jump to navigation Jump to search
ఆధునిక సాధన సంపత్తి పెట్టె
మానవులు ప్రారంభంలో అభివృద్ధి చేసిన సాధన సంపత్తిలోని కొన్ని కత్తులు.

సాధన సంపత్తి అనేది ఒక దానిని సాధించడానికి లేదా తయారు చేయడానికి ఉపయోగపడే ఒక పరికరం. కానీ ఈ పద్ధతిలో దీనిని ఉపయోగించరు. అదే విధంగా సాధన సంపత్తిని ప్రత్యేక ఉద్దేశాల కొరకు అనుసరించే పద్ధతిలో ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేకించిన విభాగాలో ఉపయోగించే సాధన సంపత్తికి రకరకాల స్థాయిలు ఉంటాయి. అవి పరికరం, పాత్ర, ఆచరణ, యంత్రం, పనిముట్టు .

సాధన సంపత్తి ఉపయోగం యొక్క పూర్ణ పరిణామం

ఆంథ్రోపాలజిస్ట్‌ల నమ్మకం ప్రకారం సాధన సంపత్తి అనేది మ్యాన్‌కైండ్‌ను విలువ కట్టేటప్పుడు చాలా ఉపయోగకరం.[1] మానవులు ఎవరూ వ్యతిరేకించలేని బటనవేలను సాధనసంపత్తిని పట్టుకోవడానికి ఉపయోగించి, తెవిలితేటలను బాగా పెంచుకోవడం ద్వారా, సాధన సంపత్తిని ఉపయోగిస్తున్నారు.[2]

పూర్వకాలం మానవులకు సాధన సంపత్తి అనేది చాలా ఉపయోగకమైన అంశం. ఆహారం కొరకు పైకి ఎక్కడానికి వీటిని కనిపెట్టారు. మానవ శరీరాలు చేయలేని పనిని వీటి ద్వారా చేయాలని అనుకున్నారు ఈటె లేదా ధనస్సు మరియు బాణంతో వేటాడేవారు. అనేక జంతువుల చర్మాలను వలవడానికి తమ పళ్లు సరిపోవని భావించి వీటిని తయారు చేసుకున్నారు.

టెలిఫోన్‌ అనేది సమాచారానికి ఉపయోగపడే సాధన సంపత్తి. ఇది ఇద్దరు వ్యక్తులు తమ సంభాషణను ఒక స్థాయిలో పంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రతి వినియోగదారుడు మరియు సమాచార నెట్‌వర్క్‌ను ఉపయోగించి మరొకరితో మాట్లాడతారు. ఇది మీడియా మరియు సమాచార సాంకేతిక వ్యవస్థలో అతి ముఖ్యమైన అంశంగా మాఇంది. ఈ సాధన సంపత్తిని తొలుత ప్రముఖ గుర్తింపు కోసం వినియోగించారు. మార్షల్‌ మెక్‌లూహన్‌ చెప్పినట్లు మనం సాధన సంపత్తిని తయారు చేసుకుంటున్నాం. తర్వాత సాధన సంపత్తి మనల్ని తయారు చేస్తుంది. మనం సాంఘికంగా అనుసరిస్తున్న కొత్త సాధన సంపత్తిని మనం తొలుత తయారు చేసిన దానికంటే మెరుగ్గా ఉందన్న అంశాన్ని ప్రస్తావిస్తూ మెక్‌లూహన్‌ ఈ వ్యాఖ్య చేశారు.

16వ శతాబ్దంలో పయనిస్తున్న ఓడ ది మేరీ రోజు నుంచి సంపాదించిన కార్పెంటరీ సాధన సంపత్తి.

