సౌభాగ్య

From tewiki
Jump to navigation Jump to search
సౌభాగ్య
జననంపి.విజయకుమార్
1954, నవంబర్ 25
చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల గ్రామం
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధితెలుగు కవి, సాహితీ విమర్శకుడు, అనువాదకుడు

ప్రముఖ కవి, విమర్శకుడు, అనువాదకుడు ఐన సౌభాగ్య అసలు పేరు పి.విజయకుమార్.

జీవితవిశేషాలు

1954 నవంబర్ 25న చిత్తూరు జిల్లా రొంపిచర్లలో పుట్టిన సౌభాగ్య అసలు పేరు పి.విజయకుమార్. రొంపిచర్ల, తిరుపతిలలో ఉన్నత పాఠశాల విద్య, విద్వాన్, తెలుగు ఎం.ఎ. చదివాడు. హైదరాబాద్ గ్రామర్ స్కూల్లో తెలుగు అధ్యాపకుడిగా 28 ఏళ్లు పనిచేసి పదవీ విరమణ చేశాడు.1984లో వెలువరించిన తొలి వచన కవితాసంపుటి 'సంధ్యాబీభత్సం' ప్రతిష్ఠాత్మక ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలను అందుకుంది. రెండవ కవితాసంపుటి 'కృత్యాద్యవస్థ'కు మొట్టమొదటి ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు లభించింది.

రచనలు[1]

 1. సంధ్యాబీభత్సం (కవిత్వం)
 2. కృత్యాద్యవస్థ (కవిత్వం)
 3. సింహావలోకనం (కవిత్వం)
 4. పునరుత్థానం (కవిత్వం)
 5. ప్రేమకవితలు (కవిత్వం)
 6. రెండు దశాబ్దాలు (కవిత్వం)
 7. సౌభాగ్యకవిత (కవిత్వం)
 8. ఆధునిక ప్రపంచకవులు (పరిచయ వ్యాసాలు)
 9. బహుత్ ఖూబ్ యాకూబ్ (వ్యాస సంకలనం)
 10. ధ్యానరహస్యాలు
 11. ఈ కాలం కవులు (విమర్శ)
 12. గ్రీకు - రోమన్ కథలు
 13. కథాకాసారం
 14. ఆస్కార్ వైల్డ్ ఆలోచనలు
 15. సమకాలీన ప్రపంచకవులు
 16. శిఖామణి కవిత్వం - తాత్విక సౌందర్యం
 17. తావో తరంగాలు
 18. వ్యాసాలు ద్వేషాలు
 19. సాహిత్యవ్యాసాలు-సమీక్షలు
 20. వజ్రశకలాలు
 21. జాన్‌కీట్స్
 22. ప్రాపర్టియస్ కవిత
 23. జెన్ కథలు మొదలైనవి

మూలాలు