సిమ్లా

From tewiki
Jump to navigation Jump to search
సిమ్లా

शिमला

సిమ్లా
ముఖ్య పట్టణం
Shimla Montage
పైనుంచి సవ్యదిశలో: దక్షిణ సిమ్లా, రాష్ట్రపతి నివాస్, టౌన్ హాల్, రాత్రివేళ సిమ్లా, సెంట్ మైకెల్స్ కాథలిక్ చర్చి
దేశం India
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
జిల్లాసిమ్లా
ప్రభుత్వం
విస్తీర్ణం
 • మొత్తం25 km2 (10 sq mi)
సముద్రమట్టం నుండి ఎత్తు
2,205 మీ (7 అ.)
జనాభా
(2011)[2]
 • మొత్తం171
 • ర్యాంకు1 (in హిమాచల్)
 • సాంద్రత120/km2 (300/sq mi)
భాషలు
 • అధికారికహిందీ
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
171 001
టెలిఫోన్ కోడ్91 177 XXX XXXX
ISO 3166 కోడ్[[ISO 3166-2:IN|]]
వాహనాల నమోదు కోడ్HP-03, HP-51, HP-52
ClimateCwb (Köppen)
Precipitation1,577 mమీ. (62 అం.)
Avg. annual temperature13 °C (55 °F)
Avg. summer temperature18 °C (64 °F)
Avg. winter temperature5 °C (41 °F)
జాలస్థలిhpshimla.gov.in

సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం. అదే పేరుతో ఉన్న జిల్లాకు ముఖ్య పట్టణం. ఈ నగరం ఆపిల్ తోటలకు ప్రసిద్ధి. ఇది ఆంగ్లేయులకు భారతదేశపు వేసవి రాజధానిగా ఉండేది. భారతదేశంలో పెద్ద, అభివృద్ధి చెందుతున్న నగరంగా సిమ్లాకు గుర్తింపు ఉంది. కళాశాలలు, పరిశోధనా సంస్థలకు ఇది నెలవు. తుడోర్ బెతన్, నియో-గోతిక్ నిర్మాణాలలో వలసరాజ్యాల కాలం నాటి అనేక భవనాలకూ, ఎన్నో దేవాలయాలకూ, చర్చిలకు సిమ్లా నెలవు. ఈ కట్టడాలతో పాటు, నగరం యొక్క సహజ వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తాయి. శ్రీ హనుమాన్ జాఖు (విగ్రహం), జాఖు ఆలయం, వైస్రెగల్ లాడ్జ్, క్రైస్ట్ చర్చి, మాల్ రోడ్, ది రిడ్జ్ ఇంకా అన్నాడేల్ నగర కేంద్ర ప్రధాన ఆకర్షణలు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కల్కా-సిమ్లా రైల్వే మార్గం కూడా ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఇది బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. ఎత్తైన భూభాగం కారణంగా, పర్వత బైకింగ్ రేసు ఎం.టి.బి (MTB) హిమాలయకు సిమ్లా ఆతిథ్యం ఇస్తుంది. 2005 లో ప్రారంభమైన ఈ రేసును దక్షిణ ఆసియాలో ఈ రకమైన అతిపెద్ద కార్యక్రమంగా పరిగణిస్తారు.[3]

శబ్దవ్యుత్పత్తి

కాళి దేవత నిర్భయ అవతారమైన శ్యామల మాత పేరు నుండి సిమ్లా నగరానికి ఈ పేరు వచ్చింది. కాళి బారి ఆలయం ది రిడ్జ్ సమీపంలో ఉన్న బాంటొనీ కొండపై ఉంది.[4] మరొక కథనం ప్రకారం, నీలి పలక అని అర్ధం వచ్చే శ్యామాలయ అనే పదం నుండి సిమ్లాకు ఈ పేరు వచ్చింది. కానీ సాధారణంగా, చాలా మంది మొదటి కథనాన్ని మరింత నమ్మదగిన, ఆమోదయోగ్యమైన, సబబైన కథనంగా పరిగణిస్తారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నగర పేరును సిమ్లా నుండి శ్యామలగా మార్చాలనుకుంటుందని వార్తలు వినిపించాయి. కానీ ప్రజల, స్థానికుల ప్రతికూల స్పందనను చూసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికను తోసిపుచ్చింది.[5]

