మామిడిపల్లి వీరభద్ర రావు

From tewiki
Jump to navigation Jump to search
సుత్తి వీరభద్ర రావు
Veerabadrarao.jpg
జన్మ నామంమామిడిపల్లి వీరభద్రరావు
జననం (1947-06-06)1947 జూన్ 6
భారతదేశం తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం జూన్ 30, 1988 1988 జూన్ 30(1988-06-30) (వయస్సు 41)
భారతదేశం మద్రాసు, భారతదేశం
ఇతర పేర్లు వీరభద్రుడు
భార్య/భర్త శేఖరి
పిల్లలు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి
ప్రముఖ పాత్రలు బాబాయ్ అబ్బాయ్

సుత్తి వీరభద్ర రావుగా ప్రసిద్ధిగాంచిన మామిడిపల్లి వీరభద్ర రావు (జూన్ 6, 1947 - జూన్ 30, 1988) తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో, నాటక కళాకారుడు.

బాల్యము

వీరభద్ర రావు తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు, ప్రథమ సంతానము. ఆయనకు ఇద్దరు చెల్లెళ్ళు. స్వస్థలం గోదావరి జిల్లా. తండ్రి ఉద్యోగ నిమిత్తం విజయవాడకు తరలి వెళ్ళాడు. విజయవాడలో ఉన్న ఎస్.ఆర్.ఆర్ అండ్ సి.వి.ఆర్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.

వృత్తి

చిన్నతనము నుంచి నాటక రంగము మీద వున్నా మక్కువతో, తండ్రి చూసిన ఉద్యోగావకాశాలను కాదనుకుని, నటుడిగా అటు నాటకాలలో, ఉద్యోగరీత్యా ఆకాశవాణిలో స్థిరపడ్డాడు. సరదాగా మిత్రుని దగ్గరకు వెళ్ళిన వీరభద్రరావుని మాదాల రంగారావు బలిపీఠం సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేయించారు. మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన జంధ్యాల దర్శకత్వములో వచ్చిన నాలుగు స్తంభాలాట చిత్రముతో చిత్రసీమలో స్థిరపడ్డాడు. 1988లో జంధ్యాల దర్శకత్వములో వచ్చిన చూపులు కలసిన శుభవేళ చిత్రము ఆఖరి చిత్రము.

రంగస్థలము

ఆకాశవాణి

ఆకాశవాణి నుండి ఎందరో కళాకారులు సినీ రంగానికి వెళ్ళి పేరు తెచ్చుకున్నారు. అలాంటివారిలో వీరభద్రరావు ఒకరు. ఆయకు ' సుత్తి ' పదం పేరులో భాగమైంది. సినీరంగంలో చేరి 50కి పైగా చిత్రాలలో నటించాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రొడక్షన్ అసిస్టెంట్ గా చేరి రెండు దశాబ్దాలు పనిచేసి 1980లో చిత్రపరిశ్రమలో చేరారు. 1988 జూన్ 30 న వీరభద్రరావు మదరాసులో కన్నుమూశారు. విజయవాడ కేంద్రంలో ఆయన నాటక విభాగములో చాలాకాలం పనిచేశారు.

చిత్రసీమ

ఇతడు నటించిన తెలుగు చిత్రాల పాక్షిక జాబితా:

 1. నాలుగు స్తంభాలాట (1982)
 2. మంత్రి గారి వియ్యంకుడు (1983)
 3. మూడు ముళ్ళు (1983)
 4. రెండుజెళ్ళ సీత (1983)
 5. ఆనంద భైరవి (1984)
 6. కాంచన గంగ (1984)
 7. మెరుపు దాడి (1984)
 8. శ్రీవారికి ప్రేమలేఖ (1984)
 9. పుత్తడి బొమ్మ (1985)
 10. స్వాతిముత్యం (1985)
 11. చంటబ్బాయి (1986)
 12. శాంతినివాసం (1986)
 13. అహ! నా పెళ్ళంట! (1987)
 14. రాక్షస సంహారం (1987)
 15. చిన్ని కృష్ణుడు (1988)
 16. చూపులు కలిసిన శుభవేళ (1988)
 17. వివాహ భోజనంబు (1988)

వ్యక్తిగత విషయములు

మరణము

1988లో చూపులు కలసిన శుభవేళ చిత్రానికి హైదరాబాదు లోఒక పాటని చిత్రీకరిస్తున్నప్పుడు కాలు బెణికింది. మధుమేహముతో ఉన్న వీరభద్రరావు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించగా, చిత్రీకరణ పూర్తి అవ్వగానే విశ్రాంతి కోసము చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరాడు. ఒక రాత్రి నిద్రకోసం ఇచ్చిన ఇంజక్షను వికటించి గుండెపోటు వచ్చింది. అవే ఆయన ఆఖరి క్షణాలు. అది 1988, జూన్ 30 తెల్లవారుఝామున జరిగింది.

బయటి లింకులు