సాధన (నటి)

From tewiki
Jump to navigation Jump to search
సాధన
200px
వాకి (1965) చిత్రంలో సాధన
జననం
సాధనా శివదర్శిని.

(1941-09-02)1941 సెప్టెంబరు 2
మరణం2015 డిసెంబరు 25(2015-12-25) (వయస్సు 74)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1958–1977, 1994
సుపరిచితుడుHusna in Mere Mehboob
Sandhya/Seema in Woh Kaun Thi?
Meena Mittal in Waqt
Geeta/Nisha (Raina) in Mera Saaya
జీవిత భాగస్వాములుR. K. Nayyar (1965–d.1995)

సాధన (హిందీ: साधना, సింధీ: ساڌنا) భారతదేశానికి చెందిన ఒక ప్రసిద్ధ బాలీవుడ్ నటి. ఆమె సెప్టెంబరు 2, 1941న సింధ్‌లోని (బ్రిటీష్ ఇండియా) కరాచీ నగరంలో జన్మించారు, ఈ ప్రాంతం ఆ సమయంలో భారతదేశంలో భాగంగా ఉండేది, 1947 తరువాత ఇది పాకిస్థాన్‌లో భాగమైంది. ఆమె బాబాయి, నటుడు హరి శివదాసానీ కుమార్తె బబితా కూడా నటిగా రాణించారు.

బాల్య జీవితం

సాధన 1941లో జన్మించారు, తన తండ్రి అభిమాన నటి సాధనా బోస్‌కు గుర్తుగా ఆమెకు ఈ పేరు పెట్టడం జరిగింది, ఆమె తండ్రి మరియు హరి శివదాసానీ అన్నదమ్ములు, తద్వారా నటి బబితకు ఈమె సోదరి అవుతుంది. తల్లిదండ్రులకు ఒకే బిడ్డ కావడంతో సాధన వారి జీవితంగా మారింది; వాస్తవానికి, సాధన తల్లి ఆమెకు 8 ఏళ్లు వయస్సు వచ్చే వరకు ఇంటిలోనే విద్యా బోధన చేశారు. దేశవిభజన సందర్భంగా జరిగిన అల్లర్లు కారణంగా ఆమె కుటుంబం పాకిస్థాన్‌లోని కరాచీ నగరాన్ని విడిచిపెట్టి వచ్చింది. దీని ఫలితంగా ఆమె తల్లిదండ్రులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ, వారు తమ కుమార్తెను వారానికి కనీసం రెండు సినిమాలు చూడనిచ్చేవారు. 15 ఏళ్ల వయస్సులో, ఒక కళాశాల నాటకంలో కొందరు నిర్మాతలు ఆమెను గుర్తించారు, ఆమె సాహిత్యంలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ చేశారు. భారతదేశపు మొదటి సింధీ చలనచిత్రం అబానా (1960)లో నటించే అవకాశాన్ని నిర్మాతలు ఆమెకు ఇచ్చారు, దీనిలో ఆమె చిత్ర కథానాయిక సోదరిగా నటించింది, దీనికి ఆమెకు రూ.1 పారితోషకం చెల్లించారు. ఈ చిత్ర ప్రచారానికి ఉపయోగించిన ఛాయాచిత్రం ద్వారా ఆమె ఒక చలనచిత్ర మేగజైన్‌లో కనిపించింది. ఆ సమయంలో భారతదేశపు ప్రముఖ చలనచిత్ర నిర్మాతల్లో ఒకరైన సుబోధ్ ముఖర్జీ ఈ మేగజైన్ చూసి తన మొదటి హిందీ చలనచిత్రం లవ్ ఇన్ సిమ్లా (1959)లో కొత్తగా తెరంగేట్రం చేస్తున్న తన కుమారుడు జోయ్ ముఖర్జీ సరసన ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఆమెకు ఇచ్చారు. ఈ చలనచిత్రానికి ఆర్.కే.నాయర్ అనే నూతన దర్శకుడు దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు, ఆమె పేరు చెప్పగానే గుర్తుకొచ్చేటువంటి "సాధనా ప్రింజ్'ను (ఒక రకమైన కేశాలంకరణ) నాయర్ సృష్టించారు. నుదురుపై జుట్టు పడేవిధంగా ఈ కేశాలంకరణను ఆండ్రి హెప్‌బర్న్ కేశాలంకరణ శైలిని చూసి మలచడం జరిగింది, సాధనకు లోపంగా భావించిన ఆమె వెడల్పాటి నుదురు భాగాన్ని కప్పేందుకు ఈ కేశాలంకరణను స్వీకరించారు. ఈ చలనచిత్రం ఘన విజయం సాధించింది, సాధన రాత్రికిరాత్రే పెద్ద స్టార్‌గా అవతరించింది. అంతేకాకుండా ఈ చలనచిత్ర దర్శకుడితో ఆమె ప్రేమలో పడ్డారు, అప్పుడు ఆమెకు 16 ఏళ్లే కావడం గమనార్హం. ఈ బంధాన్ని వదులుకోకపోతే, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని సాధన తల్లిదండ్రులు అప్పుడు 22 ఏళ్ల నాయర్‌ను బెదిరించారు. దీంతో ఆయన భయపడి, వెనుకడుగు వేశాడు.

