స్వాగతము!

From tewiki
Jump to navigation Jump to search

వికీపీడియా అనేది పాఠకులే సామూహికంగా రాస్తున్న ఒక విజ్ఞాన సర్వస్వము. ఈ సైటు ఒక వికీ.. అంటే, ఎవరైనా - మీతో సహా - ఏ వ్యాసాన్నయినా మార్చవచ్చు అని. కానీ, అది చెయ్యబోయే ముందు ఈ వ్యాసాన్ని చదవండి.

స్వాగతం

నా పేరు పులి తిర్మల్ నేను తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా వాసిని నాకు తెలుగులో పుస్తకాలు చదవడం ఇంకా కవితలు వ్రాయడం కథలు వ్రాయడం ఇష్టం నేను కూడా వ్యాసం వ్రాయడం ఇంకా తెలుగులో ఎన్నో విషయాలను తెలియపర్చడానికి నాకు ఒక అద్భుతమైన అవకాశం tewikki వారు కల్పించిన ఒక గొప్ప సువర్ణావకాశం గా నేను భావిస్తున్నాను ధన్యవాదాలు.

వికీపీడీయాను చదవడం

వికీపీడియా అనేక రకాల విషయాల గురించిన సమాచార సంగ్రహం. భారత దేశము, ఆంధ్ర ప్రదేశ్, చరిత్ర, క్రీడలు మొదలైన ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ అంశాలను చూడండి.

భారత దేశము  ·   ఆంధ్రప్రదేశ్  ·   తెలంగాణ  ·   సంస్కృతి  ·   భౌగోళికము  ·   చరిత్ర  ·   ప్రజలు  ·   విజ్ఞానము  ·   సమాజం  ·   సాంకేతికం


వ్యాసాలలో మీకు కావల్సిన సమాచారం కొరకు వెదకవచ్చు. ఎడమ పక్కన గల "అన్వేషణ" లో మీకు కావలసిన పదం రాసి "వెతుకు" మీట నొక్కండి. ఒక్కోసారి సర్వర్లు పని వత్తిడిలో ఉన్నపుడు అన్వేషణ పని చెయ్యక పోవచ్చు; అప్పుడు మీ అభ్యర్థన గూగుల్- ఆధారిత అన్వేషణకు వెళుతుంది. ఇంకా ఇతర విధాల ద్వారా వికీపీడియాలో అన్వేషణ చెయ్యవచ్చు.

మీరు చదివిన వ్యాసం మీకు నచ్చితే, చర్చా పేజీ లో మీ సందేశం రాయవచ్చు. పేజీ కి పైనున్న చర్చ లింకును నొక్కి, ఈ పేజీలోకి వెళ్ళవచ్చు. తరువాత ఆ పేజీ లోని మార్చు అనే లింకును గానీ, ఆ లింకుకు పక్కనే గల + ను గాని నొక్కి మీ అభిప్రాయం రాయవచ్చు. ప్రయోజనకరమైన అభిప్రాయాల్ని మేము ఆహ్వానిస్తాం.

మీకు కావలసినది ఇక్కడ లేకున్నా, లేదా అదెక్కడుందో మీకు కనపడకున్నా, సంప్రదించు కేంద్రం వద్ద అడగండి, లేదా ఆ విషయాన్ని అభ్యర్ధించిన వ్యాసాలులో రాయండి. వికీపీడియా శోధనకు ఇతర మార్గాలు చూడండి లేదా... మీరే ఒక వ్యాసం రాయండి.

దిద్దుబాట్లు

వికీపీడియా లో పేజీలను ఎవరైనా సరిదిద్దవచ్చు — ఈ పేజీ తో సహా! పేజీ లోని సమాచారాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉందని మీరు భావిస్తే, పేజీకి పైనున్న మార్చు అనే లింకును నొక్కి (సంరక్షించిన పేజీలు తప్ప) సరిదిద్దవచ్చు. దీని కోసం ప్రత్యేకించి ఏమీ అవసరం లేదు; మీరు లాగిన్‌ అయి ఉండవలసిన అవసరము కూడా లేదు. ఇదెలా పని చేస్తుందో (పేజీని చెడగొట్టకుండా) చూద్దామనుకుంటే, ప్రయోగశాల లో తనివితీరా ప్రయోగాలు చెయ్యండి. నిజమైన పేజీలను (ఈ పేజీ వంటివి) సరిదిద్దాలనుకుంటే, వ్యాసాన్ని పూర్తిగా కాపీ చేసి, ప్రయోగశాలలో పెట్టుకుని సరిదిద్దండి. ఇంకా తెలుసుకోవాలంటే, వికీపీడియా పాఠం చూడండి.

ఇదంతా చూస్తే ముందు బెరుకుగా ఉండవచ్చు, కానీ వికీపీడియా వ్యవస్థ ఈవిధంగా పని చేస్తూ విజయవంతం అవడానికి కారణాలు సాధారణ అభ్యంతరాలకు సమాధానాలు లో చూడండి.

విధానాలు

మీరు గమనించవలసిన కొన్ని విధానాలు, మార్గదర్శకాలు ఉన్నాయి. మూడు అతి ముఖ్యమైన సూత్రాలేమిటంటే - NPOV, GFDL, మరియు మర్యాద. వీటికి అర్ధం ఏమిటి?

