హనుమాన్ చాలీసా

From tewiki
Jump to navigation Jump to search
హనుమాన్ చాలీసా
సమాచారం
మతంహిందూ
రచయితతులసీదాసు
భాషహిందీ మాండలికం అవధి
పద్యాలు40


హనుమాన్ చాలీసా (దేవనాగరి: हनुमान चालीसा; సాహిత్యపరంగా హనుమంతుని యొక్క నలుబది శ్లోకములు)"Hanuman Chalisa by Gita Press" (PDF). Gita Press. Archived from the original (PDF) on 2012-11-19.. ఇది రాముని ప్రసిద్ధ భక్తుడైన తులసీదాసు అవధి భాషలో వ్రాసినదని నమ్మబడుతోంది. తులసీదాసు యొక్క ప్రసిద్ధ రచన రామచరితమానస "చాలీసా" అనే పదం "చాలీస్" అనే పదం నుండి వ్యుత్పత్తి అయినది. దీని అర్థం హిందీ భాషలో నలభై అని. అనగా హనూమన్ చాలీసాలో నలభై శ్లోకములు ద్విపదులుగా ఉంటాయి.

రచనా నేపథ్యం

ఎక్కువగా వాడబడే తులసీదాసు చిత్రం

తులసీదాసు తీర్థాటన చేస్తూ పండరీపురం చేరి, అక్కడ కొంతకాలం నివసించాడు. ఒక రోజున తన నిత్యకృత్యాల్లో భాగంగా 'చంద్రభాగా' నదిలో స్నానం చేసి, విఠలనాథుని ధ్యానిస్తూ నదీ తీరాన కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో ఒక అంధుడు ఇంట్లో తగాదాపడి, నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామని అక్కడికొచ్చాడు. ధ్యానంలో ఉన్న తులసీదాసును ఆ అంధుడి పాదాలు తగిలాయి. అతడు పడిపోయాడు. తులసి వెంటనే ఆ అంధుణ్ని పైకిలేపి, ఆలింగనం చేసుకుని 'క్షమించు నాయనా! నీ కృపాదృష్టిని నాపైన ప్రసరింపజెయ్యి... ఇటు చూడు' అన్నాడు. అంతే... అంధుడికి చూపు వచ్చింది. పరమానందంతో తులసీదాసు పాదాలపైనపడి "స్వామీ! మీరు నా పాలిట సాక్షాత్తు పాండురంగస్వామే. నాకు దృష్టిని ప్రసాదించారు. మరో జన్మకు నన్ను అర్హుణ్ని చేశారు. ఈ పునర్జన్మను ఆధ్యాత్మిక సేవతో సద్వినియోగం చేసుకుంటాను" అని అన్నాడు. దానికి తులసీదాసు "నాయనా. ఇది నా మహిమ కాదు. నేను సామాన్యుణ్ని. విఠల ప్రభువు అనుగ్రహ ప్రాప్తి కలిగింది నీకు. అది దివ్యదృష్టి. నీ శేష జీవితాన్ని దైవచింతనతో ధన్యం చేసుకో!" అని చెప్పాడు. ఈ విషయం ఆ కాలంలో భారతదేశాన్ని పాలిస్తున్న అక్బరు పాదుషాకు తెలిసింది. తన కొలువుకు రావాల్సిందిగా ఆహ్వానించాడు. కొన్ని మహిమలు చూపి పారితోషకాలను స్వీకరించవలసినదిగా ఆయనను కోరాడు. దానికి తులసీదాసు తనవద్ద మహిమలు లేవనీ, నిమిత్తమాత్రుడననీ తెలియజేశాడు. ఏవైనా మహిమలు జరిగితే అవి శ్రీరామ చంద్రుని లీలలేనని తెలియజేసాడు. దానికి అక్బరుకు ఆగ్రహం కలిగింది. తన ఆజ్ఞను ధిక్కరించినందుకు భటుల్ని పిలిచి తులసీదాసును కొరడాలతో కొట్టవలసిందిగా ఆదేశించాడు. తులసి రెండు చేతులు జోడించి రామనామ స్మరణం చేశాడు. భటుల చేతుల్లోని కొరడాలు లేచినవి లేచినట్లే ఉండిపోయాయి. అక్బరుతో సహా భటులను భయంకరమైన చూపులతో, అరుపులతో అసంఖ్యాకమైన కోతులు బెదిరించసాగాయి. అంతా నిలువునా కంపించిపోసాగారు. చుట్టూ చేరిన కోతులు వాళ్లను అడుగైనా కదలనివ్వడం లేదు. అక్బరు దిగ్భ్రాంతి చెంది దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు. తన పొరపాటు తెలుసుకున్నాడు. తులసీదాసు పాదాల మీద పడిపోయి కన్నీరు, మున్నీరుగా విలపించసాగాడు. తులసికేమీ అర్థం కాలేదు. కారణమడిగితే తన దయనీయస్థితిని వివరించాడు అక్బరు. తనకే కోతులు కనిపించడం లేదే. భక్తి ప్రపత్తులతో హనుమను ప్రార్థించాడు- 'స్వామీ! నాపైన ఎందుకింత నిర్దయ? వీరందరికీ దర్శనమిచ్చి కరుణించావు కదా, నాకెందుకా సౌభాగ్యం ప్రసాదించవు? నేను చేసిన అపరాధం ఏదైనా ఉంటే క్షమించు' అంటూ దుఃఖ బాష్పధారలు స్రవిస్తూంటే, ఎలుగెత్తి వాయునందనుణ్ని అనేక విధాల స్తుతిచేశాడు. ఆంజనేయుని దర్శనమొంది పరమానందభరితమైనాడు. అదే హనుమాన్‌ చాలీసాగా జగత్ప్రసిద్ధి పొందింది.