చరిత్ర

18 వ శతాబ్దంలో ప్రస్తుత సిమ్లా నగరప్రాంతం చాలా దట్టమైన అడవి ప్రాంతం. అప్పట్లో అక్కడ ఉన్నవి జాఖు ఆలయం, ఇంకా కొన్ని చెల్లాచెదురుగా ఉన్న ఇళ్ళు.[6] ప్రస్తుత సిమ్లా ప్రాంతం 1806 లో నేపాల్‌కు చెందిన భీమ్సేన్ థాపా చేత ఆక్రమించబడింది. ఆంగ్లో-నేపాలీ యుద్ధం (1814-16) తరువాత సుగౌలీ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. మే 1815 లో డేవిడ్ ఓచెర్లోనీ నాయకత్వంలో మలాన్ కోటపై దాడి చేసి గూర్ఖా నాయకులను అణచివేశారు. 1817 ఆగస్టు 30 నాటి డైరీ ఎంట్రీలో, ఈ ప్రాంతాన్ని సర్వే చేసిన గెరార్డ్ సోదరులు, సిమ్లాను "ప్రయాణికులకు నీరు ఇవ్వడానికి ఫకీర్ ఉన్న మోస్తరు గ్రామం" అని వర్ణించారు.

1819 లో, హిల్ స్టేట్స్‌ రాజకీయ ఏజెంటు లెఫ్టినెంట్ రాస్, సిమ్లాలో ఒక చెక్క కుటీరాన్ని ఏర్పాటు చేశాడు. మూడు సంవత్సరాల తరువాత, అతని వారసుడు మరియు స్కాటిష్ పౌర సేవకుడు చార్లెస్ ప్రాట్ కెన్నెడీ, 1822 లో కెన్నెడీ కాటేజ్ అనే ప్రాంతంలో అన్నాడేల్ సమీపంలో మొట్టమొదటి పక్కా ఇంటిని నిర్మించాడు. దీన్ని ఇప్పుడు సి.పి.డబ్ల్యు.డి (CPWD) కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. వేసవులలో ఇక్కడి బ్రిటన్ తరహా వాతావరణం గురించిన కథలు అనేక బ్రిటిష్ అధికారులను ఈ ప్రాంతానికి ఆకర్షించడం ప్రారంభించాయి. 1826 నాటికి, కొందరు అధికారులు తమ మొత్తం సెలవులను సిమ్లాలో గడపడం ప్రారంభించారు. 1827 లో, బెంగాల్ గవర్నర్ జనరల్ విలియం అమ్హెర్స్ట్ సిమ్లాను సందర్శించి కెన్నెడీ హౌస్‌లో బస చేశారు. ఒక సంవత్సరం తరువాత, భారతదేశంలోని బ్రిటిష్ దళాల కమాండర్-ఇన్-చీఫ్ స్టేపుల్టన్ కాటన్ అదే నివాసంలోనే ఉన్నారు. ఆయన బస చేసిన సమయంలో, జాఖూ సమీపంలో మూడు మైళ్ల రహదారి, వంతెనను నిర్మించారు. 1830 లో, బ్రిటీష్ వారు కియొంతల్, పాటియాలా అధిపతుల నుండి పరిసర భూమిని తీసుకుని ప్రతిగా రావిన్ పరగణాను ఇంకా భరౌలి పరగణాలో ఒక భాగాన్ని వారికిచ్చారు. ఆ తర్వాత ఈ చోటు, 1830 లో 30 ఇళ్ల నుండి 1881 లో 1,141 ఇళ్ల దాకా, వేగంగా విస్తరించింది.[7]

సిమ్లాను చోటా సిమ్లాతో కలిపే వంతెన, మొదట 1829 లో స్టేపుల్టన్ కాటన్ చేత నిర్మించబడింది

