సుంకర బాలపరమేశ్వరరావు

From tewiki
Jump to navigation Jump to search

సుంకర బాలపరమేశ్వరరావు (జననం 12 ఫిబ్రవరి 1928) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ న్యూరోసర్జన్‌[1] నిమ్స్‌ తొలి డైరెక్టర్‌గా, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా అనేక బాధ్యతలు నిర్వహించిన బాలపరమేశ్వరరావు 1983లో పదవీ విరమణ చేశారు. దాదాపు 15 వేలదాకా సర్జరీలు చేసారు.[2] ఆయనకు డా.బి.సి.రాయ్ అవార్డు ఆంధ్రప్రదేశ్ లో న్యూరో జర్జరీ అభివృద్ధి చేసినందుకు గాను వచ్చింది.

ప్రారంభ జీవితం, విద్య

ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరంలో శ్రీమతి సుంకర సీతమ్మ, సుంకర కనకం లకు ఫిబ్రవరి 12 1928 న జన్మించారు.ఆయన ప్రారంభ విద్యను మద్రాసులోని మైలాపూర్ లోని సెయింట్ థామస్ కాన్వెంట్ లోనూ, తదుపరి మచిలీపట్నంలోని భీమవరం లోనూ పూర్తి చేసారు. ఆయన 1945 నుండి 1950 వరకు ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎం.బి.బి.ఎస్ ను చేసారు. ఆయన 1950 లో అసాధారణ ప్రతిభకు గానూ సిల్వర్ జూబ్లీ అవార్డును కైవసం చేసుకున్నారు. ఆయన ఎం.ఎస్. జనరల్ సర్జరీని 1954 కీ ఆంధ్రా మెడికల్ కళాశాల, విశాఖపట్నంలో చేసారు. ఆయన మంచి క్రీడాకారుడు, టెన్నిస్ ఛాంపియన్.

ఉద్యోగ ప్రస్థానం

ఆయన ఆరు సంవత్సరాలు ఆంధ్రా మెడికల్ కాలేజీలో చేసిన తరువాత డెప్యుటేషను పై మద్రాసులో న్యూరోసర్జర్ శిక్షణ కొరకు వెళ్లారు. అచట ప్రముఖ న్యూరోసర్జన్ అయిన బి.రామమూర్తి అనే ప్రొఫెసర్ వద్ద శిక్షణ పొందారు. ఆ తరువాత యునైటెడ్ కింగ్ డమ్‌ వెళ్ళారు. చివరికి ఆంధ్రా మెడికల్ కాలేజి, విశాఖపట్నంలో స్థిరపడ్డారు. 1956 లో ఆయన ఆంధ్రా మెడికల్ కళాశాల, కింగ్ జార్జి ఆసుపత్రి, విశాఖపట్నం లలో న్యూరోజర్జన్ విభాగాన్ని ప్రారంభించారు. ఆ విభాగాలు 2006 న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకున్నాయి. ఆయన ఉస్మానియా జనరల్ హాస్పటల్ లో 1974-76 మధ్య పనిచేసారు. సూపరిండెంటెంట్ న్యూరో సర్జన్ గా నిజాం ఆర్థోపెడిక్ హాస్పటల్ అండ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ స్పెషలిటీస్, హైదరాబాదు (1976-80) లో పనిచేస్తూ పరిశోధనలు చేసారు. ఉస్మానియా యూనివర్శిటీలో న్యూరో సర్జన్ ప్రొఫెసర్ గా, ప్రిన్సిపాల్ గా (1980), ఫాకల్టీ ఆఫ్ మెడిసిన్ లో డీన్ గా (1982-83) పనిచేసారు. మానసిక వైద్య చికిత్సలో నూతన ప్రక్రియలను ఆవిష్కరించారు. ఎలక్ట్రిక్ ట్రీట్ మెంటును పూర్తిగా విమర్శించారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోషిప్ అందుకున్నారు. న్యూరాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు అధ్యక్షులుగా (1974) రాణించారు. వివిధ వైద్య సంబంధిత అసోసియేషన్లలో ఉన్నత పదవులు పొందారు.ఆయన 1983 లో ఉస్మానియా మెడికల్ కళాశాలలో పదవీవిరమణ చేశారు.[3]

ఆయన 81 శాస్త్ర వ్యాసాలను జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లలో ప్రచురించారు.

అవార్డులు

 1. ఫిజియాలజీలో డిస్టింక్షన్.
 2. పాథాలజీలో తాతాచారి గోల్డు మెడల్.
 3. బాక్టీరియాలజీలో డా.రామమూర్తి ప్రైజ్..
 4. అసాధారణ ప్రతిభకు గాను ఆంధ్రా మెడికల్ కాలేజీ సిల్వర్ జూబ్లీ ప్రైజ్.
 5. ఎడ్బెన్ మెమోరియల్ గోల్డ్ మెడల్, (ఎం.ఎస్.సర్జరీలో అసాధారణ ప్రతిభకు గానూ)
 6. 1999లో ఎ.పి అకాడమీ ఆఫ్ సైన్స్ వారి డిస్టిగ్విష్డ్ సైంటిస్టు అవార్డు.
 7. ఆంధ్రప్రదేశ్ లో న్యూరో సర్జరీ అభివృద్ధికి చేసిన కృషికి గాను డా.బి.సి.రాయ్ నేషనల్ అవార్డును 1989లో అందుకున్నారు.
 8. 16.12.2005 న ఆంధ్రా మెడికల్ కాలేజి, కింగ్ జార్జి హాస్పటల్ లోని న్యూరో సర్జరీ విభాగాల గోల్డెన్ జూబ్లీ వేడుకలలో లైఫ్ టైం అఛీవ్ మెంటు అవార్డు.
 9. 5.1.2006 న చెన్నై లోని ఇందియన్ స్ట్రోక్ అసోసియేషన్ యొక్క మొదటి జాతీయ కాన్ఫరెన్స్, రీజనల్ ఆసియన్ స్ట్రోక్ కాంగ్రెస్ వద్ద లైఫ్ టైం అఛీవ్ మెంటూ అవార్డు.
 10. విజయవాడలో 18.2.2009 న ఎన్.టి.ఆర్ విశ్వవ్య్దాలయంలో హానరరీ డాక్టరేట్.[4]

వ్యక్తిగత జీవితం

ఆయన శ్రీమతి సుంకర నాగరత్నాన్ని వివాహమాడాఅరు. వారికి ఎద్దరు పిల్లలు. కుమార్తె, కుమారుడు. ఆయన సోదరుడు సుంకర వెంకట ఆదినారాయణరావు కూడా ప్రముఖ నేత్ర వైద్యులు.

మూలాలు

 1. కృష్ణా/స్నాతకోత్సవం డీఎస్సీ అవార్డు
 2. సంతృప్తిగా బతకడం నేర్చుకోవాలి (11-Mar-2015)
 3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-10-25. Retrieved 2015-07-15.
 4. http://news.webindia123.com/news/articles/India/20080216/889275.html

ఇతర లింకులు