హనుమాన్ చాలీసా

దోహా: శ్రీగురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి | బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవనకుమార బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార |

చౌపాయీ: జయ హనుమాన జ్ఞానగుణసాగర జయ కపీశ తిహుం లోక ఉజాగర | 1

రామదూత అతులితబలధామా అంజనిపుత్ర పవనసుత నామా | 2

మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతి కే సంగీ | 3

కంచనవరన విరాజ సువేసా కానన కుండల కుంచిత కేశా | 4

హాథ వజ్ర అరు ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవూ సాజై | 5

శంకరసువన కేసరీనందన తేజ ప్రతాప మహాజగవందన | 6

విద్యావాన గుణీ అతిచాతుర రామ కాజ కరివే కో ఆతుర | 7

ప్రభు చరిత్ర సునివే కో రసియా రామ లఖన సీతా మన బసియా | 8

సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా వికట రూప ధరి లంక జరావా | 9

భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సంవారే | 10

లాయ సంజీవన లఖన జియాయే శ్రీరఘువీర హరషి ఉర లాయే | 11

రఘుపతి కీన్హీ బహుత బడాయీ కహా భరత సమ తుమ ప్రియ భాయీ | 12

సహస వదన తుమ్హరో యస గావైం అస కహి శ్రీపతి కంఠ లగావై | 13

సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా | 14

యమ కుబేర దిగపాల జహాం తే కవి కోవిద కహి సకే కహాం తే | 15

తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా రామ మిలాయ రాజపద దీన్హా | 16

తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయే సబ జగ జానా | 17

యుగ సహస్ర యోజన పర భానూ లీల్యో తాహి మధుర ఫల జానూ | 18

ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ జలధి లాంఘి గయే అచరజ నాహీం | 19

