"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
అల్యూమినియం ఆంటిమొనైడ్
![]() | |
గుర్తింపు విషయాలు | |
---|---|
సి.ఎ.ఎస్. సంఖ్య | [25152-52-7] |
పబ్ కెమ్ | 91307 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 246-667-3 |
SMILES | [Al]#[Sb] |
| |
ధర్మములు | |
AlSb | |
మోలార్ ద్రవ్యరాశి | 148.742 g/mol |
స్వరూపం | black crystals |
సాంద్రత | 4.26 g/cm3 |
ద్రవీభవన స్థానం | 1,060 °C (1,940 °F; 1,330 K) |
బాష్పీభవన స్థానం | 2,467 °C (4,473 °F; 2,740 K) |
insoluble | |
Band gap | 1.58 eV |
వక్రీభవన గుణకం (nD) | 3.3 |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం
|
Zinc blende |
T2d-F-43m | |
కోఆర్డినేషన్ జ్యామితి
|
Tetrahedral |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
-50.4 kJ/mol |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
65 J/mol K |
ప్రమాదాలు | |
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత |
317 °C (603 °F; 590 K) |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
![]() ![]()
| |
Infobox references | |
అల్యూమినియం అంటిమొనైడ్ ఒక రసాయన సంయోగపదార్ధం. ఇది ఒక అకర్బన రసాయన సంయోగపదార్ధం. ఇది ఆవర్తన పట్టికలోని సమూహం/గ్రూప్ మూడు-ఐదు కుటుంబానికి చెందిన అల్యూమినియం-ఆంటిమొనిమూలకాల సంయోగము వలన ఏర్పడిన రసాయనపదార్థం. అల్యూమినియం ఆంటిమొనైడ్ ఒక అర్దవాహకం (semiconductor).
భౌతిక ధర్మాలు
అల్యూమినియం ఆంటిమొనైడ్ నల్లని స్పటికములుగా ఘనరూపంలో ఉండును. అల్యూమినియం ఆంటిమొనైడ్ అణుభారం 148.742 గ్రాములు/మోల్[1].25 °C వద్ద అల్యూమినియం ఆంటిమొనైడ్ సంయోగపదార్ధం సాంద్రత 4.26 గ్రాములు/సెం.మీ3.అల్యూమినియం ఆంటిమొనైడ్ సమ్మేళనపదార్ధం ద్రవీభవన స్థానం 1,060 °C (1,940 °F;1,330K)., అల్యూమినియం ఆంటిమొనైడ్ బాష్పీభవన స్థానం 2,467 °C (4,473 °F;2,740 K)[2]. ఈ రసాయనపదార్ధం నీటిలో కరుగదు. అల్యూమినియం ఆంటిమొనైడ్ స్వయం దహనఉష్ణోగ్రత (Autoignition temperature) 317 °C (603 °F; 590K)
అణు సౌష్టవం
అల్యూమినియం ఆంటిమొనైడ్ అణువు అల్లిక స్థిరాంకం (lattice constant) 0.61 nm.అణువులో పరమాణువుల అప్రత్యక్ష బంధఖాళి 300K (27 °C) వద్ద సుమారుగా 1.6 eV.ప్రత్యక్ష బంధఖాళి 2.22 eV.అల్యూమినియం ఆంటిమొనైడ్ అణువుయొక్క ఎలక్ట్రాన్ మొబిలిటి 200 cm²•V−1•s−1., హోల్ మొబిలిటి 300K (27 °C) వద్ద 400 cm²•V−1•s−1.అల్యూమినియం ఆంటిమొనైడ్ వక్రీభవన సూచిక, 2 µm తరంగ దైర్ఘ్యంవద్ద 3.3. మైక్రోవేవ్ ఫ్రిక్వేన్సిసిస్ వద్ద అల్యూమినియం ఆంటిమొనైడ్ డైఎలెక్ట్రిక్ స్థిరాంకం 10.9[1].అణువు సమన్వయచతుర్భుజ సౌష్టవాన్ని కల్గిఉన్నది.
రసాయన చర్యలు
అల్యూమినియం ఆంటిమొనైడ్ ఇతరగ్రూప్ III-V పదార్థాలతో రసాయనచర్య వలన త్రికరసాయన పదార్థాలను ఏర్పరచును. ఉదాహరణకు AlInSb, AlGaSb,AlAsSb. అల్యూమినియం ఆంటిమొనైడ్ లోని అంటిమొనైడు క్షయికరణలక్షణం వలన అల్యూమినియం ఆంటిమొనైడ్ మండేలక్షణము కల్గిఉన్నది.అల్యూమినియం అంటి మొనైడ్ను మండించి నపుడు అల్యూమినియం ఆక్సైడ్, అంటిమొని ట్రైఆక్సైడ్ ఏర్పడును.
వినియోగం
అల్యూమినియం ఆంటిమొనైడ్ ఒక అర్దవాహకం.దీనిని ఎలక్ట్రో ఆప్టికల్ ఉపకరణాలలో ఉపయోగిస్తారు., ఎక్సు-కిరణాల, గామాకిరణాలను గుర్తించుటకు ఉపయోగిస్తారు.[1]
ఇవికూడా చూడండి
మూలాలు/ఆధారాలు
- ↑ 1.0 1.1 1.2 "Aluminium Antimonide (AlSb) Semiconductors". azom.com. http://www.azom.com/article.aspx?ArticleID=8427. Retrieved 23015-10-11.
- ↑ "Aluminum Antimonide". americanelements.com. https://www.americanelements.com/aluminum-antimonide-25152-52-7. Retrieved 2015-10-11.