"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

స్టుడియో

From tewiki
Jump to navigation Jump to search
Adriaen van Ostade. Selfportrait. 1663. Gemäldegalerie.

స్టుడియో (ఆంగ్లం: studio) అనేది ఒక చిత్రకారుడు లేదా అతని వద్దనుండే ఉద్యోగులు పనిచేసుకొనే గది. ఇది చిత్రలేఖనం, శిల్పకళ, సినిమా నిర్మాణం, రేడియో లేదా టెలివిజన్ సంగీతానికి సంబంధించినదిగా ఉంటుంది.

స్టుడియో అనే పదం ఇటాలియన్ studio, లాటిన్ studere నుండి పుట్టింది. దీని అర్ధం స్టడీ అనగా చదవడం.

ఆర్ట్ స్టుడియో

సుప్రసిద్ధ చిత్రకారుల స్టుడియోలో, ముఖ్యంగా 15 నుండి 19 శతాబ్దాల కాలం నాటివి, చిత్రకారుని సహాయకులు చిత్రపటాలను అభివృద్ధి చేసే ప్రదేశంగా నిర్దేశిస్తారు.

ఫోటోగ్రాఫిక్ స్టుడియో

ఫోటోగ్రాఫిక్ స్టుడియో లో ఫోటోగ్రాఫర్లు చిత్రాలను తీయడానికి, అభివృద్ధి, లేదా ముద్రించడానికి అవసరమైన సరంజామా కలిగివుంటుంది.

రేడియో స్టుడియో

రేడియో స్టుడియో అనగా రేడియో ప్రోగ్రాములను నిర్మించే గది. ఇవి లైవ్ బ్రాడ్ కాస్టింగ్ కోసం గాని లేదా రికార్డింగ్ చేసి తర్వాత కాలంలో ప్రసారం చేయడం కోసం ఉపయోగిస్తారు. ఈ గదులు సౌండ్ ప్రూఫింగ్ చేయబడి బయటినుండి అనవసరమైన శబ్దాల్ని లోపలకు రానీయకుండా పూర్తి నిశ్శబ్దంగా ఉంటాయి.

సినిమా స్టుడియా

సినిమా స్టుడియో (movie studio) సినిమాల నిర్మాణానికి కావలసిన పరికరాలు, పరిస్థితులను కల్పించే సంస్థ. వీనిలో ఇంటీరియర్, ఎక్స్టీరియర్ లేదా రెండూ ఉంటాయి.

ప్రముఖ స్టుడియోలు