  • NPOV, లేదా తటస్థ దృక్కోణం అంటే వ్యాసాలు పక్షపాతయుతంగా ఉండకూడదు, విషయంపై ఉన్న విభిన్న దృక్కోణాల్ని సమగ్రంగా ప్రతిబింబించాలి.
  • అన్ని రచనలూ GNU ఫ్రీ డాక్యుమేంటేషన్‌ లైసెన్సు (GFDL) కు లోబడి ఉండాలి. వికీపీడియా ఎప్పటికీ ఉచితంగానే ఉండేలా చూసే ఏర్పాటిది. కాపీ హక్కులు గల వ్యాసాన్ని అనుమతి లేకుండా దయచేసి వికీపీడియాలో సమర్పించకండి. (మరింత సమాచారానికై కాపీహక్కులు చూడండి).
  • మర్యాద. వికీపీడియా ఒక సామూహిక కార్యం, కాబట్టి పరస్పర గౌరవం, మర్యాద, మరియు వికీప్రేమ తప్పనిసరిగా ఉండాలి. ఎవరితోనైనా విభేదించినపుడు సకారణంగా చెయ్యండి, సంయమనంగా ఉండండి, మర్యాదగా వ్యవహరించండి. మార్పులు చేర్పులు చేసినపుడు చిన్న సారాంశం జత చేస్తే మీ మార్పుల ఆవశ్యకతను ఇతరులు గుర్తించి, అంగీకరించడానికి సహాయపడుతుంది. మీరు చేసిన మార్పుచేర్పులను వేరొకరు మార్చినట్లో, తీసివేసినట్లో మీరు గమనిస్తే, వాటిని తిరిగి మార్చే ముందు కాస్త నిదానించండి. పేజీ చరితంలో గానీ, మీ చర్చా పేజీలో గాని, వ్యాసపు చర్చా పేజీలో గాని చర్చించండి. ఇంకావికీ సాంప్రదాయం చూడండి.

నిరుత్సాహపడకండి

మీరు మార్పుచేర్పులు మొదలు పెట్టీ పెట్టగానే అభిప్రాయ భేదాలు తలెత్తితే, నిరుత్సాహ పడకండి. సామూహికంగా చేసే ఏ పనిలోనైనా ఘర్షణలు తప్పవు. సభ్యుల సంవాద నియమాలు చూడండి. వాటిని ఉపయోగించుకొని సమస్యల పరిష్కారానికి మార్గాలు తెలుసుకోండి.

మీకు అర్ధం కానిది ఏమైనా ఉంటే — సాంకేతికమైనా, సామాజికమైనా — దాని కొరకు ఎక్కడ వెతకాలో తెలియకపోతే, వికీపీడియా:సహాయ కేంద్రం లో ప్రశ్నించండి, మీకు సహాయం దొరుకుతుంది.

వికీపీడియాను ఆస్వాదించండి!

సభ్యత్వం కావాలా?

ఎవరైనా వ్యాసాలు రాయవచ్చు, దిద్దవచ్చు. కానీ, మీరు క్రమం తప్పకుండా రాయాలనుకుంటే, సభ్యుడిగా చేరడం వలన ఉపయోగాలు ఉన్నాయి. చేరడానికి, అకౌంటు సృష్టించి,, తరువాత కొత్త సభ్యుల పట్టిక లో రాస్తే చాలు.

నేను ప్రారంభించిన వ్యాసం ఎందుకు తొలగించబడింది?

మీరు కొత్త వ్యాసం తో ప్రయోగం చేసి వుండవచ్చు. ఇంగ్లీషు పదాల శీర్షిక, అశ్లీల పదాల, వ్యక్తిగత వివరాలు లాంటివి రాసివుండవచ్చు. మీరు వికీపీడియా గురించి ఇంకొంచెం తెలుసుకోండి. ప్రయోగశాల వాడండి. సభ్యుడవ్వండి. సహాయం కోరండి. ఇప్పటికే వున్న వ్యాసాలను మెరుగు పరచటం చేయడం ద్వారా వికీలో పని చేయటం నేర్చుకోండి.

ఇంకా చూడండి

సాధారణ సమాచారం, మార్గదర్శకాలు, సహాయం

వికీసివిక్స్‌

పాఠాల విభాగం

లోతైన విచారణల శాఖ

వికీపీడియా సముదాయం

ar:ويكيبيديا:ترحيب بالقادمين الجدد bs:Wikipedia:Dobrodošli ca:Viquipèdia:Benvinguts a la Viquipèdia ceb:Wikipedya:Maayong pag-abot, higala! cs:Wikipedie:Vítejte ve Wikipedii da:Wikipedia:Velkommen nybegynder de:Wikipedia:Willkommen eo:Vikipedio:Bonvenon al la Vikipedio es:Wikipedia:Bienvenidos fa:ویکی‌پدیا:تازه‌واردان، خوش آمدید fr:Wikipédia:Bienvenue ga:Vicipéid:Fáilte, a núíosaigh he:ויקיפדיה:ברוכים הבאים hi:विकिपीडिया:स्वागत, नये आनेवालों hu:Wikipédia:Üdvözlünk_látogató ja:Wikipedia:新規参加者の方、ようこそ lb:Wikipedia:Wëllkomm li:Wikipedia:Wèlkóm lt:Wikipedia:Įžanga naujokams ms:Wikipedia:Selamat_Datang nl:Wikipedia:Welkom voor nieuwelingen no:Wikipedia:Velkommen til Wikipedia pt:Wikipedia:Boas-vindas ro:Wikipedia:Bun venit sk:Wikipédia:Vitajte_vo_Wikipédií sl:Wikipedija:Dobrodošli, novinci sr:Википедија:Добродошли su:Wikipédia:Wilujeng sumping sv:Wikipedia:Välkommen vi:Wikipedia:Chào mừng người mới đến ur:خوش_آمديد zh-cn:Wikipedia:欢迎,新来者 zh-tw:Wikipedia:歡迎,新來者 బొద్దు పాఠ్యం