"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సూరత్ లోకసభ నియోజకవర్గం

From tewiki
Jump to navigation Jump to search

సూరత్ గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. ఇప్పటివరకు ఇక్కడ 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా భారతీయ జనతా పార్టీ 7 సార్లు, కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, జనతా పార్టీ, కాంగ్రెస్ (ఓ) చెరోసారి విజయం సాధించాయి. పూర్వ ప్రధానమంత్రి మురార్జీ దేశాయ్ ఈ నియోజకవర్గం నుంచి వరసగా 5 సార్లు విజయం సాధించాడు. భాజపాకు చెందిన కాశీరాం రాణా వరసగా 6 సార్లు విజయం సాధించి డబుల్ హాట్రిక్ సృష్టించారు.

అసెంబ్లీ సెగ్మెంట్లు

  • ఓల్పాడ్.
  • సూరత్ (తూర్పు).
  • సూరత్ (ఉత్తర).
  • సూరత్ (పశ్చిమ).
  • వరచ్ఛా రోడ్.
  • కరంజ్.
  • కాటర్గాం.

గెలుపొందిన లోకసభ సభ్యులు

ఇప్పటివరకు ఈ లోకసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సభ్యులు, వారి పార్టీల వివరాలు:[1]

  • 1951: నానాభాయి దేశాయి (కాంగ్రెస్ పార్టీ)
  • 1957: మురార్జీ దేశాయి (కాంగ్రెస్ పార్టీ).
  • 1962: మురార్జీ దేశాయి (కాంగ్రెస్ పార్టీ).
  • 1967: మురార్జీ దేశాయి (కాంగ్రెస్ పార్టీ).
  • 1971: మురార్జీ దేశాయి (కాంగ్రెస్ పార్టీ (ఓ))
  • 1977: మురార్జీ దేశాయి (జనతాపార్టీ).
  • 1980: సి.డి.పటేల్ (కాంగ్రెస్ పార్టీ).
  • 1984: సి.డి.పటేల్ (కాంగ్రెస్ పార్టీ).
  • 1989: కాశీరాం రాణా (భారతీయ జనతా పార్టీ)
  • 1991: కాశీరాం రాణా (భారతీయ జనతా పార్టీ)
  • 1996: కాశీరాం రాణా (భారతీయ జనతా పార్టీ)
  • 1998: కాశీరాం రాణా (భారతీయ జనతా పార్టీ)
  • 1999: కాశీరాం రాణా (భారతీయ జనతా పార్టీ)
  • 2004: కాశీరాం రాణా (భారతీయ జనతా పార్టీ)
  • 2009: దర్శన జర్దోశ్ (భారతీయ జనతా పార్టీ)

మూలాలు

  1. "Parliament Constituency wise Electors Detail, Polling Stations & EPIC - Loksabha Election 2009" (PDF). Chief Electoral Officer, Gujarat website. Archived from the original (PDF) on 2009-04-16. Retrieved 2011-09-20.

ఇవి కూడా చూడండి