సారథి (నటుడు)

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Sarathi.jpg
జగన్మోహిని చిత్రంలో సారథి

సారథి ప్రముఖ హస్యనటుడు. ఇతని పూర్తి పేరు కడలి జయసారథి.

జననం

ఇతడు పశ్చిమగోదావరి జిల్లా, పెనుగొండలో వీరదాసు, మహాలక్ష్మి దంపతులకు జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం

1945లో తొలిసారి మొదటిసారి శకుంతల నాటకంలో భరతుడిగా నటించాడు. ఆ తరువాత సుమారు 50 సంవత్సరాలు నాటకరంగానికి సేవచేశాడు. ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించాడు.

సినిమారంగ ప్రస్థానం

ఇతడు 1960లో సీతారామ కళ్యాణంతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ చిత్రంలో నలకూబరునిగా నటించాడు. అనేక సినిమాలలో హాస్యపాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇతడు దాదాపు 372 తెలుగు సినిమాలలో నటించాడు. తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వ్యవస్థాపక సభ్యుడు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఉన్నాడు[1].

కుటుంబం

ఇతనికి అనూరాధతో వివాహం జరిగింది. వీరికి ఉదయ్‌కిరణ్, ప్రశాంత్ అనే ఇద్దరు కుమారులున్నారు.

సినిమా రంగం

నందమూరి తారకరామారావు దర్శకత్వంలో వెలువడిన సీతారామ కళ్యాణం సినిమాలో నలకూబరునిగా తొలిసారి చలనచిత్రంలో నటించాడు. ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

 1. సీతారామ కళ్యాణం (1961) - నలకూబరుడు
 2. పరమానందయ్య శిష్యుల కథ (1966) - శిష్యుడు
 3. ఈ కాలపు పిల్లలు (1976)
 4. భక్త కన్నప్ప (1976)
 5. అత్తవారిల్లు (1977)
 6. అమరదీపం (1977)
 7. ఇంద్రధనుస్సు (1978)
 8. చిరంజీవి రాంబాబు
 9. జగన్మోహిని (1978)
 10. మన ఊరి పాండవులు (1978)
 11. సొమ్మొకడిది సోకొకడిది (1978)
 12. కోతల రాయుడు (1979)
 13. గంధర్వ కన్య (1979)
 14. దశ తిరిగింది (1979)
 15. అమ్మాయికి మొగుడు మామకు యముడు (1980)
 16. నాయకుడు – వినాయకుడు (1980)
 17. మదన మంజరి (1980)
 18. మామా అల్లుళ్ళ సవాల్ (1980)
 19. బాబులుగాడి దెబ్బ (1984)
 20. మెరుపు దాడి (1984) - అంజి
 21. ఆస్తులు అంతస్తులు (1988)
 22. మామా కోడలు

మూలాలు