"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:తెవికీ వార్త/2010-07-01/మాటామంతీ-వైజాసత్య

From tewiki
Jump to navigation Jump to search

మూస:వికీపీడియా:తెవికీ వార్త/మూస:తెవికీ వార్త మొదలు

మూస:వికీపీడియా:తెవికీ వార్త/మూస:తెవికీ వార్త వ్యాసము మొదలు


దస్త్రం:వైజాసత్య.jpg
రవి వైజాసత్య
  • వికీపీడియా పరిచయం ఎప్పుడు, ఎలా

2005 ఏప్రిల్లో ఒకరోజు ఇంటర్నెట్టుపై గూగూల్లో ఏదో విషయమై శోధిస్తుండగా ముత్యాల్లాంటి మొదటిపేజీ అనే తెలుగు పదాలు కనిపించి “అరే! గూగూల్లో శోధనా ఫలితాల్లో తెలుగు కూడా వస్తుందా?” అని ఆశ్చర్యపోయి ఆ లింకు మీద క్లిక్ చేసి తెలుగు వికీపీడియాలో అడుగుపెట్టాను. అసలు వికీపీడియా అన్న విజ్ఞానపు ఖని ఉందన్న విషయం కూడా మొదటి సారి అప్పుడే తెలిసింది. చాలామంది వికీపీడియా పరిచయమై, ఆ తర్వాత వికీపీడియా తెలుగులో కూడా ఉంది అని ఆశ్చర్యపోతుంటారు. కానీ, నా విషయంలో రివర్సులో జరిగింది. ఆంగ్ల వికీ ఉందని తెలుసుకున్న తర్వాత అందులో కొన్నాళ్ళు కృషిచేశాను. తెలుగులో టైపు చెయ్యాలంటే చాలా ప్రయాస పడాల్సివచ్చి దీనికంటే ఆంగ్ల వికే నయమనిపించేది. కానీ అప్పుడప్పుడు తెలుగుతో కూడా కుస్తీ పడుతుండేవాన్ని. ఆ తర్వాత పద్మతో పరిచయం, లేఖినితో స్నేహంతో తెవికీప్రయాణం సరదాగా సాగింది.

  • సభ్యుడుగా/నిర్వహకులుగా ఇప్పటివరకు జరిపిన కృషి, గుర్తింపులు

అందరూ కలిసి చేస్తున్న పనిని కాస్త క్రమబద్దీకరించే ప్రయత్నం చేశాను.

  • ప్రస్తుతం తెవికీలో చేస్తున్న కృషి

రోజువారీ నిర్వహణ వ్యవహారాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ ఒక సాధారణ సభ్యునిగా సమాచారాన్ని పోగుచేసి వ్యాసాలను అభివృద్ధి పరచటం, దిద్దటం ఇష్టం. అవి సమయం దొరికినప్పుడు చేయటానికి ప్రయత్నిస్తుంటాను.

  • వికీ సమాచారానికి మీకు ముఖ్యమైన వనరులు

ఏదైనా అంశాన్ని గూగుల్ ఉపయోగించి క్షుణ్ణంగా శోధిస్తాను. గూగూల్ బుక్స్ తరచూ ఉపయోగిస్తాను. శాశ్వతమైన లింకుల్లేని తెలుగు పత్రికలను మూలంగా ఉదహరించడం నాకిష్టముండదు. తెలుగులో కూడా వెతికే అలవాటుండం వళ్ళ మిగతా వాళ్లకు సాధారణంగా తట్టని సమాచారం కూడా నాకు దొరుకుతుంది. ఆర్కైవ్స్.ఆర్గ్ లోని తెలుగు గ్రంథాలుకూడా చక్కని వనరు. బాగా సమయమున్నప్పుడు గ్రంథాలయాలకు వెళ్ళి సమాచారం సేకరించేవాన్ని, కానీ ఇప్పుడు కుదరట్లేదు.

  • వికీ కృషి లో నచ్చినవి/ నచ్చనివి/హాస్య సంఘటనలు

బోల్డన్ని.. నిర్వాహణా వ్యవహారాలు తప్పనిసరై నిర్వహించాల్సి వచ్చింది కానీ, అవేవీ లేకుండా కేవలం సమాచారాన్ని శోధించడం, వ్యాసాలు వ్రాయటం ఇష్టం. నాలో అంతర్లీనంగా ఉన్న ఆ డిటెక్టివ్ జీనే వికీపీడియా దోమ నన్ను కుట్టడానికి దోహదం చేసిందనుకుంటా.

  • వికీ ఉపయోగపడిన విధం

వివిధ రంగాల్లో నాకు తెలిసిన విషయాల విస్తృతి అమాంతగా పెరగటమే కాకుండా అన్నింటికంటే ముఖ్యంగా నాకు తెలుగు చాలా మెరుగుపడటానికి వికీ చాలా దోహదం చేసింది. వికీకి ముందు నా తెలుగు ఒక పదేళ్ళ కుర్రవాడి స్థాయిలో ఉండేదంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. (ఇప్పుడేదో పండితుని స్థాయికి చేరానని కాదు!)

  • తెవికీ భవిష్యత్తుకి కలలు

కేవలం తెలుగు వికీపీడియాలోనే ఉండగల కొన్ని తెలుగు అంశాలున్నాయి. అవి వీలైనంత క్షుణ్ణంగా తెవికీలో పొందుపరచాలి. అలాంటి వ్యాసాలకు ప్రాధాన్యత నిస్తూ, తెవికీలో కనీసం ఒక్క వెయ్యి వ్యాసాలను విశేషవ్యాసాల స్థాయిలో తీర్చిదిద్ది ఒక తెలుగు వికీపీడియా సిడీని విడుదల చేసి అన్ని గ్రామ పాఠశాలల్లోనూ పంచిపెట్టాలి.

  • తోటి సభ్యులు నుండి మీ కోరికలు

వికీలో పట్టువిడుపుతో వ్యవహరించండి. శైలి, సమాచారం కంటే సముదాయం ముఖ్యమైనది. వికీ స్ఫూర్తిని గుర్తించండి. మీరు వ్రాసింది ఎవరూ దిద్దకూడదనుకుంటే మీ వికీ ప్రయాణం అట్టేకాలం సాగదు, సాగినా ఆనందదాయకంగా ఉండదు.

  • భారత కాలమానం ప్రకారం వికీ పీడియాలో కృషి చేసే రోజు(లు)/సమయం

సాధారణంగా మధ్యాహ్నం. (మరీ అప్పుడేగా మాకు అపరాత్రయ్యేది)

  • తోటి సభ్యులు సంప్రదించాలనుకుంటే, మీ కిష్టమైన సంప్రదింపు విధం

ఈ-మెయిల్ ఫర్వాలేదు.

  • తెవికీ వార్త చదువరులకి సందేశం

తెవికీ మనం ముందు తరాలకిచ్చే కానుక. వ్యక్తికి బహువచనం శక్తి అని శ్రీశ్రీ అన్నట్టు అందరం తలా ఒక చెయ్యి వేసి తెవికీ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. మూస:వికీపీడియా:తెవికీ వార్త/మూస:తెవికీ వార్త వ్యాసము చర్చ చివర