సీతాపూర్

From tewiki
Jump to navigation Jump to search
సీతాపూర్
పట్టణం
సీతాపూర్ is located in Uttar Pradesh
సీతాపూర్
సీతాపూర్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
నిర్దేశాంకాలు: 27°34′N 80°40′E / 27.57°N 80.66°E / 27.57; 80.66Coordinates: 27°34′N 80°40′E / 27.57°N 80.66°E / 27.57; 80.66
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాసీతాపూర్
స్థాపన1857
పేరు వచ్చినవిధంసీతాదేవి
సముద్రమట్టం నుండి ఎత్తు
(in meters)
138 మీ (453 అ.)
జనాభా
(2011)
 • మొత్తం1,77,351
 • సాంద్రత630/km2 (1/sq mi)
భాషలు
 • అధికారికహిందీ, ఉర్దూ
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
261001
జాలస్థలిsitapur.nic.in

సీతాపూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, సీతాపూర్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. పట్టణ పరిపాలన మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. [1] సీతాపూర్ జిల్లా లక్నో డివిజన్‌లో ఉంది . ఈ పట్టణం సరాయన్ నది ఒడ్డున ఉంది. లక్నో, షాజహాన్పూర్ లకు సరిగ్గా మధ్యన ఉంది. జాతీయ రహదారి 24 ద్వారా లక్నోకు రవాణా సౌకర్యం ఉంది. ఇక్కడ ఒక కంటోన్మెంట్ ఉంది. బ్రిటిషు కాలంలో బ్రిటిష్ రెజిమెంటులో కొంత భాగం ఇక్కడ ఉండేది. [2]

రవాణా సౌకర్యాలు

రైలు

సీతాపూర్‌లో 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రధానమైన రైల్వే స్టేషను సీతాపూర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషను. జల్పాయిగురి నుండి అమృత్సర్ వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి. జన సాధారణ్ ఎక్స్‌ప్రెస్, జన నాయక్ ఎక్స్‌ప్రెస్, అమృత్సర్-సహర్సా ఎక్స్‌ప్రెస్, కర్మభూమి ఎక్స్‌ప్రెస్, జానసేవా ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు. సీతాపూర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తాయి.

రెండో స్టేషను సీతాపూర్ సిటీ జంక్షన్ రైల్వే స్టేషను. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. సీతాపూర్ నగరం నుండి ప్యాసింజర్ రైళ్లు ఉన్నావ్, బాలమౌ, షాజహాన్పూర్ లకు వెళ్తాయి.

మూలాలు

  1. "Sitapur Up Travel Guide". Goibibo.com. 19 June 2020.
  2. Bhatt, Vijay Kumar (2016). Asst. Director. Kanpur: Ministry of MSME, Government of India. pp. http://dcmsme.gov.in/dips/DIP%20Sitapur%20VKB%20AD%20EI.pdf.