జంతువులు ఉపయోగించిన సాధన సంపత్తి


అనేక పరిశీలను నిర్ధారించిన దాని ప్రకారం అనేక రకాల జీవులు సాధన సంపత్తిని ఉపయోగిస్తాయి. ఇందులో కోతులు, కొండముచ్చులు, అనేక పక్షులు మరియు సముద్ర జీవులు కూడా ఉన్నాయి. సిద్దాంతకర్తలు ప్రాథమికంగా ఆలోచించిన దాని ప్రకారం, కేవలం మనుషులు మాత్రమే సాధన సంపత్తిని తయారు చేయగలరు . అయితే జూలాజిస్ట్‌లు కొన్ని పక్షులు, [3] కోతులు కూడా సాధన సంపత్తిని తయారు చేయగలవని తేల్చారు.[4][5][6] ప్రస్తుతం మానవులు సాధన సంపత్తితో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే ఇతర సాధన సంపత్తిని కూడా తయారు చేయగలిగిన జీవులు మానవులు మాత్రమే.[citation needed]

విధులు

సాధన సంపత్తి యొక్క ప్రాథమిక విధులు:

 • చాకు, కోతకత్తి, కొడవలి వంటి కోసే సాధన సంపత్తి వెడల్పాటి ఆకారంతో కూడి ఉంటాయి. చివరికి వచ్చేసరికి సన్నగా ఉండి, కోయడానికి అనువుగా రూపొందుతాయి. ఈ సాధన సంపత్తి అంచు కోయాల్సిన వస్తువు కంటే గట్టిగా ఉండటం మంచిది. లేదంటే కొంతకాలం పాటు వాడిన తర్వాత దాని పదును పూర్తిగా తగ్గిపోతుంది. అయితే చాలా పదునైన సాధన సంపత్తికి కూడా తరచూ పదును పెట్టడం అవసరం అవుతుంది. ఇది దాని అంచుల్లోని తుప్పు తదితరాలను వదలగొట్టే ప్రక్రియ. అర్ధచంద్రాకారపు డ్రిల్‌ బిట్లను ఇందుకు ఉపయోగిస్తారు.
 • కదిలే సాధన సంపత్తి భారీ, చిన్న వస్తువులను కదల్చుతాయి. ఉదాహరణకు బలమంతటినీ ఒకచోట కేంద్రీకరించే సుత్తి వంటి సాధన సంపత్తి మేకులను దొగ్గొడుతుంది. మౌల్‌ గసికను కదల్చుతుంది.కొరడా గుర్రం చర్మాన్ని వదిలిస్తుంది. ఇవి ఉపరితలంపై భౌతిక ఒత్తిడిని కలగజేయడం ద్వారా పని చేస్తాయి. అలాగే స్క్రూడ్రైవర్‌ విషయంలో టోర్క్‌గా పిలిచే రొటేషనల్‌ శక్తిని వాడతారు. రాయడంలో కూడా ఇంకు కాట్రిడ్జ్‌లో చురుకుదనం కలిగించడం ద్వారా ఉపరితలంపైకి స్రావాన్ని దింపే పరిజ్ఞానం దాగుంటుంది. గ్లోవ్‌, రెంచి, ప్లయర్ల వంటివాటి సాయంతో నట్లు, బోల్టులను తిప్పడం, బిగించడం కూడా అంతే. ఈ సాధన సంపత్తంతా ఏదో ఒక రకమైన శక్తి సాయంతోనే వస్తువులను కదిలిస్తాయి. ట్రక్కులు, రాకెట్లు, విమానాలు భారీ వస్తువులను, చిన్న యాక్సిలరేటర్లు చిన్న వస్తువులను కదల్చుతాయి.
 • ఉష్ణోగ్రత, ఇగ్నిషన్‌ వంటి రసాయనిక మార్పులను కలగజేసే సాధన సంపత్తిలోకి లైటర్లు, బ్లో టార్చిల వంటివి వస్తాయి.
 • సాయపడే, కొలిచే, తాకే సాధన సంపత్తిలోకి రూలర్‌, గ్లాసులు, సెట్‌ స్క్వేర్‌, సెన్సర్లు, స్ట్రెయిటెడ్జ్‌, థియోడొలైట్‌, సూక్ష్మదర్శిని, మానిటర్‌, గడియారం, ఫోన్‌, ప్రింటర్‌ వంటివి వస్తాయి.
 • మౌల్డులు, జిగ్గులు, ట్రోవెల్స్‌ వంటివి షేపింగ్‌ సాధన సంపత్తి.
 • వెల్డర్లు, రివెట్‌ గన్నులు, మేకు గన్సులు, అతికే గన్నుల వంటివి ఫాస్టెనింగ్‌ సాధన సంపత్తి.
 • కంప్యూటర్లు, మిడిల్‌వేర్‌, ఐడీఈ, స్ప్రెడ్‌షీట్ల వంటివి సమాచార, మానిప్యులేషన్‌ సాధన సంపత్తి.