ప్రారంభ వృత్తి జీవితం

సాధన చలనచిత్రాల్లో అడుగుపెట్టేందుకు హరి సాయపడ్డారు. రాజ్ కపూర్ యొక్క శ్రీ 420 (1955) చలనచిత్రంలో ఆమె ఒక కోరస్ బాలికగా ఉంది. అబానా (1958) అనే సింధీ చలనచిత్రంలో ఆమె రెండో కథానాయికగా నటించింది, ఈ చిత్రం ఆమెకు గుర్తింపు తీసుకురావడంతోపాటు, ఒక నట శిక్షణ పాఠశాలలో ప్రవేశాన్ని కల్పించింది. ఈ పాఠశాలను చలనచిత్ర నిర్మాత శశధర్ ముఖర్జీ నడిపేవారు, ఈ పాఠశాలలో మరో వర్ధమాన నటి ఆషా పరేఖ్ కూడా శిక్షణ పొందారు. దిల్ దేకే దేఖో (1959) చలనచిత్రాన్ని నిర్మిస్తున్నప్పుడు, ఆయన దర్శకుడు నాసీర్ హుస్సేన్‌కు సాధన మరియు ఆషా ఇద్దరిలో ఒకరిని కథానాయికగా ఎంచుకోవాలని సూచించారు; హుస్సేన్ కథానాయికగా ఆషాను ఎంచుకున్నారు.

అయితే, ఆయన తరువాతి ప్రాజెక్ట్ లవ్ ఇన్ సిమ్లా (1960)లో ముఖర్జీ దర్శకుడు ఆర్‌కే నాయర్ (రాజ్ కపూర్ సహాయకుడు)కు వీరిద్దరిలో ఎవరో ఒకరిని కథానాయికగా ఎంచుకోవాలని సూచించారు. నాయర్ కథానాయికగా సాధనను ఎంచుకున్నారు, ఆమె ఈ చిత్రంలో ముఖర్జీ కుమారుడు జోయ్ ముఖర్జీ సరసన కథానాయికగా నటించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో, సాధన మరియు దర్శకుడు ఆర్‌కే నాయర్ ప్రేమలో పడ్డారు, వీరు 1965లో వివాహం చేసుకున్నారు.

చలనచిత్ర జీవితం

(ఆండ్రి హెప్‌బర్న్ మాదిరిగా) కేశాలంకరణను మార్చుకోవాలని సాధనకు ఆర్‌కే సూచించారు; ఈ కేశాలంకరణకు తరువాతి కాలంలో బాగా ప్రాచుర్యం లభించింది, భారతదేశంలో ఇప్పటికీ ఇటువంటి కేశాలంకరణను "సాధనా కట్" సూచించడం జరుగుతుంది [1].

రాజేంద్ర కుమార్‌తో సాధన నటించిన చలనచిత్రం మేరే మెహబూబ్ (1963) ఆమె కెరీర్‌కు బాగా సాయపడింది, ప్రారంభ టెక్నికలర్‌లో ఆమె యొక్క కొన్ని అందమైన దృశ్యాలు ఈ చలనచిత్రంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే రాజ్ ఖోస్లా యొక్క "వోహ్ కౌన్ థీ?" (1964) ఆమె చలనచిత్ర జీవితంలో చిరస్మరణీయ చిత్రంగా నిలిచింది, "అద్భుతమైన బాలిక"గా ఆమెకు ఈ చిత్రం గుర్తింపు తీసుకొచ్చింది, దీనిలో ఆమె నటన ప్రతిఒక్కరినీ కట్టిపడేసింది. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతోపాటు, ఆమెకు ఉత్తమ నటిగా మొదటి ఫిల్మ్‌ఫేర్ నామినేషన్‌ను అందించింది. ఆమె నటనకు ముగ్ధుడైన ఖోస్లా మరో రెండు భారీ బడ్జెట్ మిస్టరీ చిత్రాలను సాధనతో చిత్రీకరించారు, ఈ చిత్రాల పేర్లు, మేరా సాయా (1966) మరియు అనితా (1967). బ్లాక్‌బస్టర్ వఖ్త్ (1965) చిత్రంతో ఆమె రెండో ఫిల్మ్‌ఫేర్ నామినేషన్ పొందారు, ఈ చిత్రంతో ఆమె బిగుతైన చుడీదార్ కుర్తాలతో మరో ఫ్యాషన్ ట్రెండ్‌కు నాంది పలికారు.

1960వ దశకం చివరి కాలంలో, థైరాయిడ్ సమస్య కారణంగా ఆమె చికిత్స కోసం బోస్టన్ వెళ్లారు. ఈ ఆరోగ్య సమస్య నుంచి పూర్తిగా కోలుకున్న ఆమె తరువాత ఇంతెఖామ్ (1969), ఎక్ పూల్ దో మాలీ (1969), మరియు స్వీయ దర్శకత్వంలో రూపొందిన గీతా మేరా నామ్ (1974) చిత్రాల్లో నటించారు. ఆమె తరువాత నటనను విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు, అభిమానుల దృష్టిలో తాను అందమైన యువ నటిగానే మిగిలిపోవాలనుకుంటున్నానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆమె మరియు ఆమె భర్త తరువాత ఒక నిర్మాణ కంపెనీని స్థాపించారు.

