"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

హితబోధిని

From tewiki
Jump to navigation Jump to search
హితబోధిని
రకముమాస పత్రిక[1]
ఫార్మాటు

యాజమాన్యం:
ప్రచురణకర్త:బండారు శ్రీనివాసశర్మ
సంపాదకులు:బండారు శ్రీనివాసశర్మ
ప్రధాన సంపాదకులు:బండారు శ్రీనివాసశర్మ
స్థాపన1913
భాషతెలుగు
నిర్వహణ ఆగిపోయిన1917
ప్రధాన కేంద్రముపాలమూరు

హితబోధిని తెలంగాణాలో తొలి స్వతంత్ర పత్రిక. ఇది 1913లో పాలమూరు లో ప్రారంభించబడినది.[2] ఇది మొట్టమొదటి తెలంగాణ తెలుగు మాసపత్రిక. దీనికి 500 మంది చందాదారులు ఉండేవారు. రెండేళ్లకు ఇది మూతపడింది. [3]

విశేషాలు

ఈ పత్రికలో సకల రంగాల వార్తలకు తగిన ప్రాధాన్యం ఈ పత్రికలో ఇవ్వబడినది[4]. దీనిని బండారు శ్రీనివాసశర్మ అన్నీ తానే అయి నడిపించాడు. హితబోధిని లభ్యమైన ప్రతుల్లోనే 1913-15 మధ్య శ్రీనివాస శర్మ స్వయంగా ఏడెనిమిది కథలు వ్రాసి ప్రచురించడం కనుగొనబడినది. ఇందులో రాజయ్య సోమయాజులు, మృత్యువు దాని జ్ఞాపకం, కువైద్య రాజు కథలు ఆనాటి కాలంచెల్లిన సాంప్రదాయాలను, వాటికి చురకలు వేసే చికిత్సలను అధ్బుతంగా చిత్రించాయి.[5]

మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ దగ్గరలోని ముష్టిపల్లి జాగీరుదారు బడారు శ్రీనివాస శర్మ 1913లో హితబోధిని పత్రికను తీసుకొచ్చినట్లుగా చారిత్రక పరిశోధనల్లో బహిర్గతమైంది.[4] ఈ పత్రిక ఇతర విషయాలతో పాటు, సాహిత్యానికి విస్తృతమైన స్థానాన్ని ఇచ్చింది. హితబోధినిలో ప్రచురితమైన అనేక కవుల పద్యాలు తెలంగాణ నుంచి వెలువడిన తొలి విడత ఆధునిక కవిత్వ రచనలుగా పరిగణించవచ్చు. హితబోధినిలోని పద్యాలన్నీ నాటి తెలంగాణ ప్రాంతీయతను సూటిగా, స్పష్టంగా ప్రకటిస్తున్నాయి.

"దేశాధ్యక్షుడు దేశపాలకులు తద్దేశాధికార క్రియావేశుల్‌ శిల్పుల్‌ వర్తకుల్‌" ఎంతమంది ఉన్నా కోశాధ్యక్షుడు కాపువాడేనని, అతడే దేశానికి వెట్టి చేస్తున్నాడని హితబోధిని సంపాదకుడు బండారు శ్రీనివాసరావు రాసిన పద్యం తెలంగాణ వ్యవసాయిక తత్వాన్ని పట్టి యిస్తుంది.[6]

మూలాలు

  1. "ఓరుగల్లు పత్రికలు.. ఉద్యమ వేదికలు".
  2. "telangana-history-the-role-of-press-fourth-estate-in-public-awarehess-of-telahgana".
  3. "తెలుగు వనంలో పత్రికా గుబాళింపు".
  4. 4.0 4.1 "తొలి తెలుగు అడుగులు".
  5. "తెలంగాణ కథ - సాహిత్య ప్రస్థానం 2 వ భాగం" (PDF).
  6. "తెలంగాణలో ఆధునిక వచన కవిత్వం".

బయటి లంకెలు