కొన్ని రకాల సాధన సంపత్తి ఇతర సాధన సంపత్తి కలయిక కూడా అయ్యుండవచ్చు. ఉదాహరణకు అలారం గడియారం మెజరింగ్‌ సాధన సంపత్తి (గడియారం), తాకే సాధన సంపత్తి (అలారం) ల కలయిక. దీనిద్వారా అలారం గడియారం పైన పేర్కొన్న అన్ని విభాగాలకూ అతీతంగా వేరే విభాగంలోకి వెళ్తుంది.

రక్షణాత్మక గేర్ల వస్తువులను సాధన సంపత్తిగా పరిగణించరు. ఎందుకంటే అవి నేరుగా పని చేయడానికి సాయపడవు. కేవలం సాధారణ బట్టల మాదిరిగా కార్మికున్ని కాపాడతాయి. వ్యక్తిగతమైన రక్షణాత్మక సాధన సంపత్తిలో గ్లోవ్స్‌, సేఫ్టీ కళ్లద్దాలు, చెవులకు తొడుగులు, వాతావరణ ప్రమాదం నుంచి కాపాడే సూట్ల వంటివి వస్తాయి.

సాధన సంపత్తి ప్రతిక్షేపం

తరచూ నిర్మాణపరంగానో, యాదృచ్ఛికంగానో ఒక సాధన సంపత్తి కీలకమైన పనితీరు యాట్రిబ్యూట్లను ఒకటి, లేదా అంతకంటే ఎక్కవ ఇతర సాధన సంపత్తులతో పంచుకోవచ్చు. ఈ సందర్భంలో కొన్ని సాధన సంపత్తులు ఇతర సాధన సంపత్తులకు ప్రతిక్షేపంగా మారతాయి. అది తాత్కాలిక పరష్కారంగా కావచ్చు, లేదంటే వాటి వాస్తవిక సామర్థ్యం ఆధారంగా కూడా కావచ్చు. ఒక్క సాధన సంపత్తే దీన్ని మొత్తాన్నీ చేసేస్తుంది అనేది వాస్తవికంగా ప్రతి చోటికీ పని చేసేందుకు అవసరమైన అన్ని ప్రత్యేక సాధన సంపత్తులనూ మోసుకెళ్లలేని కార్మికులకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఆదర్శం. సాధన సంపత్తి ప్రతిక్షేపాన్ని స్థూలంగా రెండు తరగతులుగా విభజించవచ్చు: నిర్మాణపరంగా ప్రతిక్షేపం, లేదా బహూళార్థ వాడకం, తాత్కాలిక ప్రతిక్షేపం. చాలా సందర్భాల్లో సాధన సంపత్తులకు సంబంధించిన ద్వితీయ వాడకపు ఉపయోగాలు పెద్దగా బయటికి తెలియనివే అయ్యుంటాయి. ఉదాహరణకు, కర్రను కోసే చేతి రంపాలు వడ్రంగికి కొలతల పనులకు కూడా పనికొస్తాయి. దాని చేతి పిడి 90 డిగ్రీలు, 45 డదిగ్రీల కోణాలను కొలతలు వేసేందుకు అనువుగా ప్రత్యేక రీతిలో నిర్మితమై ఉంటుంది. పిడిని నిర్ధారిత భాగంలో, ప్రత్యేక రీతిలో అమర్చితే వాటిని కొలతలు వేయడం చాలా తేలిక. రంపం వెనక మూలతో దీన్ని సమన్వయం చేసుకుంటే సరిపోతుంది. ఇక రెండో దానికి ఉదాహరణగా అన్ని సాధన సంపత్తులనూ సుత్తెలుగా వాడవచ్చు అన్న సామెత ద్వారా వ్యాఖ్యానించవచ్చు. దాదాపుగా అన్ని సాధన సంపత్తులనూ సుత్తి మాదిరిగా ఉపయోగించడం సాధ్యమే. అయితే సుత్తి చేసే పనిని చేసేందుకు ప్రత్యేకించి తయారయ్యే సాధన సంపత్తులు బహూ కొద్ది మాత్రమే ఉంటాయి. అలాగే సిసలైన సుత్తెలకు దీటుగా వాటిని పనిని చేసే ఇతర సాధన సంపత్తులు కూడా కొన్ని మాత్రమే ఉంటాయి.

