"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:ఈ వారపు వ్యాసం జాబితా

From tewiki
Jump to navigation Jump to search

వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం వ్యాసం లక్ష్యం.

ఈ వారపు వ్యాసం

2021 15వ వారం

మూస:వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 15వ వారం


ప్రతిపాదించడం

క్రింద ఇవ్వబడిన సూచనలు గమనించి, మీరు ప్రతిపాదించ దలచుకొన్న వ్యాస చర్చాపేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అన్న మూసను ఉంచండి.
వ్యాసాన్ని ఈ పరిగణన జాబితాలో చేర్చేముందు ఈ క్రింది సూచనలు పాటించండి.

  • వ్యాసం కనీసం ఐదు కిలోబైట్లకు మించి ఉండాలి. 10 కిలోబైట్లకు మించి ఉంటే ఇంకా మంచిది.
  • వ్యాసం గతంలో ఎపుడైనా విశేష వ్యాసముగాగానీ, ఈ వారం వ్యాసంగా కానీ ప్రదర్శింపబడి ఉండరాదు (ఇది వరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శించబడినా, ఆ తరువాత కాలములో వ్యాసం యొక్క నాణ్యత గణనీయంగా పెరిగి ఉన్నా, లేదా విశేష వ్యాసం స్థాయికి చేరుకొని ఉన్నా, ఈ నియమానికి వెసులుబాటు ఇవ్వవచ్చు).
  • వ్యాసంలో అనువదించవలసిన భాగాలు ఉండరాదు. ఒకవేళ కొన్ని చిన్న చిన్న అనువాదాలు చేయవలసి ఉండీ పరిగణనలో చేర్చినా, మొత్తం వ్యాసం అనువదించే వరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శింపబడదు. సాధారణంగా అనువాదము చేయవలసిన భాగాలున్న వ్యాసాలను జాబితాలో చేర్చకండి.
  • వ్యాసంలో కనీసం ఒక సంబంధిత బొమ్మ అయినా ఉండాలి.
  • తెలుగు వికీపీడియా రాశి, వాసి పెరిగే కొలది సభ్యులు చర్చించి అదనపు నియమాలను ప్రకటించవచ్చు.


వ్యాసం వార నిర్ణయం

పండగలు, చారిత్రాత్మక రోజులు, ప్రస్తుత ఘటనలకు సంబంధించిన విషయాలను బట్టి వారం వ్యాసాన్ని నిర్ణయించండి. /2021 ISO కేలండర్ వారం సంఖ్య ను చూడండి. వారం వ్యాసం ప్రపంచ ప్రామాణిక కాలం (UTC/GMT) ప్రకారం మారుతుందని (అంటే భారతదేశంలో సోమవారం ఉదయం 05:30 గంటలకు) గమనించండి. వారం వ్యాసం పేరు, వారంతో ప్రత్యేక సంబంధము వివరాలు వున్నప్పుడు రాయండి. ఎంపికకు వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు వర్గాన్ని చూడండి. యాంత్రిక అనువాద వ్యాసాలుగా గుర్తించినవాటి నాణ్యత పెంపొందించటంలో (ఎరుపు లింకులు తొలగించటం, స్థానికత దగ్గరైన వివరాలు చేర్చటం లాంటివి) ప్రత్యేక శ్రద్ద కావాలని గమనించండి

నిశ్చయమైన వ్యాసం చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} ను చెరిపేసి {{ఈ వారం వ్యాసం|సంవత్సరం=????|వారం=??}} అన్న మూసను ఉంచండి.

2021 జాబితా

2021 సంవత్సరానికి గాను వీలయినంతవరకు ఈ జాబితా ప్రకారం "ఈ వారం వ్యాసం" పరిచయ రూపాన్ని (వ్యాస ప్రవేశికలో మొదటి కొన్ని పేరాలు)(కనీసం వారం రోజుల ముందుగా) తయారు చేయాలి. క్రింద నున్న పట్టికలో సంబంధిత వారం అంకెను నొక్కితే "ఈ వారం వ్యాసం - ఫలాని వారం" అనే ఖాళీ పేజీ తెరుచుకొంటుంది. ఆ సంక్షిప్త వ్యాస రూపాన్ని ఆ పేజీలో వ్రాయాలి. ఆ వ్యాసపు పేరుని క్రింది పట్టికలో లింకుగా పేర్కొనాలి.

ఈ వ్యాసాలు ప్రదర్శనకు ముందు కొంత మెరుగు పరచవలసిన అవుసరం ఉందని గమనించగలరు. పరిచయం, అక్షర దోషాలు, అంతర్వికీ లింకులు, కాపీ హక్కులు, తటస్థత వంటి విషయాలను తప్పక పరిశీలించండి.


ఇవి కూడా చూడండి

సంవత్సరం వారీగా సాధారణ జాబితా, కంప్యూటర్ ద్వారా విశ్లేషణకు ఉపయోగం

వ్యాసాల చర్చాపేజీల వర్గాలు

ప్రదర్శిత సంవత్సరం వారీగా

ప్రదర్శిత వారం వారీగా

వ్యాస పరిచయపేజీలు

వ్యాస పరిగణనలు

ఇతరాలు