దుర్గమ కాజ జగత కే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | 20

రామ ద్వారే తుమ రఖవారే హోత న ఆజ్ఞా బిను పైసారే | 21

సబ సుఖ లహై తుమ్హారీ శరణా తుమ రక్షక కాహూ కో డరనా | 22

ఆపన తేజ సంహారో ఆపై తీనోం లోక హాంక తేం కాంపై | 23

భూత పిశాచ నికట నహిం ఆవై మహావీర జబ నామ సునావై | 24

నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా | 25

సంకటసే హనుమాన ఛుడావై మన క్రమ వచన ధ్యాన జో లావై | 26

సబ పర రామ తపస్వీ రాజా తిన కే కాజ సకల తుమ సాజా | 27

ఔర మనోరథ జో కోయీ లావై తాసు అమిత జీవన ఫల పావై | 28

చారోం యుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధ జగత ఉజియారా | 29

సాధు సంత కే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే | 30

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా అస వర దీన జానకీ మాతా | 31

రామ రసాయన తుమ్హరే పాసా సదా రహో రఘుపతి కే దాసా | 32

తుమ్హరే భజన రామ కో పావై జనమ జనమ కే దుఖ బిసరావై | 33

అంత కాల రఘుపతి పుర జాయీ జహాం జన్మ హరిభక్త కహాయీ | 34

ఔర దేవతా చిత్త న ధరయీ హనుమత సేయి సర్వ సుఖ కరయీ | 35

సంకట హరై మిటై సబ పీరా - జో సుమిరై హనుమత బలబీరా | 36

జై జై జై హనుమాన గోసాయీ కృపా కరహు గురు దేవ కీ నాయీ | 37

జో శత బార పాఠ కర కోయీ ఛూటహి బంది మహా సుఖ హోయీ | 38

జో యహ పఢై హనుమాన చలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా | 39

తులసీదాస సదా హరి చేరా కీజై నాథ హృదయ మహ డేరా | 40

దోహా: పవనతనయ సంకట హరణ మంగళ మూరతి రూప్ రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప్ |

తెలుగు అనువాదం

ఎమ్మెస్ రామారావు తెలుగులోకి అనువాదం చేశారు[1]. దాని తొలి పంక్తులు, చివరి పంక్తులు క్రింద ఇవ్వబడినవి.

శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు ||

బుద్ధిహీనతను కలిగిన తనువులు
బుద్భుదములని తెలుపు సత్యములు ||శ్రీ||

1. జయ హనుమంత జ్ణానగుణవందిత
జయపండిత త్రిలోక పూజిత ||

2.రామదూత అతులిత బలధామ
అంజనీపుత్ర పవనసుతనామ ||39. తులసీదాస హనుమాను చాలీసా
తెలుగున సుళువుగ నలుగురు పాడగ ||

40. పలికిన సీతారాముని పలుకున
దోశములున్న మన్నింపుమన్నా ||శ్రీ||

మంగళ హారతి గొను హనుమంత - సీతారామ లక్ష్మణ సమేత |
నా అంతరాత్మ నిలుమో అనంత - నీవే అంతా శ్రీహనుమంత ||

సర్వ కార్య సిద్ధి

రామచరిత మానసము అనే గ్రంథము వ్రాసిన శ్రీ తులసి దాసుకు హనుమంతుని దర్శనము జరిగిన పిదప ఆ ఆనందములో హనుమాన్ చాలీసా వ్రాసారని ప్రతీతి. కేవలం హనుమంతుని స్మరించటం వలన బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, రోగము లేకపోవుట, వాక్శుద్ధి, సాధ్యం కాని పనులు సాధ్యమగుట మున్నవి కలుగునని తులసీదాసు ఒక ద్విపదలో చెప్పాడు.

మాధ్యమాలు

ధ్వనిరూపంలో[2], దృశ్య శ్రవణ రూపంలో డిజిటల్ యానిమేషన్ రూపంలో హనుమాన్ చాలీసాను రూపొందించారు.[3]

ఇవికూడా చూడండి

మూలాలు

Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
  1. ఎం.చిత్తరంజన్ (2018). "ఈ విశాల ప్రశాంత...". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (6): 12–13.
  2. "Lineage shows". The Hindu. 2002-11-29. Retrieved 2011-06-25.
  3. "Hanuman Chalisa in digital version". The Hindu Business Line. 2003-02-26. Retrieved 2011-06-25.

https://bhakti.askintelugu.com/hanuman-chalisa-lyrics-telugu/