బహూళార్థ సాధన సంపత్తులు

 • బహూళ సాధన సంపత్తి అంటే మోసుకెళ్లేందుకు అనువైన ఒకే పరికరంలో పలు సాధన సంపత్తులను అమర్చడం.
 • లైన్‌మన్‌ ప్లయర్లలో గ్రిప్పర్‌, కటర్‌ కూడా ఉంటాయి. పైగా ప్లయర్లను వారు తరచూ సుత్తెగా కూడా వాడుతుంటారు.
 • చేతి రంపాలు కార్పెంటర్‌కు చతుర్భుజిగా కూడా ఉపయోగపడతాయి. రంపం తాలూకు పదును లేని వైపు, రంపం పిడిల కలయికతో ఈ పని సాధ్యపడుతుంది.

చరిత్ర

10 వేల సంవత్సరాల వయసు గల చరిత్రకు ముందు సాధన సంపత్తి, ఫ్రాన్స్‌లోని లెస్‌ కోంబేర్‌లెస్‌ గుహల్లో దొరికాయి.

సాధన సంపత్తులను మనుషులతో పాటు చింపాంజీలు కూడా అతి విరివిగా వాడతాయి. అందుకే తొలిసారిగా సాధన సంపత్తుల యథాలాప వాడకం ఈ రెండు జాతులుగా ఆదిమ మానవుడు విడిపోయే క్రమంలోనే ఎప్పుడో సంభవించి ఉంటుందని భావిస్తారు.[7] ఈ ఆదిమ సాధన సంసత్తి కర్ర, ముడి రాతి వంటి త్వరగా నశించే వస్తువులతో తయారైనదే అయ్యుండేది. రాళ్లను సాధన సంపత్తులగా వాడటానికీ, వీటికీ మధ్య పెద్దగా తేడా ఉండేది కాదు. రాతియుగం ఆరంభం మానవ జాతి తొలిసారిగా రాతి సాధన సంపత్తులను తయారు చేయడానికి నాంది పలికింది. వీటికి సాక్ష్యాలు ఇథియోపియాలో దాదాపుగా 26 లక్షల ఏళ్ల వెనకకు కూడా లభిస్తున్నాయి.[8] అత్యంత పురాతన కాలానికి చెంది, ఇప్పటికీ గుర్తించగలుగుతున్న రాతి సాధన సంపత్తిగా చేతి గొడ్డలిని చెప్పవచ్చు.

రాతి సాధన సంపత్మిత నుంచి లోహపు సాధన సంపత్తికి మార్పు దాదాపుగా క్రీస్తుపూర్వం 4,000 సంవత్సరాలప్పుడు వ్యవసాయాన్ని కనిపెట్టడంతో పాటుగానే జరిగి ఉంటుంది.

ఇక మధ్య యుగాల్లో యాంత్రిక పరికరాలను భారీ విస్తృతిని చవిచూశాయి. కొత్త తరహా ఇంధన వనరుల వ్యవస్థీకృతమైన వాడకం మొదలైంది. నీరు (నీటిచక్రాలు), గాలి (గాలిమరలు) వంటివి ఇందుకు ఉదాహరణ.

యాంత్రిక సాధన సంపత్తి పారిశ్రామిక విప్లవ సమయంలో మరిన్ని కొత్త తరహా సాధన సంపత్తుల ఆవిష్కారానికి దారి తీసింది. సాధన సంపత్తి నానాటికీ పరిమాణంలో సూక్ష్మతను సంతరించుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం కూడా సాధన సంపత్తి ఆవిష్కరణల్లో అలాంటి విస్తృతే చోటుచేసుకుంటుందని నానో టెక్నాలజీ స్వాప్నికులు అంచనా వేస్తున్నారు.[9][10]

