"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

హైదరాబాదు రాష్ట్రంలోని టాకీసులు

From tewiki
Jump to navigation Jump to search
దస్త్రం:Yakut Mahal Deluxe at Yakatpura in Old city, Hyderabad.jpeg
హైదరాబాదులోని యాకూత్ మహల్

తెలంగాణలోని సినిమా, ముంబై సినిమాకు సమాంతరంగా సాగడంతోపాటు, దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే అలనాటి హైదరాబాద్ రాష్ట్రంలో సినిమాల నిర్మాణం కన్నా ముందుగానే సినిమా టాకీసులు నిర్మాణమయ్యాయి. 1930 నాటికి హైదరాబాదు రాష్ట్రంలో దాదాపు 17 సినిమా టాకీసులు ఏర్పడ్డాయి.[1][2]

మూడో సాలార్‌జంగ్ మీర్ యూసుఫ్ అలీఖాన్ ఆధ్వర్యంలో దివాన్ దేవిడి ప్యాలెస్ ప్రాంగణంలో 1920లో సెలెక్ట్ టాకీస్‌ పేర హైదరాబాదులో తొలి పర్మినెంట్ థియేటర్ నిర్మాణం జరిగింది. నిజాం కుటుంబ సభ్యుల కొరకు మాత్రమే నిర్మించిన ఈ థియేటర్ కోసం లండన్ నుండి 16 ఎం.ఎం. ప్రొజెక్టర్‌ను దిగుమతి చేసుకున్నారు.

ప్రారంభదశలో టెంట్‌ హాల్స్‌లో రాత్రిపూట మొదటి, రెండవ ఆటలు మాత్రం వేసేవారు. పర్మినెంట్‌ హాల్స్‌ వచ్చాక కూడా కొన్నాళ్లపాటు ఇదే పద్ధతి కొనసాగింది. రెండు, నాలుగు, ఆరు, పది అణాలుగా టికెట్టు ధరలు ఉండడంతోపాటు కాస్త ఎక్కువ డబ్బు పెట్టగలిగే వారికోసం రెండు రూపాయలతో ప్రత్యేకంగా అమర్చిన విశాలమైన సోఫా టికెట్టు ఉండేది. 1948 వరకు నమాజు చేసుకోవడానికి ఇంటర్వెల్‌ ఇచ్చేవారు.

టాకీసుల జాబితా

క్ర.సం టాకీసు పేరు నిర్మించిన సంవత్సరం ఇతర వివరాలు
1 నిషాత్ (డేరా టాకీస్) 1920 పుత్లిబౌలిలో (నేటి వివేకవర్ధిని కాలేజీ ప్రాంతం) ఆర్.ఎం. మోడీ సోదరులు నడిపేవారు.
ఇందులో మొదటి, రెండు షోలు మాత్రమే సినిమాలు ఆడేవి. అవేకాకుండా సితార, లీలాదేశాయ్
వంటి తొలి తరం నటుల ప్రదర్శనలు, పృథ్వీరాజ్ కపూర్ పఠాన్, దీవార్ నాటకాలను ప్రదర్శనలు జరిగాయి.
2 సెలెక్ట్‌ టాకీస్‌ (స్టేట్‌ టాకీస్‌) 1920 మూడో సాలార్‌జంగ్‌ మీర్‌ యూసుఫ్‌ అలీఖాన్‌ దివాన్‌ దేవిడీ ప్యాలేస్‌ ప్రాంగణంలో
నిజాం కుటుంబ సభ్యుల కోసమే ఉద్దేశించబడిన థియేటర్‌. దీనిలో లండన్‌ నుండి దిగుమతి చేసుకున్న
16 ఎం.ఎం. ప్రొజెక్టర్‌ను అమర్చడం జరిగింది
3 దక్కన్‌ టాకీస్‌ 1920 ఎం.డి. సర్దార్‌ఖాన్‌ నిర్మించాడు
4 సాగర్ టాకీస్ సెప్టెంబర్‌, 1925 తొలినాటి పర్మినెంట్ థియేటర్లలో ఇది ఒకటి. రాజా బిర్బన్ గిర్జి నిర్మించిన ఈ థియేటర్‌లో దేశ విదేశాల
మూకీలను ప్రదర్శించేవారు. 1931లో తొలి భారతీయ టాకీ ఆలం ఆరా ఈ థియేటర్‌లో ప్రదర్శిస్తున్నప్పుడు
నాటి ఏడవ నిజాం హాలు మొత్తం ఆయనే బుక్ చేసుకొని, తన కుటుంబ సమేతంగా సినిమాను చూశాడు.
5 రాయల్ టాకీస్ 1927
6 యాకూత్ మహల్ 1930 1927లో తయారై చికాగో నుండి దిగుమతి చేసుకున్న రెండు అత్యాధునిక ప్రొజెక్టర్లు అమర్చడం ఆ రోజుల్లో
గొప్పగా చెప్పుకున్న ఈ థియేటర్లో ఎనభైయేళ్లుగా సినిమాలు ప్రదర్శింపబడుతున్నాయి.[1]
7 కృష్ణా టాకీస్ 1932 చార్‌మినార్ సమీపంలోని గుల్జార్ హౌజ్‌లో నిర్మించబడింది.
8 సెలెక్ట్ టాకీస్ ఫిబ్రవరి 11, 1937
9 జమ్రూద్ మహల్ జూన్ 14, 1937 దేవకీబోస్ సీత (దుర్గాఖోట్, పృథ్వీరాజ్ కపూర్) చిత్రంతో ప్రారంభంకావలసిన ఈ టాకీస్ బిల్వమంగళ్‌తో ప్రారంభమైంది.
ఈ బిల్వమంగళ్ చిత్రం బ్రిటన్‌లో ప్రాసెస్ అయిన తొలి భారతీయ చిత్రం.
10 సాగర్ టాకీస్ ఫిబ్రవరి 5, 1938
11 నిషాత్ ఆగష్టు 24, 1939
12 దిల్షాద్ నవంబర్ 13, 1939 ఆబిడ్స్‌ లోని ప్రేమ్ టాకీస్‌ను ఖాసిం అలీ ఫాజిల్ కొని 1939లో దానిని దిల్షాద్‌గా మార్చారు.
13 రాజ్‌మహల్ ఏప్రిల్ 8, 1940
14 ఆర్గుస్ 1935 -40 లాల్ దర్వాజా కట్టెలమండి
15 ఆర్గుస్ 1935 -40 నారాయణగూడ, (తెలుగు సినిమాలు)
16 ఆర్గుస్ 1935 -40 ఆగాపూర్, (హిందీ సినిమాలు)

మూలాలు

  1. 1.0 1.1 Lua error in ...ribunto/includes/engines/LuaCommon/lualib/mwInit.lua at line 23: bad argument #1 to 'old_ipairs' (table expected, got nil).
  2. Lua error in ...ribunto/includes/engines/LuaCommon/lualib/mwInit.lua at line 23: bad argument #1 to 'old_ipairs' (table expected, got nil).