వ్యక్తిగత జీవితం

సాధన 1965లో ఆర్‌కే నాయర్‌ను వివాహం చేసుకున్నారు, ఆమెకు ముప్పై ఏళ్లు పైబడిన తరువాత ఈ వివాహం జరిగింది, 1990వ దశకంలో నాయర్ మరణించారు. ఆమె ఇప్పటికీ ముంబయిలో నివసిస్తున్నారు, అనేక మిత్రులను కలుసుకోవడం మరియు కుటుంబం మరియు ఇంటి పనులు మరియు వివిధ ప్రాజెక్టులను చూస్తున్నారు.

ప్రస్తుతం తరచుగా ఆమె మధ్యాహ్న భోజన సమయంలో 1960వ దశకపు నటీమణులైన: ఆషా పరేఖ్, నందా, వహీదా రెహ్మాన్ మరియు హెలెన్‌లను కలుస్తుంటారు.[2].

వ్యక్తిగత ఉల్లేఖనాలు

తాను నటించిన ఎక్కువ చలనచిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు రాజ్ ఖోస్లా గురించి ఆమె ఈ విధంగా అభిప్రాయపడ్డారు: ఆయన మాకు ఒక విధమైన కుటుంబ మిత్రుడు, ఒక నటిగా నా బలాలు మరియు బలహీనతలు ఆయనకు తెలుసు. ఆయనతో పనిచేయడం నాకు సౌకర్యవంతంగా ఉంటుంది. మేము బాగా కలిసిపోయామన్నారు."

ఇటీవల, సాధనను తన కింది అంతస్తు ఖాళీ చేయాల్సిందిగా బిల్డర్ యూసఫ్ లక్డావాలా బెదిరించాడు. చలనచిత్ర పెట్టుబడిదారుగా మరియు అండర్‌వరల్డ్‌తో సంబంధాలు ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందిన లక్డావాలా ఈ ఆస్తిని తిరిగి అభివృద్ధి చేయాలనుకున్నాడు. యాల్గార్ అనే చలనచిత్రానికి యూసఫ్ నిధులు సమకూర్చాడు, ఈ చలనచిత్ర షూటింగ్ సమయంలోనే సంజయ్ దత్, దావూద్ ఇబ్రహీంను కలిసినట్లు ఆరోపణలు ఉన్నాయి.[3]

సాధన & యూసఫ్ అత్త ఒకే భవనంలో వేర్వేరు అంతస్తుల్లో నివసిస్తున్నారు. సాధనను గతంలో కూడా యూసఫ్ లక్డావాలా బెదిరించాడు, ఆమె బాల్ థాకరేకు ఫిర్యాదు చేయడంతో అతను వెనక్కు తగ్గాడు.[4]

ఫిల్మోగ్రఫీ

సంవత్సరం చలనచిత్రం పాత్ర గమనిక
1958 అబానా
1960 లవ్ ఇన్ సిమ్లా సోనియా
పరేఖ్ సీమా ఆంగ్లం: ది ఎగ్జామినేషన్
1961 హమ్ దోనో మితా
1962 ప్రేమ్ పత్రా కవితా కపూర్ ఆంగ్లం: లవ్ లెటర్
మన్మౌజీ
ఎక్ ముసాఫీర్ ఎక్ హసీనా
అస్లీ-నఖ్లీ రేణు
1963 మేరే మెహబూబ్ హుస్నా
1964 వో కౌన్ థీ? సంధ్యా/సీమా
రాజ్ కుమార్ ప్రిన్సెస్ సంగీతా
పిక్నిక్
దుల్హా దుల్హాన్ రేఖా
1965 వఖ్త్ మీనా మిట్టల్
అర్జూ (1965 చలనచిత్రం) ఉషా
1966 మేరే సాయా గీతా/నిషా (రైనా)
గబాన్
బుడ్తామీజ్ శాంతా
1967 అనిత అనిత
1969 సచాయ్ శోభా దయాళ్
ఇంతఖ్వామ్ రీటా మెహ్రా
ఎక్ ఫూల్ దో మాలీ సోమ్నా
1970 ఇష్క్ పార్ జోర్ నహీన్ సుష్మా రాయ్
1971 ఆప్ ఆయే బహార్ ఆయే నీనా బక్షి
1972 దిల్ దౌలత్ దునియా
1973 హమ్ సబ్ చోర్ హై
1974 గీతా మేరా నామ్
ఛోటే సర్కార్ (1974 చలనచిత్రం)
1974 వందనా (చలనచిత్రం)
1975 అమానత్ సుచిత్రా
1977 ఉల్ఫాత్
1978 మెహ్‌ఫిల్

మరణం

సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాధన డిసెంబరు 25 2015 న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.[5]

మూలాలు

బాహ్య లింకులు