"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
హార్డువేర్
ఈ article లో మూలాలేమీ లేవు. |
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
హార్డ్వేర్ (Hardware) అనే ఆంగ్ల పదాన్ని సాధారణంగా సాంకేతిక పరికరాలలో భాగాలను సూచించడానికి వాడుతారు. అయితే కంప్యూటర్ వినియోగం, సంబంధిత పదజాలం సాధారణమైనందున ప్రస్తుత కాలంలో ఈ పదం కంప్యూటర్లోని భఌతిక పరికర భాగాలను సూచించడానికి అధికంగా వాడుతున్నారు. కంప్యూటర్ల రంగంలో సాఫ్ట్వేర్ కాని దానిని, అంటే భౌతికమైన పరికరాలను, వాటికి సంబంధించిన పరిజ్ఞానాన్ని కూడా "హార్డ్వేర్" అనే అర్ధంలో ప్రస్తావిస్తున్నారు. నిజానికి దీనిని కంప్యూటర్ హార్డ్వేర్ అనడం సమంజసం.
చారిత్రికంగా చెక్క సామానులను చేయడానికి, మరింత బలపరచడానికి వాడే మేకులు, కడ్డీలు, గొళ్ళాలు, తాళాలు, గొలుసులు, వాటిపై పనిచేసే కార్మికులు - ముఖ్యంగా వడ్రంగులు వాడే పరికరాలు వంటి లోహ సామగ్రిని హార్డ్వేర్ అనేవారు. "హార్డ్వేర్ షాపు"లు గా బజారులో ఉండే దుకాణాలలో లభించేవి ఈ వస్తువులే. ఇంకా పెద్ద పెద్ద మిలిటరీ సామగ్రి (విమానాలు, ఫిరంగులు, ఓడలు, ట్యాంకులు) వంటివాటిని కూడా "మిలిటరీ హార్డ్వేర్" అని ప్రస్తావిస్తుంటారు.
కంప్యూటర్ హార్డువేరు
కంప్యూటర్లోను, సంబంధిత వస్తువులలోను ఉన్న పరికర భాగాలను (అంటే మన కంటికి కనిపించే వస్తువులు, సాఫ్ట్వేర్ కాదు) హార్డ్వేర్ అంటారు. కంప్యూటర్ హార్డువేరులో ముఖ్యమైన భాగాలు
- మదర్ బోర్డు
- సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (సి.పి.యు.), దానికి కలిపి ఉన్న ఫాన్
- ఫర్మ్వేర్ (Read only memory) ROMలో ఉండేది.
- కంప్యూటర్ బస్
- బస్ కంట్రోలర్స్
- పవర్ సప్లై
- విడియో డిస్ప్లే కంట్రోలర్ బోర్డు
- సిడి, డివిడి, ఫ్లాపీ వంటి మీడియా డ్రైవులు
- హార్డ్ డిస్క్, దాని కంట్రోలర్
- యుఎస్బి ఫ్లాష్ డ్రైవ్
- సౌండ్, గ్రాఫిక్ కార్డులు, పరికరాలు
- మోడెమ్
- నెట్వర్క్ కార్డ్
- ఇన్పుట్ పరికరాలు: కీబోర్డు, మౌస్, ట్రాక్ బాల్, టాబ్లెట్, గేమ్ కంట్రోలర్, స్కానర్, కెమెరా, మైక్రోఫోన్ వంటివి
- అవుట్పుట్ పరికరాలు - ప్రింటర్, స్పీకర్, మానిటర్ వంటివి
'బొద్దు పాఠ్యంవాలు పాఠ్యం
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
en:Hardware de:Bauteil es:Ferretería fr:Matériel lmo:Hardware no:Jernvare ru:Аппаратное обеспечение th:ฮาร์ดแวร์ tl:Mga kagamitang metal yi:הארדוועיר