"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

యార్లగడ్డ సుమంత్ కుమార్

From tewiki
(Redirected from సుమంత్)
Jump to navigation Jump to search
సుమంత్ కుమార్ యార్లగడ్డ
జననం
సుమంత్ కుమార్

(1975-02-09) ఫిభ్రవరి 9, 1975 (వయస్సు 46)
వృత్తిసినిమా నటుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1999-ప్రస్తుతం
తల్లిదండ్రులుసత్యవతి, యార్లగడ్డ సురేంద్ర

సుమంత్ గా ప్రసిద్ధిచెందిన సుమంత్ కుమార్ తెలుగు సినిమా నటుడు/నిర్మాత. ఇతడు అక్కినేని నాగేశ్వరరావు మనుమడు; అనగా అక్కినేని పెద్దకూతురు సత్యవతి, అల్లుడు యార్లగడ్డ సురేంద్ర దంపతుల కుమారుడు.

చదువు

సుమంత్ హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చదివిన తర్వాత అమెరికా వెళ్ళి మిచిగన్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కోర్సులో చేరాడు. అయితే అది నచ్చక చికాగో లో కొలంబియా కాలేజీ లో ఫిల్మ్ కోర్సులో చేరి డిగ్రీ సంపాదించాడు.

సినీ జీవితం

సుమంత్ నట జీవితం 1999 సంవత్సరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమ కథ చిత్రంతో మొదలైంది. ఇదీ, అతని రెండవ చిత్రం, యువకుడు పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇతను తర్వాత నటించిన సినిమాలు అంతగా ఆడలేదు. అయితే 2003 లో జెనీలియా తో నటించిన సత్యం తో చిత్రసీమలో స్థిరపడ్డాడు. ఆ తర్వాత గౌరి కూడా విజయం సాధించి అతనికి మాస్ ఇమేజ్ ఇచ్చింది. మళ్ళీ కొన్ని విఫలాలు తర్వాత, 2006 సంవత్సరం లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గోదావరి సినిమాతో ఉన్నత స్థానానికి చేరాడు. తర్వాత విడుదలైన చిన్నోడు అంతగా హిట్ కాలేదు. మధుమాసం, పౌరుడు బాక్సాఫీస్ లో బాగానే ఆడి, కొన్ని సెంటర్స్ లో 100 రోజులు కూడా నడిచాయి. 2009 లో వచ్చిన బోణి ప్లాప్ అయ్యింది. 2011 లో గోల్కొండ హై స్కూల్ హిట్ ఐయ్యి సుమంత్ కి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత కొన్ని వరస విఫలాలు తర్వాత 2017 లో మళ్ళీ రావా అతని కెరీర్ కి మళ్ళీ ఊపిరి ఇచ్చింది. ఈ మధ్య ఎన్.టీ.ఆర్:కథానాయకుడు లో అతని తాత అక్కినేని పాత్ర పోషించి పలు ప్రశంసలు పొందాడు.

వ్యక్తిగత జీవితం

అక్కినేని సుమంత్ ని పసి వయస్సులోనే దత్థతు తీసుకున్నారు. సుమంత్ 2004 సంవత్సరంలో కీర్తి రెడ్డి ని వివాహం చేసుకొని, 2006 లో విడాకులు తీసుకున్నాడు.

నటించిన చిత్రాలు

అక్కినేని వంశ వృక్షం

మూలాలు

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).