సంస్కృతి

సిమ్లాలో వివిధ ప్రాంతాల ప్రజలు నివసిస్తారు, రకరకాల పండుగలను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం పర్యాటకులు గరిష్టంగా ఉండే కాలంలో, 3-4 రోజుల పాటు సిమ్లా వేసవి పండుగ జరుపుతారు.[8] దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో ప్రముఖ గాయకులు ఈ పండుగలో అలరిస్తారు. 2015 నుండి, 95.0 బిగ్ ఎఫ్.ఎం, హిమాచల్ పర్యాటక శాఖ సంయుక్తంగా ఏడు రోజుల సుదీర్ఘ శీతాకాలపు సంబరాలను రిడ్జ్‌లో క్రిస్మస్ నుండి నూతన సంవత్సరం వరకు నిర్వహిస్తున్నాయి.[9]

ఈ ప్రాంతంలోని కళాఖండాలను, ఆభరణాలు, వస్త్రాల సేకరణను రాష్ట్ర సంగ్రహాలయంలో చూడవచ్చు. దీనిని 1974 లో నిర్మించారు. రిడ్జ్ నుండి విస్తరించి ఉన్న లక్కర్ బజార్లో చెక్కతో చేసిన స్మృతి చిహ్నలను విక్రయిస్తారు. ప్రధాన నగరానికి 55 కిలోమీటర్లు (34.2 మైళ్ళు) ఉన్న వేడి సల్ఫర్ స్ప్రింగ్స్ కు తట్టా పానీ అని పేరు. సత్లుజ్ నది ఒడ్డున ఉన్న ఇక్కడి నీటికి ఔషధ విలువలు ఉన్నాయని ప్రజలు నమ్ముతారు. సిమ్లా దక్షిణ ఆసియా యొక్క ఏకైక సహజ ఐస్ స్కేటింగ్ రింక్‌కు నిలయం.[10] ఈ వేదిక వద్ద తరచుగా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు జరుగుతాయి. రింక్‌ను నిర్వహించే సిమ్లా ఐస్ స్కేటింగ్ క్లబ్, ప్రతి సంవత్సరం జనవరిలో కార్నివాల్ నిర్వహిస్తుంది. ఇందులో ఫ్యాన్సీ దుస్తుల పోటీ, ఫిగర్ స్కేటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సిమ్లా ఇంకా పరిసరాల్లో గ్లోబల్ వార్మింగ్, పెరుగుతున్న పట్టణ అభివృద్ధి ప్రభావాల కారణంగా, ప్రతి శీతాకాలంలో మంచు మీద కార్యక్రమాల సంఖ్య గత కొన్ని సంవత్సరాలుగా తగ్గుతోంది.

రవాణా

జుబ్బర్ హట్టి విమానాష్రయం

వివిధ ప్రదేశాల నుండి సిమ్లాకు ఉన్న దూరాలు:

మూలాలు

  1. 1.0 1.1 "Shimla Municipal Corporation". Shimla Municipal Corporation. Retrieved 2013-10-25.
  2. "Population in the age group 0-6 and literates by sex—urban agglomeration/town". Census of India 2001. Government of India. 27 May 2002. Retrieved 2007-04-14.
  3. HASTPA. "Hero MTB Himalaya : The 16th Edition". Hero MTB Himalaya : The 16th Edition. Retrieved 2021-05-26.
  4. "Stunning facts about Shimla no one told you before". Times of India Travel. Retrieved 2021-05-28.
  5. Staff, Scroll. "Himachal Pradesh is not considering any proposal to change Shimla's name to Shyamala, says CM". Scroll.in (in English). Retrieved 2021-05-28.
  6. Pubby, Vipin (1996). Shimla Then & Now (in English). Indus Publishing. ISBN 978-81-7387-046-0.
  7. Harrop, F. Beresford (1925). Thacker's new Guide to Simla. Simla: Thacker, Spink & Co. pp. 16–19.
  8. "Himachal Tourism - Adventure Tourism". web.archive.org. 2007-04-16. Retrieved 2021-05-26.
  9. Nov 28, TNN /; 2015; Ist, 10:31. "Winter carnival to add to Shimla's tourism | Shimla News - Times of India". The Times of India (in English). Retrieved 2021-05-26.CS1 maint: numeric names: authors list (link)
  10. "The Tribune, Chandigarh, India - Himachal Pradesh". www.tribuneindia.com. Retrieved 2021-05-26.