"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
సిద్ధాంత శిరోమణి
Jump to navigation
Jump to search
సిద్ధాంత శిరోమణీ, ప్రాచీన భారతీయ గణితవేత్త రెండవ భాస్కరుని ప్రధాన రచన. 36 సంవత్సరాల వయసులో (అనగా క్రీ.శ 1150) రాయబడిన ఈ ఉద్గ్రంథంలో మూడు సంపుటాలుగా, సుమారు 1450 శ్లోకాలు ఉన్నాయి.[1]
భాగాలు
లీలావతి
ఇది భాస్కరుడు, తన కుమార్తె లీలావతి పేర రాసాడని ప్రసిద్ధి. ఇది సిద్ధాంత శిరోమణిలోని మొదటి భాగం. 13 అధ్యాయాలు, 278 శ్లోకాలు ఉన్న ఈ గ్రంథం అంకగణితం, కొలతలు గురించి చర్చిస్తుంది.
బీజగణితం
సిద్ధాంత శిరోమణిలోని రెండవ భాగం బీజగణితం. ఇది 6 అధ్యాయాలుగా, 213 శ్లోకాలుగా ఉండి బీజగణితం () గూర్చి చర్చిస్తుంది.
గణితాధ్యాయం, గోళాధ్యాయం
సిద్ధాంత శిరోమణిలోని మూడవ భాగమైన గణితాధ్యాయం, గోళాధ్యాయం, జ్యోతిష్య గ్రంథం. ఇది సుమారు 900 శ్లోకాలతో కూడి ఉన్నది.[2]
మూలాలు
- ↑ "khagol Maandal". Archived from the original on 2012-04-20. Retrieved 2013-01-20.
- ↑ "BHASKAR'S ASTRONOMY". Archived from the original on 2012-04-20. Retrieved 2013-01-20.