వీటిని కూడా చూడండి

 • డివైజ్‌ ప్యారడిజమ్‌
 • టూల్‌ మేకర్‌
 • సాధన సంపత్తిని అద్దెకు ఇచ్చే లైబ్రరీల జాబితా
 • సాధన సంపత్తి బ్యాంక్‌

సూచనలు

 1. శామ్‌ లిల్లీ,మెన్‌, మెషీన్స్‌ అండ్‌ హిస్టరీ: సాంఘిక గమనంలో సాధన సంపత్తి మరియు యంత్రాల యొక్క సంబంధం గురించి కథ, 1948 కోబెట్‌ ప్రెస్‌
 2. ప్రిమేట్స్‌ మరియు వారి అడాప్షన్స్‌, 2001, ఎమ్‌.జె. ఫారాబీ, నవంబర్ 6, 2006న పునరుద్ధరించబడింది.
 3. సాధన సంపత్తి డయామీటర్‌ సెలక్షన్‌ బై న్యూ కెలెడోనియన్‌ క్రోస్‌ కార్వస్‌ మోనెడ్యూలోడీస్‌ , జాకీ చాపెల్‌ మరియు అలెక్స్‌ కేక్‌లెనిక్‌, 2003 నవంబరు 29.
 4. Calvin, William H. "The Throwing Madonna: Essays on the Brain".
 5. Host: Alan Alda (02-09-2005). "Chimp Minds". Scientific American Frontiers. episode 4. season 15. PBS. http://www.pbs.org/saf/1504/. 
 6. "Rolling Hills Wildlife Adventure: Chimpanzee".
 7. వైటెన్‌ ఎ., జె.గుడ్‌ఆల్‌, డబ్ల్యు.సి. మెక్‌ గ్రూ, టి. నిషిదా, వి.రేనాల్డ్స్‌, వై.సుగియామా, సి.ఇ.జి. టుటిన్‌, ఆర్‌.డబ్ల్యు. వ్రాగామ్‌ మరియు సి. బోష్‌. 1999. చింపాజీలలో సంస్కృతులు, ప్రకృతి 399: 682-685. పాంజెర్‌, ఎమ్‌.ఎ., ఎ.ఎస్‌.బ్రూక్స్‌, బి.జి.రిచ్‌మండ్‌ మరియు బి. ఉడ్‌ 2002. ఓల్డోవాన్‌ కంటే పాతదా? హుమానియన్‌ సాధన సంపత్తి యొక్క ఎమర్జెన్స్‌ గురించి పునరాలోచన. ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీ: ఇష్యూస్‌, వార్తలు మరియు సమీక్షలు 11: 235-245.
 8. సెమా, ఎస్‌., ఎమ్‌.జె.రోజర్స్‌, జె.క్యూయేడ్‌, పి.ఆర్‌. రెన్నె, ఆర్‌.ఎఫ్‌. బట్లర్‌, ఎమ్‌. డిమిన్‌గ్యూజ్‌-రోడ్రిగో, డి.స్టౌట్‌, డబ్ల్యు.ఎస్‌.హర్ట్‌, టి.పికెరింగ్‌, మరియు ఎస్‌.డబ్ల్యు. సింప్సన్‌. 2003. 2.6 మిలియన్‌ - సంవత్సరాల-వయసుగల సాధన సంపత్తి మరియు అసోసియేటెడ్‌ ఎముకల ఫ్రమ్‌ ఓజిఎస్‌ -6 మరియు ఓజిఎస్‌-7, గోనా, ఎ ఫార్‌, ఇథియోపియా. జర్నల్‌ ఆఫ్‌ హ్యూమన్ ఎవాల్యుయేషన్‌ 45: 169-177.
 9. నానో సాంకేతిక పరిజ్ఞానం: ఎక్కువ సామర్ధ్యం ఉన్న టిని పార్టికల్స్‌, డేవిడ్‌ వీలాన్‌, నవంబర్ 6, 2006న పునరుద్ధరించబడింది
 10. ఈ టిని సైన్స్‌ ఉషర్‌ తర్వాతి పారిశ్రామిక విప్లవానికి కారణం అవుతుందా?, కత్రినా సి. అరబ్‌. నవంబర్ 6, 2006న పునరుద్ధరించబడింది

మూస:Types of tools