"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సిర్నాపల్లి జలపాతం

From tewiki
Jump to navigation Jump to search

సిర్నాపల్లి జలపాతం, జానకి బాయి జలపాతం లేదా తెలంగాన నయాగరా జలపాతం అనేది తెలంగాణ రాష్ట్రానికి చెందిన నిజామాబాదు జిల్లా లోని ధరపల్లి మండలం లోని సిర్నాపల్లి గ్రామంలో కలదు.

స్వాతంత్ర్యానికి పూర్ర్వం సిర్నాపల్లి సంస్థానానికి చెందిన సిర్నాపల్లి రాణి లేదా "సీలం జానకి బాయి" అనేక వేల ఎకరాల బూమి కలిగిన భూస్వామి. సీలం జానకీ బాయి ఆ రోజుల్లో ఒక తటాకాన్ని నిర్మించారు. ఆ సరస్సు నుండి ప్రవహించే నీరు రామడుగు ప్రాజెక్టు కు ప్రవహిస్తుంది. ఆమె తన సంస్థానంలో వ్యవసాయాభివృద్ధి కోసం అనేక సరస్సులు నిర్మించి ప్రజలకందించారు. ఆమె మంచిప్ప చెరువు ను కూడా నిర్మించారు. ఈ చెరువు నీరు నిజామాబాదు జిల్లా ప్రజల త్రాగు నీటి అవసరాలు తీర్చుటకు ఉపయోగపడేది.

శీలం/శీలం రాజా రామలింగ రెడ్డి, రాణి జానకీ బాయి లు సిర్నాపల్లి గ్రామంలో భూస్వాములు. వారి కుమారుడు శీలం రాం భూపాల్ రెడ్డి పదవీవిరమణ చేసిన ఐ.పి.ఎస్ అధికారి. జానకీబాయి యొక్క మునిమనుమడి అనురాధారెడ్డి. ఆమె హైదరాబాదు లో INTACH(ఇండియన్ నేషనల్ ట్రస్టు ఫర్ కల్చురల్ అండ్ హెరిటేజ్) కు కన్వీనరుగా యున్నారు.