"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సుల్తాన్ నగరం గొల్లపాలెం

From tewiki
Jump to navigation Jump to search
సుల్తాన్ నగరం గొల్లపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ మట్టా మోహన నాంచారయ్య
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషులు 3,049
 - స్త్రీలు 2,956
 - గృహాల సంఖ్య 1,862
పిన్ కోడ్ 521001
ఎస్.టి.డి కోడ్ 08672.

సుల్తాన్ నగరం గొల్లపాలెం (S.N.Gollapalem), కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 001., ఎస్.ట్.డి.కోడ్ = 08672.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

మచిలీపట్నం, మొగలులు, గోల్కొండ సుల్తానుల పరిపాలనలో ఉండగా, ఒకసారి మొగలుల కాబోయే చక్రవర్తి షాజహాను మచిలీపట్నం విచ్చేసారు. ఆ సమయంలో ఆయన (సుల్తాన్) గూడూరు రహదారిలోని గొల్లపాలెంలో విడిదిచేయగా, గొల్లపాలెం గ్రామంలో సుల్తానుగారి పరివారం కొరకు వేసిన గుడారాలతో, ఆ గ్రామం ఒక నగరంగా రూపుదిద్దుకున్నది. అప్పటినుండి ఆ గ్రామం, సుల్తాన్ నగరం గొల్లపాలెం గా పేరుపడిందని చరిత్రకారుల అభిప్రాయం. ఆ సమయంలోనే సుల్తాన్, తన మలైకా (రాణి) విడిది కోసం, నేటి మచిలీపట్నం రైల్వే స్టేషన్ సమీప ంలో గొప్ప గుడారాలు వేయించాడు. మలైకా విడిది ప్రాంతమే తదనంతరం మలకాపట్నం గా రూపాంతరం చెందిందని చరిత్రకారుల కథనం. బందరుకోటలోని సెయింట్ జాన్స్ యార్డులో రెండు అర్మేనియన్ సమాధులమీద, మలక్కా పట్నం అని వ్రాసి ఉన్నదని చరిత్రకారులు పేర్కొన్నారు. బహుశ వారు మలక్కాపట్నంలో నివసించి ఉంటారనేది ఒక కథనం.[1]

గ్రామ భౌగోళికం

[2] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు

పెడన, ఘంటసాల, గూడూరు, గుడ్లవల్లేరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

పెడన, మచిలీపట్నం, నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: మచిలీపట్నం, విజయవాడ 74 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల

ఈ పాఠశాలలో 2014-15 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివిన ఎస్.రవికిరణ్ అను విద్యార్థి, బాపులపాడు మండలంలోని వేలేరు గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరవ తరగతిలోనికి నిర్వహించిన ప్రవేశపరీక్షలో ఉత్తీరుడై, అక్కడ సీటు సాధించాడు. ఈ విద్యార్థి ఇంటర్మీడియట్ వరకు అక్కడ ఉచితంగా విద్యనభ్యసించగలడు.[3] ఈ పాఠశాలలో 5వ తరగతి చదువుచున్న వేముల రామగణేష్ అను విద్యార్థి, 2017-18 సంవత్సరంలో జవహర్ నవోదయ పాఠశాలలో ఆరవ తరగతి చదువుటకు ఎంపికైనాడు.[4]

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ మట్టా మోహన నాంచారయ్య, సర్పంచిగా ఎన్నికైనారు.[5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం

శ్రీ కొనకళ్ళవారి ఆంకాలమ్మ ఆలయం

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం, ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో, శుక్లపక్షంలో, మొదటి శుక్ర, శని, ఆదివారాలలలో మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా, మొదటిరోజున ఉదయం పావనిపూజ, రెండవరోజున పోతురాజు గెడ, అమ్మవారిపూజ, మూడవ రోజున అమ్మవారి జాతర (మొక్కుబడులు) మొదలగు కార్యక్రమములు నిర్వహించెదరు.[6]

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం

గ్రామంలోని ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.[7]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 6,005 - పురుషుల సంఖ్య 3,049 - స్త్రీల సంఖ్య 2,956 - గృహాల సంఖ్య 1,862

మూలాలు

  1. ఈనాడు కృష్ణా; 2016,జనవరి-22; 4వపేజీ.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Machilipatnam/Sulthanagaram". Retrieved 28 June 2016. External link in |title= (help)[permanent dead link]
  3. ఈనాడు కృష్ణా; 2015,జూన్-26; 4వపేజీ.
  4. ఈనాడు కృష్ణా; 2017,జూన్-25; 6వపేజీ.
  5. ఈనాడు కృష్ణా; 2014,అక్టోబరు-31; 4వపేజీ.
  6. ఈనాడు కృష్ణా; 2016,మే-12; 5వపేజీ.
  7. ఈనాడు కృష్ణా; 2016,జూన్-4; 6వపేజీ.

వెలుపలి లింకులు