"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సూర్యాపేట

From tewiki
Jump to navigation Jump to search

సూర్యాపేట, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలానికి చెందిన పట్టణం, సూర్యాపేట జిల్లా యొక్క ప్రధాన కేంద్రం.[1]

సూర్యాపేట పట్టణం విహంగ వీక్షణ చిత్రం

ఒకప్పుడు ఈ పట్టణం భానుపురి అని కూడా పిలవబడింది.ఇది తరువాతి క్రమంలో సూర్యాపేటగా మారింది. భారత ప్రభుత్వ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి 'స్వచ్ఛ్ సర్వేక్షణ్ 2017' లో సూర్యాపేట దక్షిణ భారతదేశపు అత్యంత శుభ్రమైన నగరంగా గుర్తింపు తెచ్చుకుంది. సూర్యాపేటకు చాలా చారిత్రక విషయాలతో అనుబంధం ఉంది. సాహితీపరంగా సూర్యాపేటకు రాష్ట్రంలో విశేష గుర్తింపు ఉంది.ఒకనాటి చుట్టుముట్టు సూర్యాపేట, నట్టనడుమ నల్లగొండ భానుపురికి సినీ సాహితీరంగంతో విడదీయరాని అనుబంధం ఉంది. 1928లో సూర్యపేటలో నైజాం రాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ సభ వామన నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.[2]ఈ పట్టణం తెలంగాణ ముఖద్వారం అని కూడా చెప్పుకోవచ్చు. సూర్యాపేట తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి 134 కి. మీ. (83 మై.) దూరంలో, విజయవాడ కి 138 కి. మీ. (86 మై.) దూరంలో ఉంది.

భాషలు

దస్త్రం:AP town Suryapeta 3.JPG
సూర్యాపేట బస్ స్టాండ్

తెలుగు, కోయ భాషలు ఇక్కడ ప్రాంతీయ భాషలు.

తపాలా సౌకర్యం

సూర్యాపేటకు స్పీడు పోష్టు సౌకర్యంతో కూడిన తపాలా కార్యాలయం ఉంది.

గ్రామ జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ పరిధిలోని జనాభా - మొత్తం 1,55,422 - సాంద్రత 40/km 2 (103.6/sq mi) - పురుషులు 77,072 - స్త్రీలు 98,359

ప్రముఖులు

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "నైజాము రాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ సభ".[permanent dead link]

ఇవి కూడా చూడండి

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

బయటి లింకులు